దివికి బిగ్‌బాస్ బంపర్ ఆఫర్.. అందరి కంటే ఓ గంట ఎక్కువగా.. స్పెషల్ ప్యాకేజ్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 47వ రోజు సందడిగా ప్రారంభమైంది. ఇంటి సభ్యులందరూ టాస్క్‌లతో హోరెత్తించారు. ఎప్పటిలానే గొడవలు, వివాదాలు, సంబరాలతో సాగిపోయింది. ఇంటిలోని టాస్క్‌లో గెలిచిన దివి వద్యాకు బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకు దివికి లభించిన ఆఫర్ ఏమిటంటే..

టాస్కుతో ఇంటి సభ్యుల దిన చర్య
ప్రతీ రోజు పండగే చిత్రంలోని బావా మా అక్కను చక్కగా చూస్తావా అనే పాటతో ఇంటి సభ్యుల దిన చర్య ప్రారంభమైంది. ఇంటి సభ్యులందరూ లేచి పాటకు హుషారుగా స్టెప్పులు వేశారు. ఆ తర్వాత ఇంటిలో టాస్క్‌లకు తెరలేచింది. ఉదయం ఎనిమిది గంటలకే ఓ టాస్క్‌ను ఇస్తూ ఇంటి సభ్యుల్లో జోష్ నింపారు. దాంతో ఆ టాస్క్‌ను ఆడేందుకు ఇంటి సభ్యులు మ్యాట్రస్ వద్దకు చేరుకొన్నారు. బజర్ మోగగానే బెడ్‌పైకి దూకారు.

పడకపైకి చేరి జోష్‌తో
సెంచరీ మ్యాట్రెస్ టాస్క్‌తో 47 రోజు ప్రారంభమైంది. బిగ్‌బాస్ చెప్పిన రూల్స్ ప్రకారం.. మ్యాట్రెస్‌పై ఆరంభం నుంచి చివరి వరకు ఏ సెలబ్రిటి అయితే ఉంటారో వారే విజేతగా నిలుస్తారని చెప్పారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరూ మ్యాట్రెస్‌పైకి ఎక్కి గెలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మిగితా సభ్యులందరూ ఒకరిని ఒకరు మ్యాట్రస్‌పై నుంచి లాగేసుకొంటూ కనిపించారు.

దివికి బంపర్ ఆఫర్ ఇలా..
సెంచరీ మ్యాట్రస్ టాస్క్ ముగిసినట్టు ప్రకటించిన బిగ్‌బాస్.. దివిని విజేతగా ప్రకటించారు. విజేతగా నిలిచినందున మ్యాట్రెస్‌పై ఒకరోజు పడుకొనే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఉదయాన్ని ఓ గంట లేటుగా లేచే వెసులుబాటుగా ఉంటుంది అని ఆఫర్‌ను ప్రకటించారు. దాంతో దివి ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇంటి సభ్యుల్లో మెహబూబ్, అమ్మా రాజశేఖర్, ఇతరులతో తన ఆనందాన్ని పంచుకొన్నారు.
Recommended Video

ఆనందంతో దివి వద్యా
47వ రోజు రాత్రి బిగ్‌బాస్ ఏర్పాటు చేసిన పడకపైకి దివి వెళ్లారు. పడక ఏర్పాటు చాలా బాగుంది. మంచి ఫీల్‌ను ఇస్తుంది. ఇంట్లో నా బెడ్‌పై పడుకొన్నట్టు ఉంది. థ్యాంక్యూ బిగ్‌బాస్ అంటూ దివి ఆనందంలో మునిగిపోయారు. అలా స్పెషల్ ఆఫర్‌ను ఎంజాయ్ చేస్తూ దివి మరో రోజును ఫీల్‌గుడ్‌గా ముగించింది.


Click it and Unblock the Notifications











