మోనాల్ ఒంటెలా నడుస్తుంది.. అభిజిత్ కామెంట్స్ గురించి నాగార్జున.. అమల ప్రస్తావన తీసుకొచ్చి..
బిగ్‌బాస్‌లో వారాంతం ఎపిసోడ్‌ను నాగార్జున చాలా జోష్‌తో నడిపించాడు. ఇంటి సభ్యులకు వీడియోలు చూపించి వారి మధ్య ఉండే విభేదాలు.. వారు అనుసరిస్తున్న విషయాలను సూటిగా వారికి చెప్పాడు. ఇక బిగ్‌బాస్ జర్నిలో ఎవరు విలన్ అంటూ ఒక్కో కంటెస్టెంట్‌ను అడిగాడు. అభిజిత్‌తో ఆయన చెప్పిన పులి కథ, ఓ కంటెస్టెంట్ ఒంటె నడక, అమల గురించి నాగార్జున మాట్లాడుతూ...

అభిజిత్ పులి కథ గురించి
గత వారం మెహబూబ్‌తో అభిజిత్ మాట్లాడుతూ... తన గేమ్ ప్లాన్‌ను వివరించాడు. మగాడిని పులితో పోల్చుతారు. పులిది ఎటాకింగ్ మోడ్ కాదు. అదను చూసి వేటాడుతుంది. కొద్ది సేపు అవకాశం కోసం ఎదురు చూసి ఆ తర్వాత వేట మొదలుపెడుతుంది. కాబట్టి మనం ఏదో జరిగిందని ఎదుటి వాళ్లను టార్గెట్ చేయవద్దు. కాసేపు ఆలోచించి సమయం వచ్చినప్పుడు వారిని టార్గెట్ చేయాలి అంటూ అభిజిత్ పులి కథ చెప్పాడు.

మోనాల్ ఒంటె నడక గురించి
ఇక ఓ రోజు ఇంటిలో మోనాల్ నడుచుకుంటూ వెళ్తుంటే...అక్కడే కూర్చొని ఉన్న నోయల్, అభిజిత్ పిచ్చాపాటిగా మాట్లాడుకొంటూ కనిపించారు. మోనాల్‌ను చూసి.. ఆమెను చూస్తే నాకు ఒంటె గుర్తుకు వస్తుంది. ఒంటెలా పెద్ద పెద్ద అంగలు వేసుకొంటూ నడుస్తుంది అంటూ కామెంట్ చేశాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అలా ఊగిపోతుంటుంది అని అభిజిత్ అన్నాడు.

అభిజిత్‌తో నాగార్జున చిలిపిగా
ఇక ఆ రెండు పాయింట్స్ తీసుకొని అభిజిత్‌ను నాగార్జున ఆటపట్టించాడు. నీకు జంతువులు అంటే ఇష్టమా? పులి కథ బాగా చెప్పావు అంటూ చిలిపిగా సెటైర్ వేశాడు. నీపై నా భార్య అమల ప్రభావం ఏమైనా ఉందా? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా సమయంలో ఆమె ఏమైనా చెప్పిందా అంటూ నాగార్జున ఉత్సాహంగా అడిగారు.

నాకు అమల అలా చెప్పారు...
నాగార్జున ప్రశ్నలకు అభిజిత్ సమాధానం చెబుతూ.. నాకు జంతువుల అంటే ఇష్టం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా సమయంలో నాకు అమల చాలా విషయాలు చెప్పారు. ఎలా ఉండాలి. ఎలా మాట్లాడాలి. ఎలా వ్యవహరించాలి అనే విషయాలు చెప్పారు. అప్పటి నుంచి వాటిని పాటిస్తున్నాను. కానీ బయటకు చెబితే ఏమనుకొంటారో అనే విషయంతో కామ్‌గా ఉన్నాను అని అభిజిత్ చెప్పారు.

మోనాల్‌ను అందుకే టీజ్ చేశాను
ఇక మోనాల్ నడకను ఒంటెతో పోల్చడం ఏదో సరదాగా చేసిన పని. రాజస్థాన్‌కు గుజరాత్ దగ్గరగా ఉంటుంది కదా అని.. అలా పోల్చాను. కానీ మనసులో చెడు ఉద్దేశాలు లేవన చెప్పారు. అలాగే గత టాస్క్‌లో హారికను ఏడిపించడం వెనుక కారణాలు చెప్పాడు. ఆ తర్వాత హారికను కౌగిలించుకొని ఉపశమనం కలిగించాడు.


Click it and Unblock the Notifications











