నీ సంగతి చూస్తా.. మెహబూబ్‌కు అరియానా వార్నింగ్.. పరేషాన్‌లో సోహైల్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 43 రోజు నామినేషన్ల ప్రక్రియ కావడంతో ఇంటి సభ్యుల మధ్య గందరగోళం నెలకొన్నది. అరియానా గ్లోరి, మెహబూబ్ దిల్ సే మధ్య నామినేషన్ ప్రక్రియ ఉండటంతో జోరుగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. మెహబూబ్ ప్రవర్తనపై అరియానా తీవ్రస్థాయిలో మండిపడింది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అరియానా ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే...

అరియానా వర్సెస్ మెహబూబ్ దిల్‌సే
మెహబూబ్ తాను నామినేట్ చేయడానికి నిరాకరించడంతో అరియానా తీవ్ర అసహానానికి గురైంది. నేను సేవ్ అవుతానని రిక్వెస్ట్ చేస్తే అంగీకరించలేదు. నా రిక్వెస్ట్‌ను ఆమోదించకుండా నాకే రిక్వెస్ట్ పెట్టాడు. ఇక అతడి నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లభించదని అర్ధమైంది. చాలా సేపు చర్చించుకొన్న తర్వాత కూడా ఓ నిర్ణయానికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేను నామినేట్ అవుతున్నాను అని అరియానా చెప్పారు.

మెహబూబ్‌పై అరియానా ఫైర్
అరియానా నామినేట్ అవుతున్నానని బిగ్‌బాస్‌కు చెప్పిన తర్వాత మెహబూబ్ వచ్చి.. నీవు ఈ ఎలిమినేషన్లో బయపడుతావు. నీకు ఏమీ కాదు. నేను మళ్లీ ఎప్పుడైనా నీకు సహాయం చేస్తాను అంటూ మెహబూబ్ చెప్పబోగా.. అరియానా పట్టించుకోకుండా ముఖం తిప్పేసుకుంది.

అరియానా హర్ట్ కావడంతో సోహైల్ రంగంలోకి
ఇక మెహబూబ్ చేసిన పనికి అరియానా తీవ్రంగా హార్ట్ కావడంతో ఆమెను బుజ్జగించేందుకు సోహైల్ సయ్యద్ రంగంలోకి దిగాడు. నీకు ఏమీ కాదు. నీవు ఇంటిలోనే ఉంటావు. నీవు సేఫ్ అవుతావు అంటూ సోహైల్ బుజ్జగించాలని ప్రయత్నిస్తే... నేను ఫీల్ కాను.. నన్ను ఒకరు సహాయం చేయమని అడిగారు.. నేను సహాయం చేసి బయటకు వెళ్తున్నాను అని అనుకొంటాను. మెహబూబ్ సంగతి చూస్తా అని అరియానా సమాధానం ఇచ్చింది.

అరియానాకు సపోర్ట్‌గా
అరియానా తీసుకొన్న నిర్ణయాన్ని, తాను వినిపించిన వాదనను ఇంటిలోని మెజారీటి సభ్యులు సపోర్టు చేశారు. నీ వాదన వింటున్నంత సేపు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నీవు ప్రతీ పాయింట్ చక్కగా మాట్లాడావు అంటూ అఖిల్ అన్నారు. లాస్య, అమ్మా రాజశేఖర్ మాస్టర్ కూడా అభినందించారు.
Recommended Video

మెహబూబ్ దిల్‌సేపై అసహనం
ఇదిలా ఉండగా, నామినేషన్‌లో మెహబూబ్ అనుసరించిన తీరుపై సోహైల్ కొంత అసహనం వ్యక్తం చేశాడు. అరియానాను సపోర్ట్ చేసినందుకు ఆమెతో మాట్లాడి సముదాయించు అని సోహైల్ సూచించాడు. అయితే నా సంగతి చూస్తానని చెప్పింది అంటూ మెహబూబ్ కంగారు పడిపోయాడు. తన స్నేహితుడు కోసం సోహైల్ అరియానాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ కనిపించాడు.


Click it and Unblock the Notifications











