పాపం అఖిల్.. దెబ్బ మీద దెబ్బ.. కోలుకోలేకుండా ఒకరి తర్వాత ఒకరు!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్‌లో బలమైన కంటెస్టెంట్లలో అఖిల్ సార్థక్ ఒకరు. అయితే గతవారం రోజులుగా ఆయనకు వరుసగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. కెప్టెన్సీ టాస్క్ తర్వాత అఖిల్ సహనం కోల్పోవడం ఆయన గేమ్‌పై, ప్రవర్తనపై ప్రభావం చూపుతున్నది. ఇంటిలోకి వచ్చిన ప్రతీ ఒక్కరు కూడా అభిజిత్‌ను ప్రశంసించడం అఖిల్‌కు పెద్ద దెబ్బగానే మారుతున్నది. ఇక అఖిల్‌కు ఎదురైన ప్రతికూల అంశాలు ఏమిటంటే..

మోనాల్‌తో ప్రవర్తన తీరు
కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సహకరించలేదనే విషయంపై అఖిల్ వ్యవహరించిన తీరు అటు ప్రేక్షకుల్లోను, కంటెస్టెంట్లలోను అసంతృప్తి వ్యక్తమైంది. హారికకు మోనాల్ సపోర్టు చేయడంతో ఇంటిలో అసహనం, ఆవేశంతో ఊగిపోయారు. టేబుల్‌పై కొట్టబోయి కిందపడి నవ్వులపాలయ్యాడు.

అభిజిత్‌కు అఖిల్ సోదరుడి ప్రశంసలు
బిగ్‌బాస్ ఇంటిలోకి వచ్చిన అఖిల్ సోదరుడు కూడా అభిజిత్ నేను నీకు ఫ్యాన్ అని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మోనాల్ తల్లి కూడా అభిజిత్‌ను ప్రశంసించడం అఖిల్‌కు ప్రతికూలంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే గేమ్‌లో అభిజిత్‌కు అఖిల్ ప్రధాన ప్రత్యర్థి కావడమే గమనార్హం.

అఖిల్‌తో అభిజిత్ తండ్రి
ఇక అభిజిత్ తండ్రి కూడా అఖిల్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు. నీ గేమ్ బాగుంటుంది. కానీ కెప్టెన్సీ టాస్క్ తర్వాత మోనాల్ తీరు గురించి నీవు వ్యవహరించిన విధానం బాగాలేదు. ఆ తర్వాత ఎందుకో నీవు కాస్త వెనుకబడినట్టు కనిపిస్తున్నది అంటూ అభిజిత్ తండ్రి పేర్కొనడంతో అఖిల్ కాస్త నిరాశకు లోనయ్యాడు.

అఖిల్‌తో నాగార్జున కూడా
వారాంతం షోలో నాగార్జున కూడా అఖిల్ తీరును ప్రశ్నించాడు. మటన్ షాప్ మేక వివాదంలో అభిజిత్‌కు వాదనకు నాగ్ సపోర్టు చేయడం కూడా అఖిల్‌కు మైనస్‌గా మారిందనే చెప్పాలి. ఇంటిలోకి వచ్చిన ప్రతీ ఒక్కరు కూడా అభిజిత్‌ను స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పడం అఖిల్ గ్రాఫ్‌ను తగ్గించిందనే చెప్పాలి.

అఖిల్ నీ మైనస్ అదే..
ఇవి ఇలా ఉంటే.. అఖిల్ గురించి లాస్య మాట్లాడుతూ.. నీవ గేమ్ బాగానే ఆడుతున్నావు. కానీ నామినేషన్ సమయంలో ఎక్కువగా ఆవేశంతో ఊగిపోతున్నావు. అది మంచి కాదు. ఎదుటి వాళ్ల మాటలను కూడా వినాలి. అలా కాకుండా ఎదుటి వాళ్లను అర్ధం చేసుకొంటే మంచింది అంటూ లాస్య కామెంట్ చేసింది. ఇది ఇలా ఉంటే.. టాప్ 2లో సోహైల్, అభిజిత్ ఉంటారని నాగ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంతో అఖిల్ ముఖం పాలిపోయింది.


Click it and Unblock the Notifications











