సోహైల్ నీవు మగాడివని తెలుసు.. యాంకర్ సుమ జబర్దస్త్ పంచ్
బిగ్‌బాస్ తెలుగు 14లో దీపావళీ పండుగ సందర్బంగా ఇంట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని హోస్ట్ నాగార్జున చెప్పారు. దాంతో వైల్డ్ కార్డు ఎంట్రీగా సుమ అదిరిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీ అనుకుంటే.. మైల్డ్ కార్డుగా నీవు ఎంట్రీ ఇచ్చావంటే.. మైల్డ్ కార్డు ఎంట్రీ కాదు.. మైల్డ్ కార్డు ఎంట్రీ అని సుమ అన్నారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులకు సుమను పరిచయం చేయడంతో అందరూ షాక్ తిన్నారు. సుమను చూసి అందరూ సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఇంటిలో సుమ చేసిన అల్లరి ఎలా ఉంది అంటే..

మీరు, మీ కోడలు యాంకరింగ్ చేస్తే
బిగ్‌బాస్‌లోకి ఎందుకు వెళ్లాలనుకొంటున్నావు అంటూ సుమను నాగార్జున ప్రశ్నిస్తే.. బయట మీరు యాంకరింగ్ చేసేస్తున్నారు. అంతేకాకుండా మీ కోడలు కూడా యాంకరింగ్ మొదలుపెట్టింది. ఇక బయట మాకు ఏమి మిగిలింది. బిగ్‌బాస్‌లొకి వెళ్లడానికి తప్పా అంటూ సుమ పంచ్ వేసింది. దాంతో నాపైనే పంచ్ వేస్తావా అంటూ నాగార్జున మరో పంచ్ వేశారు.

నీవు మైక్ మింగి పుట్టావు అంటూ నాగ్
నువ్వు బాగా డ్రామా ప్లే చేసేందుకు ప్రిపేర్ అయినట్టు కనిపిస్తున్నావంటే.. నేను పుట్టిందే డ్రామాతో అని సుమ అన్నారు. కాదు నువ్వు పుట్టింది మైక్‌తో అంటూ గుర్తుందా అంటే అవును మైక్‌తోనే అంటూ సుమ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా హెస్టింగ్ బ్రహ్మండంగా చేస్తున్నారు. ఏం జరుగుతున్నదో అని సుమ దీర్ఘాలు తీస్తే.. థ్యాంక్యూ.. నీవు చెబితే కరెక్ట్ అంటూ నాగార్జున అన్నారు.

బిగ్‌బాస్ ఇంట్లో అంతా ఫ్రీ..
బిగ్‌బాస్‌లోకి వెళితే వాళ్ల పరిస్థితి ఏమవుతుంది అంటే.. బయట కంటే ఇంటిలోనే వారు బాగా ఉన్నారు. ప్రపంచంలో ఎవరైనా హ్యాపిగా ఉన్నారంటే.. వాళ్లే.. ఫ్రీ ఫుడ్.. ఫ్రీ బెడ్.. అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ సుమ కామెంట్ చేసింది. అంతేకాకుండా ఫ్రీ ఫేస్.. ముఖానికి మాస్కులు లేకుండా తిరిగేస్తున్నారు అంటూ సుమ చెప్పింది.

ఆడవాళ్లు జాగ్రత్త అంటూ నాగ్
ఇక ఇంటి సభ్యులకు సుమను పరిచయం చేశారు. ఫెస్టివల్ సందర్భంగా ఇంట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ జరుగుతుంది. ఆడవాళ్లు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. దాంతో ఇంట్లో వాళ్లంతా షాక్ తిన్నారు. రండి రండి పాట అంటూ స్వాగతం పలికారు. ఇంటి సభ్యులను చూసి ఎక్స్‌ప్రెషన్ మారిపోతున్నది అంటూ సుమ కామెంట్ చేసింది.

నీవు షాక్ లేవు అంటూ సుమ
సుమ ఎంట్రీ ఉంటుందని ఊహించలేదు అంటూ అందరూ కామెంట్ చేశారు. అయితే అరియానా, మెహబూబ్ నవ్వడం లేదు అంటూ సుమ కామెంట్ చేసింది. సుమ కామెంట్‌కు మెహబూబ్ సమాధానం ఇస్తూ.. నేను షాక్‌లో ఉన్నాను అంటే.. నీవు షాక్‌లో లేవు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నావు అంటూ సుమ పంచ్ విసిరింది.
Recommended Video

నీవు ఆడ కాదు.. మగ
ఇక సోహైల్ గురించి చెబుతూ.. నేను చేయను.. నేను ఆడా.. నేను పోతా.. నేను దూక.. బరాబర్ ఇస్తానని అంటాడని సుమ పంచ్ వేసింది. నీవు ఆడ కాదు.. నీవు మగనే అనే విషయం మాకు తెలుసు సుమ కామెంట్ చేయడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. సోలార్ ఎనర్జీని సోహైల్ కోపం నుంచి జనరేట్ చేయవచ్చేమో అంటూ సుమ అనుమానం వ్యక్తం చేసింది. అవును బిగ్‌బాస్‌కు కరెంట్ ఫ్రీగా వస్తుంది అంటూ నాగార్జున అన్నారు.


Click it and Unblock the Notifications











