సమంతకు అవినాష్ జబర్దస్త్ పంచ్.. అక్కినేని కోడలు వార్నింగ్‌తో లబోదిబో!

బిగ్‌బాస్‌ తెలుగు ఇంటిలో దసరా పండుగ వాతావరణం కనిపించింది. స్పెషల్ ఎడిషన్‌గా సాగే ఎపిసోడ్‌కు సమంత అక్కినేని హెస్ట్‌గా వ్యవహరించనున్నారు. రంగస్థలం సినిమాలోని పాటతో వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఇంటి సభ్యులపై సెటైర్ బాణాలను సంధించింది. ముఖ్యంగా అవినాష్, అఖిల్‌ను మాటలతో ఆటాడుకొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్


సమంత హోస్ట్‌గా వ్యవహరించే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు ఆసక్తికరంగా రిలీజ్ చేశారు. వేదికపైకి వచ్చిన సమంత ఈ రోజు మీకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది అంటూ షో ఎలా ఉండబోతుందోననే విషయంపై హింట్ ఇచ్చారు. ఇక ఇంటి సభ్యులకు చురకలంటిస్తూ వేదికపైన ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

అఖిల్‌కు షాకిచ్చిన సమంత అక్కినేని

అఖిల్‌కు షాకిచ్చిన సమంత అక్కినేని

అరియానా, దేత్తడి హారికను పలకరించారు. ఇక అఖిల్‌ను చూసి డ్రెస్ బాగుంది. గుజరాతీ స్టైలా అంటూ సమంత ఆటపట్టించారు. దాంతో అమ్మో దొరికిపోయానే అంటూ అఖిల్ ముఖం పెట్టారు. అఖిల్‌ను మోనాల్ సిగ్గుపడుతూ కనిపించింది. ప్రతీ సభ్యుడితో మాట్లాడుతున్నంత సేపు ఫుల్ ఎనర్జీతో సమంత కనిపించారు.

అవినాష్‌ను ఆడుకొన్న అక్కినేని కోడలు

అవినాష్‌ను ఆడుకొన్న అక్కినేని కోడలు

ఇక అవినాష్‌ను మాత్రం ఓ రేంజ్‌లో ఆటాడుకొన్నారు. కోపం ఎందుకు అంటూ ప్రశ్నిస్తే.. నేను మనిషినే కదా.. నాకు కోపం ఉంటుంది అంటూ అవినాష్ సమాధానం ఇచ్చారు. అయితే కోపం వస్తే సోఫా మీద రాసుకో అని సమంత అంటే.. మేడమ్ ఇది మీ వరకు వచ్చిందా అంటూ అవినాష్ అమాయకంగా సమాధానం ఇచ్చారు.

కోపం వస్తే సోఫా మీద రాసుకో

కోపం వస్తే సోఫా మీద రాసుకో

అరియానా నీవు కూల్ అంటూ కొద్ది రోజుల క్రితం అవినాష్ సోఫా మీద రాసిన విషయాన్ని నాగార్జున హైలెట్ చేయడంతో ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అదే విషయాన్ని సమంత మరోసారి హైలైట్ చేసింది. సోఫా మీద రాసుకునే విషయం ఇప్పుడు బయట ట్రెండింగ్ అంటూ అవినాష్‌కు షాకిచ్చింది.

నా మీదే పంచ్ వేస్తావా? నా ఫ్యాన్స్‌కు చెబుతా

నా మీదే పంచ్ వేస్తావా? నా ఫ్యాన్స్‌కు చెబుతా

ఇక అవినాష్‌ను ఆటపట్టిస్తూ.. ఇంట్లో నీకు బలం ఏమిటి అంటే.. నా బలం ప్రేక్షకులే అంటూ సమాధానం ఇచ్చారు. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి టైమ్ బాగానే తీసుకొన్నావు అని సమంత అంటే.. నాకు వాచీ కూడా లేదు అంటూ అవినాష్ పంచ్ విసిరాడు. ఓహో నాపైనే పంచ్ వేస్తావా?.. ఉండు నా ఫ్యాన్స్‌కు చెబుతా అంటూ సమంత వార్నింగ్ ఇచ్చింది. దాంతో లబోదిబో మంటూ అవినాష్ కంగారు పడిపోయారు. నేను సమంత ఫ్యాన్స్ అధ్యక్షుడి.. జై సమంత అంటూ అవినాష్ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
వేదికపైన అదరగొట్టిన సమంత

వేదికపైన అదరగొట్టిన సమంత

సమంత వ్యవహారం చూస్తూ హెస్ట్‌గా బిగ్‌బాస్ వేదికపైన గట్టిగానే అదరగొట్టినట్టు కనిపిస్తున్నది. ఇంటి సభ్యులతో ఆహ్లాదకరంగా మాట్లాడుతూ చలాకీగా కనిపించారు. మధ్య మధ్యలో సెటైర్లు, వార్నింగులు ఘాటుగా కనిపించింది. అంతేకాకుండా నవ్వులు రువ్వుతూ వేదికపైన ఆకట్టుకొన్నది. సంప్రదాయ చీరకట్టులో సమంత మరింత అందంగా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X