ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా.. కథ వేరే ఉంటది మరి.. అఖిల్ తీరుపై సోహెల్ అసహనం
ప్రస్తుతం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ చాలానే కష్టపడుతున్నారు. అఖిల్ తప్ప మిగతావారు అందరూ ఇప్పుడు నామినేట్ అయ్యారు. అభిజిత్, అరియానా, సోహెల్, మోనాల్, హారిక.. డైరెక్ట్ గా నామినేట్ అయినట్లు వివరణ ఇచ్చిన బిగ్ బాస్ సోమవారం మహారాజా టాస్క్ ఇచ్చారు. అయితే ఆ టాస్క్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. మహారాజా టాస్క్ లో రూల్స్ లేకపోవడంతో ఎవరికి వారు లిమిట్స్ లేకుండా ప్రవర్తించారు. ఆడియెన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కొందరైతే ఆ విషయంపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు.
ఇక సోహెల్, అఖిల్ మధ్య గొడవ కాస్త చిల్లరగానే అనిపించింది. రాజుకు మంత్రిగా ఉండాలని అఖిల్ కు బాధ్యతలు ఇవ్వగా మధ్యలో గోడవలు మొదలయ్యాయి. అఖిల్ అందరితో సమానంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. కానీ సోహెల్ మాత్రం బట్టలు చింపుకున్నంత పని చేశాడు. హారిక మహారాణి అయినప్పుడు సోహెల్ కు టాస్క్ ఇవ్వాలని అనుకుంది. డ్యాన్స్ చేయాలని చెప్పగా అది ఈజీగా ఉందని.. అంతే కాకుండా మరొకటి చెప్పమని హరికకు సలహా ఇచ్చాడు.

15సెకన్లలో షూస్ వేసుకొని లెస్ ఒకదానికి మరొకటి కట్టుకొని డ్యాన్స్ చేయాలని హారిక చెప్పగా అందుకు సోహెల్ అసహనం వ్యక్తం చేశాడు. టాస్క్ అనేది సరదగా ఉండాలి గాని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అంటూ.. అయినా అఖిల్ ఇప్పుడు సలహా ఇవ్వడం ఏమిటని కౌంటర్ ఇచ్చాడు. ఎవడికి 'ధమ్ కి' ఇస్తున్నవ్ అంటూ అఖిల్ కూడా సమాధానం ఇచ్చాడు.
అయితే ఆ విషయంలో సోహెల్ కిచెన్ దగ్గరకు వచ్చి అరిచేశాడు. బట్టలు నీళ్ళల్లో కూడా పడేస్తున్నారు. వాళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారు. నా బట్టలైతే పడేయ్యని చుక్కలు చూపిస్తాను. కథ వేరేలా ఉంటదని అన్నాడు సోహెల్. చూస్తుంటే ఈ రోజు మళ్ళీ వారిద్దరి మధ్య గోడవ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











