Don't Miss!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బూతులు తిట్టుకొన్న సెలబ్రిటీలు.. అఖిల్, సోహైల్ ఫైర్.. గంగవ్వ గరం గరం..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో 16వ రోజంతా ఉక్కు హృదయం అనే టాస్క్‌నే కొనసాగింది. పింక్ డ్రస్సుల్లో ఉన్న మానవులు, వైట్ డ్రస్సుల్లో రోబోలు టాస్క్‌లో తమ సత్తాను చాటాలని ప్రయత్నించారు. టాస్క్‌లో రోబో టీమ్‌లోని అభిజిత్, అవినాష్, లాస్య తదితరులు దివిని కిడ్నాప్ చేసి వారు చార్జింగ్ చేసుకొంటూ కనిపించారు. అయితే దివిని కిడ్నాప్ చేయడంపై మానవుల టీమ్ అఖిల్, సోహైల్, మెహబూబ్, మోనాల్ తదితరులు గొడవ చేశారు. 16వ రోజు అర్ధరాత్రి ఇంట్లో జరిగిన గొడవ ఏమిటంటే..
Recommended Video
దివి వద్యా కిడ్నాప్‌తో
దివిని కిడ్నాప్ చేసి రోబో టీమ్స్ ఛార్జింగ్ చేసుకొన్నారు. మెయిన్ హాల్లోకి గట్టిగా పట్టుకొని దివిని బంధించారు. దివిని బంధించడం వెన్నుపోటు, గేమ్ నిబంధనలు తుంగలో తొక్కారంటూ సోహైల్, అఖిల్‌తో రెచ్చిపోయారు. దివిని బంధించి రోబోలు తమకు తాము చార్జ్ చేసుకోవడంలో సఫలమయ్యారు.
రోబోలు, మానవులకు మధ్య వాగ్వాదం
దివిని కిడ్నాప్ చేయడంపై రోబోలు, మానవుల మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. సోహైల్, అఖిల్‌కు, అభిజిత్, అరియానాకు మధ్య భారీగా గొడవ జరిగింది. అయినా గేమ్‌ను అలానే గొడవల మధ్య కొనసాగించారు. ఓ దశలో రోబో టీమ్‌ను మానవుల టీమ్ బూతులు తిడుతూ విరుచుకుపడ్డారు. మోనాల్, అఖిల్, సోహైల్, మెహబూబ్ బూతులుతో రెచ్చిపోయారు.
గంగవ్వ స్ట్రాటెజీ అదుర్స్
16 రోజు అర్ధరాత్రి వరకు బిగ్‌బాస్ అర్ధరాత్రి వరకు రోబోలు, మానవుల మధ్య అధిపత్య పోరాటం జరిగింది. పెద్దగా వినోదం కనిపించలేదు. టాస్క్‌లో విజయం సాధించడానికి రెండు వర్గాలు వ్యూహాలు పన్నుతూ కనిపించారు. గంగవ్వ చతురత ఆకట్టుకొన్నది. మానవుల టీమ్‌కు మాస్కా కొట్టడానికి ప్రయత్నించిన తీరు కాస్త ఉత్సాహం కలిగించింది.
ఇంటి సభ్యులపై గంగవ్వ గరం
టాస్క్‌లో ఎవరూ కూడా భోజనం చేయకుండా ఉండటంపై గంగవ్వ సీరియస్ అయింది. తినకుండా ఏది ఈ గొడవలు, ఆటలు అంటూ గంగవ్వ గరమైంది. అయితే టాస్క్ అంటే ఇలానే ఉంటుంది. గొడవలు, తిట్టుకోవడం కామన్ అమ్మా అంటూ ఇంటి సభ్యుల నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. టాస్క్ నేపథ్యంగానే ఎపిసోడ్ సాగడంతో షో చాలా బోర్‌గా మారింది.