బిగ్ బాస్ హౌస్‌లో కరోనా కలకలం: కంటెస్టెంట్లు జాబితా నుంచి ఆ ముగ్గురు ఔట్.!
ఏమాత్రం అంచనాలు లేకున్నా... తెలుగులో ప్రసారమై కొన్ని కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన షో బిగ్ బాస్. అస్సలు పరిచయం లేని థీమ్‌తో వచ్చినప్పటికీ... తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకుందీ షో. అందుకే దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నాలుగో దానికి రంగం సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో కరోనాతో కలకలం రేగింది. షోలో పాల్గొనబోయే ముగ్గురు కంటెస్టెంట్లకు పాజిటివ్ వచ్చినట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

ఈసారి అలాంటివేమీ లేకుండానే
బిగ్ బాస్ షో అంటేనే వివాదాలమయం అన్న టాక్ ఉంది. ఇప్పటి వరకు అది ప్రసారమైన అన్ని భాషల్లోనూ ఇదే తరహా అప్రతిష్టను మూటగట్టుకుంది. తెలుగులోనూ బిగ్ బాస్ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కాబోతున్న నాలుగో సీజన్ మాత్రం ఎటువంటి వివాదాలు లేకుండానే మొదలవుతుంది.

నాలుగో సీజన్‌లోనైనా మారేనా.?
బిగ్ బాస్ షో తెలుగులో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌లో శివ బాలాజీ, నాని నడిపించిన రెండో దానిని కౌశల్, నాగార్జున సారథ్యంలో వచ్చిన మూడో సీజన్‌లో రాహుల్ విజేతలుగా నిలిచారు. మూడింటిని పురుషులే గెలవగా... ఇక, నాలుగో సీజన్‌లోనైనా లేడీ కంటెస్టెంట్లు గెలుస్తారో లేదో చూడాలి.

టీజర్‌తో జోష్ పెంచేసిన బిగ్ బాస్
బిగ్ బాస్ అభిమానులు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఎన్నో అంచనాల నడుమ సీజన్ 4 సెప్టెంబర్ ఆరు నుంచి ప్రారంభం కాబోతుంది. ఆదివారం సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల పాటు సాగే ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన టీజర్‌ను కూడా వదిలింది బిగ్ బాస్ యూనిట్.

వాళ్లతో స్పెషల్ షో.. మాస్క్ లేదు
దాదాపు మూడు గంటల పాటు సాగే ప్రారంభ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించబోతున్నాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. అయితే, వాళ్లను పంపించే క్రమంలో మధ్య మధ్యలో సినీ సెలెబ్రిటీలతో ప్రత్యేకమైన ప్రదర్శనలు చేయించనున్నారు. వాళ్లతో పాటు గత బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా డ్యాన్స్, సాంగ్స్‌తో అలరించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్‌లో కరోనా కలకలం
ప్రస్తుతం ఫిలిం, టెలివిజన్ వర్గాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం... బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టడానికి సిద్ధమైన కంటెస్టెంట్లకు తుది దశ కరోనా పరీక్షలు నిర్వహించారట షో నిర్వహకులు. ఈ టెస్టుల్లో ముగ్గురు కంటెస్టెంట్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ ముగ్గురు కంటెస్టెంట్లు ఎవరన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.
Recommended Video

జాబితా నుంచి ఆ ముగ్గురు ఔట్.!
తొలి రోజు బిగ్ బాస్ హౌస్‌లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సైతం సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో... వాళ్లను హౌస్‌లోకి పంపించడం లేదట. అయితే, ఆ కంటెస్టెంట్లను అక్కడే ఉంచారా.? ఇళ్లకు పంపించేశారా అన్నది సస్పెన్స్‌గా మారింది.


Click it and Unblock the Notifications











