Bigg Boss Unseen మీది అలాంటి పెళ్లే!..మీరు అలాంటి అమ్మాయిలనే చేసుకొంటారు..సోహెల్‌, అఖిల్‌కు మోనాల్ షాక్

బిగ్‌బాస్ ఇంటిలో 86వ రోజున ఉదయం డ్యాన్స్ షో తర్వాత ఇంటి సభ్యులు లాన్‌లో రిలాక్స్ అయ్యారు. సోహెల్, అఖిల్, మోనాల్‌ ఎండలో కూర్చొని పిచ్చపాటిగా మాట్లాడుకొంటుండగా.. పెళ్లి టాపిక్ వచ్చింది. ఈ సందర్భంగా ఆ ముగ్గురి మధ్య భార్య గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. మ్యారేజ్ గురించి వాళ్లు ఏం మాట్లాడుకొన్నారంటే...

నేను చేసుకొనే అమ్మాయి లక్కీనా?

నేను చేసుకొనే అమ్మాయి లక్కీనా?

మోనాల్‌తో సోహెల్ మాట్లాడుతూ.. నన్ను పెళ్లి చేసుకొనే అమ్మాయి లక్కీనా? అన్ లక్కీనా? అని అడిగితే... అరె సూపర్ లక్కీ అంటూ సమాధానం ఇచ్చింది. పక్కనే ఉన్న అఖిల్ జోక్యం చేసుకొంటూ.. నన్ను పెళ్లి చేసుకొనే అమ్మాయి అని అఖిల్ అడిగితే.. మోనాల్ ఆలోచనలో పడింది. దాంతో సోహెల్ గట్టిగా నవ్వుతూ కనిపించాడు.

 మా అమ్మ ఒకే చెబితేనే పెళ్లి

మా అమ్మ ఒకే చెబితేనే పెళ్లి

దాంతో అఖిల్ తన పెళ్లి గురించి స్పందిస్తూ.. నేను మా అమ్మ చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకొంటాను. మా అమ్మకు ఓకే అంటేనే చేసుకొంటా.. లేకపోతే చేసుకోను అని అన్నాడు. దాంతో నాకు ఆ విషయం ముందే తెలుసు. మీరు అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకొంటారు నాకు తెలుసు అని మోనాల్ సమాధానం ఇచ్చింది.

నీది గ్యారెంటీగా అలాంటి పెళ్లే

నీది గ్యారెంటీగా అలాంటి పెళ్లే

అయితే తన పెళ్లిపై అఖిల్ స్పందిస్తూ.. నేను అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకొను. లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకొంటాను అంటే.. లేదు గ్యారెంటీగా అరెంజ్డ్ పెళ్లి చేసుకొంటావు. మీ అమ్మా ఈ అమ్మాయి బాగా ఉందంటే ఆమెనే చేసుకొంటావు అని మోనాల్ బల్లగుద్దినట్టు చెప్పింది. అయితే ఒకటైమ్‌లో ఈ ప్రేమలతో విసిగిపోయి.. అమ్మా నీవు ఎవరిని చూపిస్తే వారిని చేసుకొంటానని ఫిక్స్‌ అవుతాను. అప్పుడు మా అమ్మ నేను చెప్పానుగా.. అదే చేస్తున్నావని అంటుంది అని అఖిల్ చెప్పారు.

నాది లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్ అంటూ సోహెల్

నాది లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్ అంటూ సోహెల్

ఇక సోహెల్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. నేను లవ్ కమ్ ఆరెంజ్ మ్యారేజ్ చేసుకొంటాను. ఏం జరుగుతుందో చూద్దాం అని మోనాల్‌తో అన్నాడు. సోహెల్ మాటలకు స్పందిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లోని 9.5 కోట్ల మంది ప్రజలకు మీ గురించి అంతా తెలుసు. మీ అమ్మలు డిసైడ్ చేస్తేనే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొంటారు అని అఖిల్, సోహెల్‌కు ఝలక్ ఇచ్చింది.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
 నా పెళ్లికి ఐదేళ్ల సమయం ఉందంటూ

నా పెళ్లికి ఐదేళ్ల సమయం ఉందంటూ

అయితే మోనాల్ మాటలకు అడ్డుపడుతూ.. అంత సీన్ లేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకొంటాను. ఇప్పుడు నాకు 25 ఏళ్లు. నా పెళ్లికి ఇంకా ఐదేళ్ల సమయం ఉంది. అప్పటి వరకు ఆలోచిస్తాను. ఇప్పుడే పెళ్లి చేసుకొని నా టైమ్ వేస్ట్ చేయను. ఇంకా లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి చాలా సమయం ఉంది అని అఖిల్ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X