Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెనాల్ కోసం కత్తులు దూసిన కంటెస్టెంట్లు.. అఖిల్, అభిజిత్, అమ్మా ఫైట్.. గందరగోళంగా నామినేషన్లు
బిగ్‌బాస్ తెలుగు 4లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొంటూ కనిపించారు. నామినేషన్ల ప్రక్రియలో ప్రతీ ఒక్కరు ఇతరులపై తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడంతో సోమవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎవరెరవరూ నామినేట్ అయ్యారంటే...
ఎనిమిదో వారంలో నామినేషన్ల ప్రక్రియ
ఇంటిలో కొనసాగిన ఎనిమితో వారం ప్రక్రియంలో అఖిల్, అమ్మా రాజశేఖర్ మధ్య భారీగా గొడవ జరిగింది. మోనాల్ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రంగా కనిపించింది. నేను అభిజిత్‌తో మాట్లాడవద్దని చెప్పానా? ఆ విషయం నాకు బాగా హర్ట్ చేసింది. మా ఇంట్లో వారిని కూడా బాగా హర్ట్ చేసింది అంటూ అఖిల్ ఊగిపోయాడు.
అమ్మా రాజశేఖర్‌తో అఖిల్ గొడవ
అఖిల్ మాటలకు అమ్మా రాజశేఖర్ ఘాటుగా స్పందించాడు. ఎవరికి అమ్మా నాన్నలు లేరు. మీకు మాత్రమే ఉన్నారా? మేము హర్ట్ అయ్యాం అంటూ అమ్మా రాజశేఖర్ ఘాటుగా స్పందించారు. ఇలా ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ వివాదస్పదంగా, గందరగోళంగా కనిపించింది.
అరియానా వర్సెస్ మెహబూబ్
తనను మెహబూబ్ నామినేట్ చేయడంపై అరియానా భగ్గుమన్నారు. అరియానాను నామినేట్ చేస్తూ.. మన మధ్య ఉన్న కొన్ని విబేధాలు క్లియర్ కావాల్సి ఉంది. అందుకోసమే నేను నామినేట్ చేస్తున్నాను. దీంతో మన మధ్య సఖ్యత ఉండాలని కోరుకొంటున్నాను అని మెహబూబ్ అనగానే.. నామినేట్ చేసి ఇంటి నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నావు. విషయాలు ఎలా క్లియర్ అవుతాయి అంటూ అరియానా ఆగ్రహం వ్యక్తం చేసింది.
మోనాల్ మళ్లీ దండం పెట్టి
మోనాల్ గజ్జర్‌ను అభిజిత్ నామినేట్ చేస్తూ ఏదో గట్టిగానే ఫిట్టింగ్ పెట్టారు. ఎనిమిదో వారంలో కూడా అలా జరిగిందంటే.. అది బిగ్గెస్ట్ క్రైమ్ అంటూ అభిజిత్ అనడం కనిపించింది. ఆ తర్వాత మోనాల్ బొమ్మను పగలకొడుతూ నామినేట్ చేసినట్టు స్పష్టమైంది. ఈ వ్యవహారం ఇంటిలో వేడిని పుట్టించినట్టు కనిపించింది.
ఇంటిలో గందరగోళంగా నామినేషన్లు
నామినేషన్ల ప్రక్రియలో మోనాల్ విషయం హాట్ టాపిక్‌గా మారడం, ఇంటి సభ్యుల మధ్య ఆ విషయం చర్చగా మారడంతో మరోసారి గంభీర వాతావరణం నెలకొన్నది. ఎదైనా విషయం, సమస్య ఉంటే డైరెక్టుగా నాతో సంప్రదించండి, నాతో మాట్లాడండి. దయచేసి దానిని సమస్యగా మార్చకండి అంటూ మోనాల్ చేతులెత్తి దండం పెట్టింది. ఇవియే గాకుండా లాస్య, అవినాష్, హారికల మధ్య కూడా మాటల యుద్దం జరిగింది.
ఇంటిలో నామినేట్ అయిన వారు వీరే..
తాజా సమాచారం ప్రకారం.. 8వ వారానికి నామినేట్ అయిన సభ్యుల్లో.. అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా, అమ్మా రాజశేఖర్ ఉన్నారు. అభిజిత్, హారిక, సోహైల్, అవినాష్ నామినేషన్ కాకుండా మిగిలిపోయారు. ఈ ఎపిసోడ్ సోమవారం రాత్రి ప్రసారం కానున్నది. ఈ నామినేషన్లో జరిగిన వాడివేడి వాగ్వాదాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారాయి.