గోరు ముద్దలు తినిపించిన అవినాష్.. ఐ లవ్ యూ చెప్పిన అరియానా.. పిచ్చి ముదిరిందంటూ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో ఇప్పటికే అభిజిత్, మోనల్, అఖిల్ సార్థక్ మధ్య ట్రాయంగిల్ లవ్ స్టోరి రచ్చ రచ్చగా మారింది. ఈ లవ్‌స్టోరిని పక్కన పెడితే.. మరో ప్రేమ కథకు చిగురు తొడుగుతున్నది. అరియానా గ్లోరి, అవినాష్ మధ్య రొమాంటిక్ సీన్లు ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఎపిసోడ్‌లో వారిద్దరి రొమాన్స్ ఇంటిలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేక్షకులు చూడని అరియానా, అవినాష్ మధ్య ప్రేమ కథకు సంబంధించిన వ్యవహారం ఇలా జరిగింది..

అరియానా, అవినాష్ లవ్ ట్రాక్

అరియానా, అవినాష్ లవ్ ట్రాక్

బిగ్‌బాస్ కిచెన్‌లో ఉదయమే బ్రేక్ ఫాస్ట్ సమయంలో అరియానా, అవినాష్‌ ప్రేమకథలో ఎపిసోడ్ మొదలైంది. ఓ పక్క లాస్య కిచెన్‌లో దోశలు వేస్తుంటే.. అరియానా, అవినాష్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. అవినాష్ దోశ తింటుంటే నాకు తినిపియ్యమని అరియానా అడిగింది. దాంతో దోశ తినిపించడానికి అవినాష్ సిగ్గుపడ్డాడు. మనసులో ఏదో ఉంటే తప్ప అలా సిగ్గుపడవు. దోశ తినిపించడానికి మొహమాటం ఎందుకు అంటూ అరియానా చురకలు అంటించింది.

నార్మల్‌గా ఉంటే భయపడవు

నార్మల్‌గా ఉంటే భయపడవు

అవినాష్‌ను ఫోర్స్ చేస్తూ.. అందరికి భయపడి తినిపియవ్వా? లేక నీకు తినిపించాలని లేదా? అంటూ అరియానా మళ్లీ అడిగింది. తినిపించడానికి భయపడుతున్నావంటే మనసులో ఏదో ఉందనిపిస్తుంది. నార్మల్‌గా ఉంటే భయపడరు. నీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటీ? నా ఎక్స్‌పెక్టేషన్ ఏమింటి? మళ్లీ అరియానా రెచ్చగొట్టింది. దాంతో అలాంటిదేమీ లేదు అని అవినాష్ సమాధానం ఇస్తూ దోశను తినిపించే ప్రయత్నం చేశాడు.

అరియానా, అవినాష్.. మధ్యలో లాస్య

అరియానా, అవినాష్.. మధ్యలో లాస్య

అరియానా, అవినాష్ డిస్కషన్‌లో లాస్య జోక్యం చేసుకొంటూ నీవు ఛాయిస్ కాదని అరియానా క్లారిటీ ఇచ్చింది అన్నారు. ఇప్పటి వరకు నాకు అవినాష్ మంచి ఫ్రెండ్. వచ్చే వారం కన్ఫర్మేషన్ ఇస్తాను అంటూ లాస్యకు అరియానా సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత అరియానా పిచ్చిగా పాట పడుతుంటే.. పిచ్చి ముదిరిపోయింది అంటూ సెటైర్ వేశాడు.

అరియానాపై హారిక కామెంట్

అరియానాపై హారిక కామెంట్

అరియానా, అవినాష్ డిస్కషన్‌లో కిచెన్‌లో ఉన్న హారిక జోక్యం కల్పించుకొంది. మనసులో ఉంటే తినిపించు కానీ.. బలవంతంగానో, భయంతోనో తినిపించకు అంటూ పక్కనే ఉన్న హారిక కామెంట్ విసిరింది. ఆ పక్కనే ఉన్న మెహబూబ్ స్పందిస్తూ.. అవినాష్ నీ గేమ్ నీవు అండటం లేదు అంటూ కామెంట్ చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!
బిగ్‌బాస్ ఐ లవ్ యూ అంటూ అరియానా

బిగ్‌బాస్ ఐ లవ్ యూ అంటూ అరియానా

ఇదిలా ఉండగా, అరియానా మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ నాకు ఇష్టమని ఐ లవ్ యూ చెప్పింది. బిగ్‌బాస్ అంటే నిజంగా ఐ లవ్ యూ అనగానే అవినాష్ నవ్వుల్లో మునిగిపోయాడు. అయితే అరియానా లవ్ ప్రపోజ్‌కు బిగ్‌బాస్ ఎలా రియాక్ట్ అవుతారంటే అంటూ అవినాష్ చిన్న కామెడీ చేశాడు. బిగ్‌బాస్ ఇలా స్పందిస్తారంటూ.. అరియానా! మీరు బిగ్‌బాస్‌కు నీవు ఐ లవ్ యూ చెప్పినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు ప్రతీసారి ఐ లవ్ యూ చెబితే ఎలిమినేట్ అవుతారు అంటూ అవినాష్ మిమిక్రీ చేశాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ జోక్ చేశాడు అవినాష్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X