Bigg Boss exclusive: నామినేషన్లలో అరియానా, అవినాష్.. ఈ వారం ఎలిమినేషన్‌ గురించి క్రేజీ వార్త

అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌ ఏడో వారానికి చేరుకొన్నది. అయితే గత సీజన్లను చూసుకొంటే బిగ్‌బాస్‌లో ఏడో వారం అత్యంత కీలకంగా మారిందనే విషయం స్పష్టమవుతుంది. గతంలో మాదిరిగానే ఈ వారం కూడా బిగ్‌బాస్‌కు ఈ వారం అత్యంత కీలకంగా మారనున్నదనే సంకేతాలను ఇస్తున్నారు. ఈ వారానికి సంబంధించిన నామినేషన్లు ఇలా ఉన్నాయి.

నామినేట్ అయిన వారిలో

నామినేట్ అయిన వారిలో

ప్రతీ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రసారం అవుతుంది. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ ఇంటిలో ముగిసింది. తాజా వివరాల ప్రకారం ఏడోవారానికి సంబంధించిన ఎలిమినేషన్‌ కోసం అభిజిత్, నోయల్ సీన్, దివి వాద్యా, అవినాష్, మోనాల్ గజ్జర్, అరియానా నామినేట్ అయ్యారు. హారిక, అఖిల్, సోహైల్, మెహబూబ్, లాస్య తదితరులు నామినేషన్ నుంచి సేఫ్ అయినట్టు సమాచారం.

అమ్మా రాజశేఖర్ రిలీఫ్

అమ్మా రాజశేఖర్ రిలీఫ్

ఇక ఇంటి సభ్యుల్లో అమీ తుమీ టాస్క్ సంబంధించిన విషయంలో నాగార్జున ఇచ్చిన డీల్‌ను స్వీకరించి అరగుండు కొట్టించుకోవడంతో అమ్మా రాజశేఖర్‌కు ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి విముక్తి లభించింది. ఇక నోయల్ స్వయంగా తనకు తాను నామినేట్ చేసుకోవడంతో కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకోలేకపోయాడు.

ఏడో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఇలా

ఏడో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఇలా

ఇక ఏడోవారం బిగ్‌బాస్‌కు ప్రత్యేకంగా మారబోతున్నదనే సంకేతాలు అందాయి. ఈ వారం ఇంటిలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండకపోవచ్చనే వార్త బయటకు వచ్చింది. ఈ వారం ఇంటి సభ్యులకు ఎలిమినేషన్‌ నుంచి కొంత ఊరట ఇచ్చే ప్రక్రియను తెరపైకి నిర్వాహకులు తీసుకురానున్నట్టు సమాచారం. ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియను నిలిపివేయడం ఖాయంగా కనిపిస్తున్నది.

తదుపరి వారం డబుల్ నామినేషన్

తదుపరి వారం డబుల్ నామినేషన్

ఏడోవారంలో ఎలిమినేషన్ ప్రక్రియను రద్దు చేసి ఎనిమిదో వారంలో డబుల్ ఎలిమినేషన్‌కు తెరలేపుతారనే విషయంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఏడో వారంలో ఇంట్లోని ఒకరిని ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూమ్‌కు పంపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి ప్లాన్ చేస్తే మోనాల్‌ను ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూమ్‌కు తరలించే అవకాశం ఉంది.

Recommended Video

Bigg Boss Telugu 4 : ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా ? నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్,ఏడ్చేసిన సోహైల్
కుమార్ సాయి ఎలిమినేషన్‌పై అనుమానాలు

కుమార్ సాయి ఎలిమినేషన్‌పై అనుమానాలు

ఇక ఆరోవారం ఇంటి నుంచి కుమార్ సాయిని బయటకు పంపించడంపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కుమార్ సాయిని కావాలనే బలి పశువుగా మార్చారనే విషయం ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటికే దేవీ, సుజాత విషయంలో తప్పు జరిగిందనే వాదనకు బలం చేకూరే విధంగా కుమార్ సాయి ఎలిమినేషన్ కారణమైంది. ఈ నేపథ్యంలో రానున్న ఎలిమినేషన్లపై బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్తపడే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X