For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొద్దిగంటల్లో బిగ్‌బాస్ 4.. ఫైనల్ జాబితా ఇదే.. ఈసారి రచ్చ రచ్చే

  |

  బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేసేందుకు బిగ్‌బాస్ వస్తున్నాడు. మామూలుగా జనాలకు ఉండే వీక్‌నెస్, పక్కింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలం, మనకంటే పక్కవారి విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపడం వంటి వాటిని క్యాచ్ చేసుకుని బిగ్‌బాస్ కాన్సెప్ట్ రూపొందింది. అందుకే ఈ షో ఏ ప్రాంతంలో, ఏ భాషలో మొదలుపెట్టినా సక్సెస్ అవుతోంది. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్స్ దుమ్ములేచిపోయాయి. నాల్గో సీజన్‌ నేడు అంగరంగ వైభవంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.

  #BiggBossTelugu4 : మాస్క్ ముఖానికి అవసరం, ఎంటర్టైన్మెంట్‌కు కాదు | Contestants Entry || Oneindia
  ప్రోమోలతోనే అంచనాలు..

  ప్రోమోలతోనే అంచనాలు..

  ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు ఓ రేంజ్‌లో వర్కౌట్ అయ్యాయి. బిగ్ బాస్ కాన్సెప్ట్‌ను తెలియజేసేలా గాసిప్స్, హాట్ నెస్ అంటూ ప్రతీ ఒక్క అంశం ఉండోబోతోందని చెప్పకనే చెప్పారు. ఇక షో లో ఉండబోతోంది, ఓపెనింగ్ సరమెనీ ఏ రేంజ్‌లో ఉంటుందో శాంపిల్‌గా నిన్న వదిలిన ప్రోమో తెగ వైరల్ అయింది.

  ఎంటర్టైన్మెంట్‌కు మాస్క్ అవసరం లేదు..

  ఎంటర్టైన్మెంట్‌కు మాస్క్ అవసరం లేదు..

  కింగ్ నాగార్జున ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉండబోతోంది.. సెలెబ్రిటీల డ్యాన్స్ పర్ఫామెన్స్, హాట్ హీరోయిన్ల ఎంట్రీ అబ్బో ఇలా ఎన్నెన్నో చూపించేశారు ఆ ఒక్క చిన్న ప్రోమోలోనే. ఇక నాగ్ చెప్పిన డైలాగ్ మాత్రం అదుర్స్ అనిపించింది. మాస్క్ ముఖానికి అవసరం ఎంటర్టైన్మెంట్‌కు కాదు.. అంటూ నాల్గో సీజన్‌లో ఉండబోయే వినోదం గురించి ఇచ్చిన హింట్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

   కంటెస్టెంట్ల లిస్ట్..

  కంటెస్టెంట్ల లిస్ట్..

  నాల్గో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్ట్ సోషల్ మీడియాలో ముందే లీక్ అయింది. నోయెల్, దేత్తడి హారిక, , లాస్య, గంగవ్వ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, దేవీ నాగవల్లి, సోహెల్, దివి, దిల్ సే మెహబూబా, ఆరియానా, యాంకర్ సుజాత, మోనాల్, అభిజీత్, సూర్య కిరణ్, అఖిల్ సార్థక్ వంటి వారు నాల్గో సీజన్‌ కంటెస్టెంట్లుగా రాబోతోన్నారు.

  రాహుల్-పునర్నవిలతో సర్ ప్రైజ్

  రాహుల్-పునర్నవిలతో సర్ ప్రైజ్

  బిగ్‌బాస్ 4 ఓపెనింగ్ సెరమెనీలో రాహుల్ -పునర్నవి రచ్చ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకల్లో రాహుల్ , పునర్నవి చేసే హంగామా వేరే లెవెల్‌లో ఉండోబోతందని తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ సిప్లిగంజ్ ఇచ్చిన లీక్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

  నెటిజన్ల టాక్..

  నెటిజన్ల టాక్..


  ఇక ఈ నాల్గో సీజన్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికే టాక్ మొదలైంది. ఎప్పటిలాగే షో అంటే గిట్టని వారు నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ ఐపీఎల్ టైంలో షో ఎవరు చూస్తారని సెటైర్లు వేస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల పేరిట ఆర్మీ పేజీలు ప్రారంభిస్తామని కొందరు కౌంటర్స్ వేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురుచూస్తున్నామని బిగ్‌బాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక నేటి సాయంత్రం ఆరు గంటలకు అందరూ టీవీలకు అతుక్కుపోయేలా ఉన్నారు.

  English summary
  Bigg Boss Telugu Season 4: Starts With In Hours Contestants List Goes Viral, The stage is ready to set on fire with King nagarjuna #BiggBossTelugu4 starting Today at 6 PM on.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X