శాంతి అంటే నీ రెండో సెటప్పా.. అమ్మా రాజశేఖర్‌కు అరియానా ఝలక్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో భాగంగా 44వ రోజు ఇంటిలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం ఇంటిలోని సభ్యులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపును రాక్షసులుగా, మరో గ్రూపును మానవులుగా విభజించారు. మానవులు, రాక్షసుల టీమ్ మధ్య హోరా హోరీగా టాస్క్ జరిగింది. అయితే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను గెలుచుకోవడానికి ఇంటి సభ్యులు చేసిన ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే..

అమ్మా రాజశేఖర్‌ను విసిగిస్తూ..
అవినాష్, హారిక, అరియానా, మెహబూబ్, అఖిల్‌ను రాక్షసుల గ్రూపుగా, అభిజిత్, అమ్మా రాజశేఖర్, నోయల్ సీన్; లాస్య, దివిని మానవుల గ్రూపుగా చేశారు. మానవులు గ్రూపును కొంటె రాక్షసులు తమ చిలిపి చేష్టలతో విసిగించే ప్రయత్నం చేశారు. ఎవరైతే కోపగించుకొంటారో వారిని రాక్షసుల గ్రూపులో కలిపేసుకొవాల్సి ఉంటుంది. అలాగే మనుషులు తమ మంచి పనులతో రాక్షసులను మానవులుగా మార్చేసుకోవాలి. ఇలా ఈ టాస్క్ కొనసాగింది.

శాంతి శాంతి అంటూ అమ్మా రాజశేఖర్
అమ్మా రాజశేఖర్‌ను అరియానా విపరీతంగా విసిగించారు. అమ్మా రాజశేఖర్‌కు కోపం తెప్పించే ప్రయత్నించగా.. శాంతి.. శాంతి అంటూ జపం చేశారు. శాంతి అంటే నీకు రెండో సెటపా అంటూ అరియానా ఆటపట్టించారు. నోయల్ సీన్ తలపై అరియానా గుడ్డుకొట్టింది. రాక్షసుడిగా అవినాష్ తనదైన శైలిలో డైలాగ్స్ కొడుతూ అలరించాడు. అద్భుతంగా డైలాగ్స్ కొడుతూ తన ప్రతిభను చాటుకొన్నాడు.

మానవుల టీమ్ గెలిచి
ఇక కొంటె రాక్షసులను మానవులుగా మార్చే పనిని మనుషలు టీమ్‌కు ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్‌లో బంతిపూలు వేసి 50 దండలు కట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మానవులు బంతిపూలతో దండలు కట్టే టాస్క్‌ను విజయవంతంగా మనుషులు పూర్తి చేయడంతో ఇంటిలోని రావణాసురుడు విగ్రహంలోని రెండు తలలను పగలకొట్టే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఒకరిని మనుషుల్లో కలుపుకోవాలని సూచించగా.. అఖిల్‌ను కొంటె రాక్షసుల టీమ్ నుంచి మనుషుల టీమ్‌లోకి మార్చుకొన్నారు.

రెండు టాస్కుల్లోనూ మానవులు టీమ్ విజయం
మనుషుల టీమ్‌కు క్లేతో ప్రమిదలను చేసే టాస్క్‌ను అప్పగించారు. ఆ టాస్క్‌ను కొనసాగించకుండా రాక్షసులు అడ్డుకొన్నారు. దాదాపు 100 ప్రమిదలు చేయాల్సి ఉంటుంది. మనుషులు 160కిపైగా ప్రమిదలు చేయడంతో మనుషుల టీమ్ గెలిచినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఇది ఫన్ అంటూ డ్యాన్స్ చేస్తూ కనిపించారు.


Click it and Unblock the Notifications











