నువ్వు నామినేట్ చేసినా ఇక్కడే ఉంటా.. నేను ఎలిమినేట్ అయితే నీకెందుకు? అఖిల్‌పై అభిజిత్ గరం

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అభిజిత్, అఖిల్ సార్థక్ ఇద్దరూ తమ మధ్య విభేదాలను పరిష్కరించుకొని ఫ్రెండ్స్‌గా మారినట్టు కనిపించినా.. సోమవారం ప్రసారమైన నామినేషన్ ప్రక్రియలో వారి మధ్య అభిప్రాయబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. అఖిల్ తనను నామినేట్ చేయడాన్ని అభిజిత్ జీర్ణించుకోలేకపోయాడు. దాంతో తన అసహనాన్ని అభిజిత్ వ్యక్తం చేస్తూ..

సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ చెప్పి

సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ చెప్పి

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అఖిల్ లేవనెత్తిన పాయింట్‌ను అభిజిత్ ఖండించాడు. టీ టేబుల్ టాస్క్ సమయంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కారణం చెప్పి తప్పుకోవడం పెద్ద తప్పు. దాని వల్ల ఇమ్యునిటీ కోల్పోయావు. ఒకవేళ పూర్తిగా ఆడి ఉంటే నీకు ఇమ్యునిటి లభించే అవకాశం ఉండేదేమో అంటూ అఖిల్ చెప్పగా.. ఎమో అనే విషయాన్ని నేను పట్టించుకోను. బిగ్‌బాస్ ఇలాంటి ట్విస్టు ఇస్తారని ఊహించలేం కదా అంటూ అఖిల్ అన్నాడు.

నా గేమ్‌లో నాకో ప్లాన్ ఉంటుంది..

నా గేమ్‌లో నాకో ప్లాన్ ఉంటుంది..

అఖిల్ తనను జడ్జ్ చేయడంపై అభిజిత్ స్పందిస్తూ.. టాస్క్ ఆడేటప్పుడు నీకో ప్లాన్ ఉంటుంది. నాకో ప్లాన్ ఉంటుంది. నీ ప్లాన్ ప్రకారం నేను ఆడలేను కదా.. అలాంటి సమయంలో నా గురించి ఓ రకంగా జడ్జ్ చేసి నామినేట్ చేయడం తప్పు. కెప్టెన్సీ టాస్క్‌లో ఒకవేళ నలుగురు ఉండి ఉంటే బిగ్‌బాస్ ఇమ్యునిటీ నిర్ణయం తీసుకొని ఉండేవారు కాదేమో అని అభిజిత్ అన్నాడు.

నామినేట్ చేసి చాక్లెట్ ఇస్తావా?

నామినేట్ చేసి చాక్లెట్ ఇస్తావా?

నామినేషన్ల ప్రక్రియ తర్వాత అభిజిత్ వద్దకు అఖిల్ వచ్చి చాక్లెట్ ఇచ్చాడు. దాంతో నామినేట్ చేసి చాక్లెట్ ఇస్తావా? అంటూ తీసుకోవడానికి నిరాకరించాడు. దాంతో నిన్ను కావాలని నామినేట్ చేయలేదు. అయితే అందులో పాయింట్ ఉంది. ఆ కారణంగానే నేను నామినేట్ చేశాను అంటూ అఖిల్ తన నిర్ణయం గురించి వివరణ ఇవ్వబోయాడు. నీవు ఇంకా కాసేపు ఉండాల్సింది. ఉంటే ఇమ్యునిటీ వచ్చేది కదా అనే ఫీలింగ్ కలిగింది అంటూ కామెంట్ చేశాడు.

 నా నిర్ణయాన్ని గౌరవించాల్సింది..

నా నిర్ణయాన్ని గౌరవించాల్సింది..

అయితే అఖిల్ వాదనను అభిజిత్ తప్పుపట్టాడు. నా గేమ్‌లో నేను తీసుకొన్న నిర్ణయాన్ని తప్పుపట్టొద్దు. ఇంకా స్వయంగా బయటకు వచ్చినందుకు రెస్పెక్ట్ చేయాలి. అంతేగానీ ఆ పాయింట్‌ను తీసుకొని నన్ను నామినేట్ చేయడం సరికాదు. నేను నీకు దగ్గర కావాలని ్రయత్నిస్తుంటే.. టాస్క్‌లో అర్ధంపర్థం లేని పాయింట్‌ తీసుకొని నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అని అభిజిత్ పేర్కొన్నాడు.

 హారికను నామినేట్ చేయాల్సింది

హారికను నామినేట్ చేయాల్సింది

ఇమ్యునిటీ ఉంటుందో లేదో అనేది ప్రశ్నార్థకం. బిగ్‌బాస్ ఇలా ఇమ్యునిటి చాయిస్ ఇస్తారనేది ఎవరూ ఊహించనిది. అలాంటి సమయంలో నేను ఆడే గేమ్ గురించి నేను నా వ్యక్తిగతం నిర్ణయం తీసుకొన్నాను. దానిని నీవు పాయింట్‌గా తీసుకొని నామినేట్ చేశాడు. నీకు ఏ కారణం లేకుండా ఉంటే.. టాస్క్ సరిగా ఆడలేదని హారికను నామినేట్ చేయాల్సింది. నా నిర్ణయం వల్ల నేను ఇంటి నుంచి బయటకు పోతాను.. నీకేంది అంటూ అఖిల్‌కు అభిజిత్ ఎదురు ప్రశ్న వేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X