అఖిల్, మోనాల్ మధ్య చిచ్చు పెట్టిన యాంకర్ లాస్య.. మళ్లీ భోరున ఏడుస్తూ..
బిగ్‌బాస్ ఇంటిలో 50వ రోజున నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కంటెస్టెంట్ల పరిస్థితి గందరగోళంగా మారింది. అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ మధ్య ఎమోషనల్‌గా డిస్కషన్ జరిగింది. లాస్యను మోనాల్ గజ్జర్ నామినేట్ చేయడంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటి సభ్యులతో విబేధాలను పరిష్కరించుకొనే విషయంపై మోనాల్‌కు అఖిల్ క్లాస్ పీకుతూ...

లాస్యతో ప్రాబ్లెంను ఎందుకు సాల్వ్ చేసుకోలేదు
ఇంట్లో ఎవరితోనైనా ఏదైనా సమస్య అనిపిస్తే వారితో వెళ్లి క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పాను. లాస్యతో నీకు సమస్య ఉన్నప్పుడు ఎందుకు సాల్వ్ చేసుకోలేదు. అక్కా నీతో నాకు ఇలాంటి ప్రాబ్లెం ఉందని ఎందుకు చెప్పలేదు. ఆమె నీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఎందుకు వెళ్లలేదు. ప్రాబ్లెంను ఎందుకు సాల్వ్ చేసుకోలేదు అంటూ అఖిల్ క్లాస్ పీకాడు.

లాస్య అంటే నాకు గౌరవం
లాస్యను నామినేట్ చేయాలని అనుకోలేదు. లాస్యను నామినేట్ చేయవద్దని అనుకొన్నాను. లాస్క అంటే నాకు అక్క. అక్క అంటే నాకు చాలా గౌరవం. కానీ ఆమె నా గురించి ఏమన్నారో తెలుసా? అఖిల్‌తో ఉంటున్నది.. అతడితోనే మాట్లాడుతూ ఉన్నది అంటూ కామెంట్ చేసింది. అందుకే నేను ఆమెను నామినేట్ చేశానని మోనాల్ క్లారిటీ ఇచ్చింది.

అఖిల్‌కు మోనాల్ కౌంటర్
అఖిల్ మాటలకు మోనాల్ స్పందిస్తూ.. నేను నిన్ను ఎందుకు నామినేట్ చేయడం లేదు. నాకు నీ మీద ఓ క్లారిటీ ఉంది. కానీ కొన్ని విషయాలపై తెలియకుండా మాట్లాడకూడదు. అందుకే నేను ఆమెను నామినేట్ చేశాను అని అన్నారు. నేను అభిజిత్ మ్యానుపులేటర్ అని అన్నది నిజమే. ఇలా ఎన్నో అనుకొంటాం అంటూ అని చెప్పింది.

లాస్యతో నేను మాట్లాడాలా? అంటూ అఖిల్
అయితే ఒక టాపిక్‌పై గొడవ జరిగిన అది క్లోజ్ అయినప్పుడు మళ్లీ తవ్వకూడదు. ఇంట్లో ప్రతీసారి అలానే జరుగుతున్నది. లాస్య, నీకు మధ్య మ్యాటర్ అలానే ఉంది. ఇంకా సాల్వ్ కాలేదు. దానిని క్లియర్ చేసుకో. కావాలంటే నేను లాస్యతో మాట్లాడుతాను అని అఖిల్ అంటే.. ప్లీజ్ నీవు మా మధ్య విభేదాలు పరిష్కరించుకోవడానికి చొరవ తీసుకో అంటూ అఖిల్‌కు మోనాల్ సూచించింది.


Click it and Unblock the Notifications











