Bigg Boss Telugu 4: రెండో కంటెస్టెంట్‌గా ‘సత్యం’ డైరెక్టర్ సూర్య కిరణ్
బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
రెండో కంటెస్టెంట్‌గా డైరెక్టర్ సూర్య కిరణ్ ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ కాబట్టి మంచి ఎమోషన్, కాన్సెప్ట్‌తోనే ఎంట్రీ ఇచ్చాడు. జీవితమనేది చదరంగం అని, మంచి చెడులు మనలోనే ఉంటాయని చెబుతూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉంటానని, వారి మనస్తత్వాలను అర్థం చేసుకుని మసులుకుంటానని తెలిపాడు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. రచయిత, దర్శకుడిగా మంచి గుర్తింపును సాధించాడు సూర్య కిరణ్. సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యాడు సూర్య కిరణ్. సినిమాలను తెరకెక్కించక ముందు పలు సీరియళ్లకు కథను అందించాడు, దర్శకత్వం వహించాడు. ఇతనికీ హీరోయిన్ కళ్యాణికి మనస్పర్దలు రావడంతో విడాకులు అయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా లైమ్ లైట్‌లో లేని ఈ దర్శకుడు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బుల్లితెర, వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్య కిరణ్ మళ్లీ బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక మరి ఇతని ప్రయాణం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











