అభిజిత్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి.. గెలవడమే అతను చేసిన తప్పా?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా క్రేజ్ అందుకున్న వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా టైటిల్ విన్నర్స్ కు క్రేజ్ ఏ రేంజ్ లో దక్కుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. జనాలు కనెక్ట్ అయ్యారు అంటే చాలు.. అన్ని దారుల్లో కూడా ఓట్లు వేసేస్తారు. సీజన్ 4 ద్వారా క్రేజ్ అందుకున్న అభిజిత్ కూడా జనాల మద్దతును చాలానే అందుకున్నాడు. అయితే ఇప్పుడు అతని పరిస్థితిపై అనేక రకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వడమే అతని చేసినా తప్పా? అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి.

చివరి వరకు నిలవడం కష్టమని..

చివరి వరకు నిలవడం కష్టమని..

బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పుడు నిజానికి అభిజిత్ చివర వరకు ఉంటాడు అని ఎవరు ఊహించలేదు. బిగ్ బాస్ షోలో అంత కూల్ గా సైలెంట్ గా కాంట్రవర్సీ చేయకుండా ఉంటే చివరి వరకు నిలవడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ అదే అభిజిత్ కు బాగా కలిసొచ్చింది. అతను కూల్ గా ఉండడమే ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా చేసింది.

 ఆడియెన్స్ ముందే పసిగట్టారు.

ఆడియెన్స్ ముందే పసిగట్టారు.

బిగ్ బాస్ నాలుగు వారాల అనంతరం అతని గెలుపు కాయమని ఆడియెన్స్ కూడా ముందే పసిగట్టారు. టైమ్ చూసి రంగులు మార్చే వారు ఎక్కువగా ఉండడం వలన కూడా అభిజిత్ కు బాగా కలిసొచ్చింది. అతను సోలో ఫైట్ ఇచ్చి భారీ స్థాయిలో ఓట్లను అందుకోవడం విశేషం.

 ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు.

ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు.

అయితే బిగ్ బాస్ విన్నర్ గా నిలవడం వలన అతనికి ఒరిగిందేమిటి అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ తరువాత పెద్దగా క్రేజ్ అందుకోని అభిజిత్ బిగ్ బాస్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చినట్లు అనిపించింది గాని ఇంతవరకు అతను ఒక్క సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వలేదు.

 వాళ్ళు మాత్రం బిజీగా

వాళ్ళు మాత్రం బిజీగా

టైటిల్ విన్నర్ కంటే కూడా మిగతా వల్లే భారీ స్థాయిలో క్రేజ్ అందుకోవడం విశేషం. ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా వచ్చిన కొంతమంది సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సీజన్ 4 నుంచి వచ్చిన అఖిల్, దివి, సోహెల్ ఎదో ఒక అవకాశంతో బిజీ అవుతున్నారు. ఆఖరికి అవినాష్, అరియానా కూడా టీవీ షోలతో కాలాన్ని గడిపేస్తున్నారు.

మాయమవుతున్న విన్నర్స్..

మాయమవుతున్న విన్నర్స్..

కానీ అభిజిత్ మాత్రం ఇంకా ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వలేదు. గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచిన వాళ్ళు కూడా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. మొదటి సీజన్ శివ బాలాజీ, ఆ తరువాత కౌశిక్ సడన్ గా మాయమయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ లైఫ్ లో కూడా అనుకున్నంత మార్పులేమి రాలేదు.

Recommended Video

Ek Mini Katha Film బోల్డ్ గా కొత్తగా | Santosh Shoban And Kavya Fun Moments | Filmibeat Telugu
 బిగ్ బాస్ గెలవడం వల్లే..?

బిగ్ బాస్ గెలవడం వల్లే..?

ఇక ఇప్పుడు అభిజిత్ బిగ్ బాస్ గెలవడం వలన ఎక్కువ స్థాయిలో ఆలోచించి చిన్న తరహా అవకాశాలను మిస్ చేసుకున్నాడా అనేది వైరల్ గా మారింది. నిజానికి అతనికి సినిమా ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమే కానీ అవి ఆడియెన్స్ అంచనాలను అందుకోవేమో అనే అనుమానంతో అభి కొన్ని ఛాన్సులను మిస్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. మరి రానున్న రోజుల్లో అభిజిత్ కూడా గత బిగ్ బాస్ విన్నర్స్ లోనే మాయమవుతాడా లేక సరికొత్త కంటెంట్ తో రూమర్స్ కు కౌంటర్ ఇస్తాడా.. అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X