నాది చిల్లర కామెడా? కాలి నొప్పి అంటూ డ్రామాలు చేశావు.. నోయల్ సీన్‌పై అవినాష్ ఫైర్

బిగ్‌బాస్ ఇంటిలో నోయల్ సీన్‌కు అవినాష్ ముక్కు, అమ్మా రాజశేఖర్‌కు మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. నోయల్ ఇంటి నుంచి వెళ్లిపోతూ అవినాష్, రాజశేఖర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను నొప్పితో బాధపడుతుంటే.. మీరు జోకులు చేస్తారా? నా పరిస్థితిని చూసి కామెడీ చేస్తారా? మీ ఇద్దరిది చీప్ కామెడీ అంటూ ఆ ఇద్దరిపై మండిపడ్డాడు. అయితే నోయల్ సీన్ మాటలపై అవినాష్ భగ్గుమన్నాడు. అవినాష్ స్పందించిన తీరు ఇలా ఉంది...

అప్పుడే చెప్పాల్సింది...

అప్పుడే చెప్పాల్సింది...

నోయల్‌ను ఉద్దేశించి.. నిన్ను ఇమిటేట్ చేసినప్పుడు నీవు అప్పుడే చెప్పాల్సింది. నీవు ఒకవేళ హర్ట్ అయితే అప్పుడే నాకు ఆ విషయం చెబితే అంతటితో ఆగిపోయేది. కాని ఇప్పుడు నీవు ఇంటి నుంచి వెళ్లిపోతూ మమ్మల్ని టార్గెట్ చేయడం సరికాదు. మీరు వెళ్తూ వెళ్తూ ఇద్దరిని బ్యాడ్ చేయాలని చూడటం సరికాదు అని అవినాష్ అన్నారు.

మా ఇద్దరిని బ్యాడ్ చేసే ప్రయత్నం

మా ఇద్దరిని బ్యాడ్ చేసే ప్రయత్నం

ప్రేక్షకుల ముందు మీరు కావాలని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీవు చిల్లర కామెడీ అనడం సరికాదు అంటూ ఫైర్ అయ్యాడు. ఒకవేళ చిల్లర కామెడీ చేస్తే నేను బిగ్‌బాస్ హౌస్‌కు వస్తానా? అంటూ మండిపడ్డారు. నా కామెడీని కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి నాపై ఆరోపణలు చేస్తావా? అంటూ నోయల్ సీన్‌ను అవినాష్ నిలదీశాడు.

కాలి నొప్పి అని యాక్టింగ్ చేస్తున్నావు

కాలి నొప్పి అని యాక్టింగ్ చేస్తున్నావు

కాలి నొప్పి పేరుతో నీవు బిగ్‌బాస్‌లో యాక్టింగ్ చేశావని నేను అంటాను. ప్రతీది నాకు తెలుసు. వేదిక మీద నువ్వు నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడితే అందరూ నమ్ముతారని అనుకోకు. కొన్నిసార్లు నా కామెడీ బాగుంటుంది. నీ టైమింగ్ బాగా ఉంటుందని చెప్పిన నీవు చిల్లర కామెడీ అంటావా? అని అవినాష్ గరం అయ్యాడు.

చిల్లర కామెడీ అంటావా?

చిల్లర కామెడీ అంటావా?

ఇంట్లో ఉన్నప్పుడు నాది మంచి కామెడీ అని.. ఇప్పుడు నీవు చిల్లర కామెడీ అంటావా? మేము ఎంత బాధలో ఉండి కూడా ఇతరులను నవ్వించేందుకు ప్రయత్నిస్తామో తెలుసా? నాలుగు జోకులు చెప్పి బతుకుతామని చెప్పడం సరికాదు. కాలి నొప్పి అంటూ నీవు డ్రామాలు చేస్తున్నావు అంటూ సీరియస్ అయ్యాడు.

నాగార్జున జోక్యంతో

నాగార్జున జోక్యంతో

ఇక నోయల్‌కు, అవినాష్, అమ్మా రాజశేఖర్‌కు మధ్య వివాదం పెరిగిపోవడంతో నాగార్జున జోక్యం చేసుకొన్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయే సభ్యుడు తన అభిప్రాయలను చెబుతాడు. అవి మీకు సమంజసం అనిపిస్తే మార్చుకొండి.. లేదా వాటిని వదిలేయండి అంటూ నాగార్జున సూచించాడు. అంతేకాకుండా నోయల్‌ను కూడా వారిస్తూ ఆ గొడవకు ముగింపు పలికే ప్రయత్నం చేశాడు.

కన్నతల్లి, కళామతల్లి సాక్షిగా

కన్నతల్లి, కళామతల్లి సాక్షిగా

హోస్ట్ నాగార్జున మాటలపై అవినాష్ స్పందిస్తూ.. నోయల్‌ను గానీ.. ఇతరులను గానీ హర్ట్ చేయలేదు. నన్ను కన్న తల్లి, నాకు బతుకునిచ్చిన కళామతల్లి సాక్షిగా చెబుతున్నాను. నోయల్‌ను ఎలాంటి పరిస్థిలో బాధపెట్టాలని చూడలేదు. ఒకవేళ నావైపు తప్పు ఉంటే నా క్షమాపణలు చెబుతున్నాను అంటూ అవినాష్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X