బిగ్‌బాస్ సూపర్ క్లైమాక్స్.. అమ్మా రాజశేఖర్ సేఫ్.. ఏకంగా కెప్టెన్ కోసం.. ఎవరు అవుట్ అంటే
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో విజయవంతంగా 8వ వారం పూర్తి చేసుకొని 9వ వారంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనే విషయం ఆసక్తిగా మారింది. ఇక సండే ఎపిసోడ్ కావడంతో ఇళ్లంతా వినోదంతో నిండిపోయింది. ఇంటి సభ్యులతో ఎలాంటి ఆటలు ఆడించి ఎలిమినేసన్‌ను పూర్తి చేశారు? ఎవరు అవుట్ అయ్యారంటే..

ఊగిపోయిన అమ్మా రాజశేఖర్, అవినాష్
తను కించపరిచేలా ఇమిటేట్ చేశారని నోయల్ సృష్టించిన సునామీతో అవినాష్, అమ్మా రాజశేఖర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంటిలో నేను ఇమిటేట్ చేసినప్పుడు బాగుంది.. వన్స్‌మోర్ అంటూ సంతోషపడిన నోయల్ వేదిక ఎక్కి ఎలా నన్ను విమర్శిస్తాడు. చాలా దారుణం అంటూ అవినాష్ మండిపడ్డారు. నన్ను తలపై కొట్టి బండోడు, గుండోడు అంటూ గేలి చేసిన నోయల్ నిజస్వరూపం బయటపడింది అంటూ అమ్మా రాజశేఖర్ ఊగిపోయారు.

మ్యూజిక్ గేమ్‌తో రికార్డింగ్ డ్యాన్స్
ఇక ఇంటి సభ్యులందరినీ లాన్‌లోకి రమ్మని పాటలతో గేమ్ ఆడించారు. అభిజిత్, అఖిల్‌కు చెరో టీమ్ ఇచ్చి ఓ బజర్ ముందు నిలబెట్టాడు. ఆ తర్వాత పాటకు సంబంధించిన మ్యూజిక్‌ను ప్లే చేసి.. ఆ పాటను గుర్తించి.. దానికి డ్యాన్స్ చేయాలని రూల్ చెప్పాడు. ఈ పోటీలో పాటలను గుర్తించి.. వాటికి డ్యాన్స్ చేశారు. అయితే అఖిల్, అభిజిత్ టీమ్ ఇద్దరు సమఉజ్జీలుగా నిలిచారు.

ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకొంటూ
ఆ తర్వాత ఇంటిలోని సభ్యులతో వారు ఎలా వ్యవహరిస్తారు.. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటారో అనే అంశాలపై అనుకరించే ఒక గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో సోహైల్ ఎలా కోపంగా ఉంటారు.. కోపం లేని సమయంలో ఎలా ఉంటారు అనే విషయంపై మెహబూబ్ ఇమిటేట్ చేశాడు. ఇక అవినాష్‌ను మోనాల్ ముద్దు పెట్టుకొంటే.. ఆయన ఎలా ఫీల్ అవుతాడు అనే విషయంపై అరియానా ఇమిటేట్ చేసింది. మోనాల్ సేఫ్ అయితే అఖిల్ ఎలా ఫీలవుతాడు అనే విషయంపై అభిజిత్, అవినాష్ నటించిన తీరు ఆకట్టుకొన్నది.

అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ కావాలని ఇంటి సభ్యులు ఓట్లు
ఇక ఆటల మధ్యలో మోనాల్, అరియానా, లాస్యను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశాడు. ఈ వారం ఆరుగురు సభ్యులు నామినేట్ కాగా, అఖిల్ శనివారం ఎపిసోడ్‌లో సేవ్ అవ్వడం తెలిసిందే. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో అమ్మా రాజశేఖర్, మెహబూబ్ మాత్రమే మిగిలారు. దాంతో వారిద్దరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. ఇక ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు అనే విషయంపై ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇంటిలోని సభ్యులందరూ అమ్మా రాజశేఖర్ ఉండకూడదని ఆరుగురు సభ్యులు, మెహబూబ్ ఉండకూడదని ఇద్దరు ఓట్లు వేశారు.

మెహబూబ్ సేఫ్ అయింది ఇలా..
ఇక ఇంటిలో అమ్మా రాజశేఖర్, మెహబూబ్‌లో టెన్షన్ పెరిగింది. మెహబూబ్ నువ్వు సేఫ్ అవ్వాలిరా అంటూ అమ్మా రాజశేఖర్ భుజం తట్టారు. ఇక నాగార్జున మాట్లాడుతూ.. ఒకరు డ్యాన్సర్, మరొకరు డ్యాన్స్ మాస్టర్.. గురుశిష్యులు. కానీ ఎలిమినేషన్ తప్పదు. మెహబూబ్ సేవ్ అంటూ చెప్పారు. దాంతో అమ్మా రాజశేఖర్ ఇంటి నుంచి వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఇంటిలోకి వెళ్లి అందరికి గుడ్‌బై చెప్పి రా అంటూ నాగార్జున సూచించడంతో ఇంటిలోకి వెళ్లాడు.

నోయల్ కోరిక మేరకు అమ్మా రాజశేఖర్ సేవ్
ఇంటిలోకి వెళ్లి సూట్ కేస్ పట్టుకొని వస్తుండగా.. అమ్మా రాజశేఖర్‌ను పిలిచి నీవు సేఫ్ అన్నారు. నోయల్ ఇంటి నుంచి వెళ్తూ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయవద్దని కోరారు. అందుకు ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయడం లేదు అని నాగ్ చెప్పడంతో ఇంటి సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తనను ఇంటి నుంచి పంపి వేయాలని అమ్మా రాజశేఖర్ కొరుతుండటంతో నేను చెప్పేది విను అంటూ నాగ్ క్లారిటీ ఇచ్చారు.

ఇంటి కెప్టెన్‌గా ఎంపిక కోసం అమ్మా రాజశేఖర్
అమ్మా రాజశేఖర్‌కు నాగ్ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంటి నుంచి పంపివేయాలని నీకు ఎక్కువ ఓట్లు వేసినందున నిన్ను కెప్టెన్ టాస్క్ కోసం నేరుగా నామినేట్ చేస్తున్నాం. బిగ్‌బాస్ కూడా ఒప్పుకొన్నారు అని చెప్పారు. దాంతో అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ కాకుండా బయటపడ్డారు.అంతేకాకుండా అమ్మ రాజశేఖర్‌ను కెప్టెన్ రేసులో నిలిపి ఎనిమిదో వారానికి బిగ్‌బాస్ మంచి క్లైమాక్స్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











