పట్టుకుంటే పామును చంపేయాలి.. వదిలేస్తే డేంజర్.. మోనల్‌తో అఖిల్ అలా..
నామినేషన్ ప్రక్రియ సందర్భంగా గొడవ జరిగిన తర్వాత మోనాల్ గజ్జర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన విషయంలో అఖిల్ సార్థక్, అభిజిత్ మధ్య వాగ్వాదం జరగడం ఆమె భరించలేకపోయింది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్ధరాత్రి గార్డెన్ ఏరియాలోని బల్లపై పడుకొని ఏడుస్తుంటే.. అది చూసి అమ్మా రాజశేఖర్ వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేస్తూ..

సెలబ్రిటీ, హీరోయిన్ అనే విషయాన్ని మరిచి
ఏడుస్తూ బాధపడుతున్న మోనల్‌కు అమ్మా రాజశేఖర్ ఊరటనిచ్చే మాటలు చెబుతూ... మోనాల్ గజ్జర్ నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరవు? నీవు ఓ సెలబ్రిటీవి, హీరోయిన్ అనే విషయాన్ని మరిచిపోతున్నావు. ఇలా ఏడిస్తే చూసే ప్రేక్షకులు ఏమనుకొంటారో తెలుసా? అంటూ సున్నితంగా అమ్మా రాజశేఖర్ మందలించారు. అయితే తన పేరును బహిరంగంగా ఉపయోగిస్తూ గొడవ పడితే బయట ఎలా ఉంటుందో నీకు తెలుసా? అంటూ తన బాధను మోనాల్ వ్యక్తం చేశారు.

అవినాష్ నా మాటలను తప్పుగా
అయితే తన గేమ్‌ను అవినాష్ కూడా తప్పుపట్టడం ఇంకా బాధ వేసింది. నేను సేఫ్ గేమ్ ఆడొద్దంటూ చెబితే దానిని సీరియస్‌గా తీసుకొన్నాడు. అవినాష్‌కు మంచి ఉద్దేశంతో చెప్పాను. కానీ దానిని రాంగ్ వేలో తీసుకొన్నాడనే విధంగా మోనాల్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అవినాష్ తన వెర్షన్ తాను చెప్పారు. నామినేషన్ ప్రక్రియ కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి అని అమ్మా రాజశేఖర్ అన్నారు.

నామినేషన్ ప్రక్రియలో ఇలాంటివి కామన్
నామినేషన్ ప్రక్రియలో చెప్పిన విషయాలను సీరియస్‌గా తీసుకోకూడదు. ఇక్కడ అందరూ తమకు ఉన్న ఫ్రెండ్‌షిప్ కారణంగానే వారిని నామినేట్ చేయడం లేదు. ఏదో ఒకటి చెప్పి నామినేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాటిని పట్టించుకోవద్దు. దానిని మనసులో పెట్టుకొని ఏడువ కూడదు. అవినాష్ మాట్లాడిన దానిలో తప్పేలేదు అని మోనాల్‌కు అమ్మా రాజశేఖర్ చెప్పారు.

పాములాంటి వ్యక్తులతో జాగ్రత్తగా
జీవితంలో మనకు పాములాంటి వాళ్లు ఎదురు పడుతుంటారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. పామును పట్టుకొన్నావంటే చంపేయాలి. వదిలేస్తే దానితో డేంజర్. పగతో మనల్ని కాటేస్తుంది. కాబట్టి కొందరితో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకొని కంటతడి పెట్టుకోవద్దు. హీరోయిన్‌లా నీట్‌గా తయారై, హ్యాపీగా ప్రేక్షకులకు కనిపించాలని మోనాల్‌కు అమ్మా రాజశేఖర్ నాలుగు మంచి మాటలు చెప్పారు.
Recommended Video

మోనల్‌కు అఖిల్ గోరు ముద్దలు
మోనల్ గజ్జర్‌తో అమ్మా రాజశేఖర్ మాట్లాడుతుండగా అక్కడికి ప్లేట్ పట్టుకొని అఖిల్ వచ్చాడు. తాను అన్నం తింటూ మోనాల్‌కు గోరు ముద్దలు తినిపించారు. ఆ తర్వాత సోహైల్ కూడా రావడంతో అమ్మా రాజశేఖర్ అక్కడి నుంచి మెల్లగా జారుకొన్నారు.


Click it and Unblock the Notifications











