Bigg Boss Unseen: వామ్మో ఆయనను భరించలేను.. పట్టాలెక్కిన అభిజిత్, మోనాల్ లవ్‌ట్రాక్

బిగ్‌బాస్ ఇంటిలో ఐదో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య భారీగా చిచ్చు పెట్టింది. ముఖ్యంగా మోనాల్ విషయంలో అఖిల్, అభిజిత్, ఇతర ఇంటి సభ్యుల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత నేషనల్ ఛానెల్‌లో నా గురించి ఇలా మాట్లాడుకోవడం సరికాదు అంటూ అఖిల్, అభిజిత్‌పై మోనాల్ గజ్జర్ వార్నింగ్ ఇచ్చింది. ఇక నామినేషన్ ప్రక్రియ తర్వాత నెలకొన్న గంభీరమైన పరిస్థితుల్లో మోనల్, అభిజిత్ మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చ ఏమిటంటే..

 రచ్చగా నామినేషన్ ప్రక్రియ

రచ్చగా నామినేషన్ ప్రక్రియ

నామినేషన్ ప్రక్రియ తర్వాత మోనాల్ విషాదంలో కూరుకుపోయింది. తన గురించి ఇంట్లో రచ్చ జరగడంపై మనోవేదనకు గురైంది. ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే.. అభిజిత్ వెళ్లి సారీ చెప్పి ఇక నుంచి నీ టాపిక్ లేవనెత్తను. ఇక ఇంతటితో వదిలేద్దామని మోనల్‌కు నచ్చ చెపపడంతో పరిస్థితి కాస్త కంట్రోల్‌లోకి వచ్చింది.

మోనాల్‌కు చేరువగా అభిజిత్

మోనాల్‌కు చేరువగా అభిజిత్

అభిజిత్ నచ్చ చెప్పిన తర్వాత మోనాల్ పరిస్థితి నార్మల్ అయిపోయింది. అభిజిత్, మోనాల్ పలుమార్లు కూర్చొని మనసు విప్పి మాట్లాడుకోవడం కనిపించింది. ఆ క్రమంలోనే నామినేషన్ ప్రక్రియ తర్వాత ఇంటిలో పలుమార్లు వారిద్దరూ కలిసి మాట్లాడుకొంటూ కనిపించారు. దీంతో వారిద్దరి మధ్య రిలేషన్ మళ్లీ పట్టాలెక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇంటిలోని తీరుపై వారిద్దరు ఆసక్తిగా చర్చించడం ఆసక్తిగా మారింది.

 ప్రతీవారం ఒపీనియన్లు మారుతున్నాయి

ప్రతీవారం ఒపీనియన్లు మారుతున్నాయి

ఇంటిలోని పరిస్థితి గురించి అభిజిత్ మాట్లాడుతూ.. ఇంటి సభ్యుల అభిప్రాయాలు ఫ్రీక్వెంట్‌గా మారిపోతున్నాయి. ప్రతీవారం ఒక్కక్కొరి ఒపీనియన్‌ ఒక్కో రకంగా ఉంటుంది. ఇలా అభిప్రాయాలు మారుతుండటంతో ఒకరిని జడ్జ్ చేయాలంటే కష్టంగా ఉంది అంటూ మోనాల్‌కు తన మనసులో మాట చెప్పారు.

అమ్మా రాజశేఖర్ అర్ధగంట క్లాస్ పీకారు

అమ్మా రాజశేఖర్ అర్ధగంట క్లాస్ పీకారు

అభిజిత్‌తో మాట్లాడుతూ.. అమ్మా రాజశేఖర్ తీరు గురించి కంప్లయింట్ చేసింది. నేను చాలా బాధతో ఉంటే వచ్చి నాకు అర్ధగంట క్లాస్ పీకారు. దానిని భరించలేకపోయాను. అసలే నేను ఆ గొడవ తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉంటే చాలా సేపు నాకు సూచనలు ఇస్తూ ఉన్నారు అని మోనాల్ చెప్పింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Amma Rajashekar OR Sujatha Who Will Eliminate This Week?
 వామ్మె ఆ విషయం నాకు చెప్పొద్దు

వామ్మె ఆ విషయం నాకు చెప్పొద్దు

అమ్మా రాజశేఖర్ గురించి మోనాల్ చెప్పిన విషయాలపై అభిజిత్ స్పందిస్తూ.. అమ్మో ఆ గొంతు భరించలేను. ఆ గొంతును నేను తట్టుకోలేను. ఆయన విషయం నాకు చెప్పొద్దు అంటూ అన్నారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం మోనాల్ ఏడుస్తుంటూ అమ్మా రాజశేఖర్ నాలుగు మంచి మాటలు చెప్పడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X