Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అవినాష్ నిన్ను బాగా వాడుకొంటున్నా.. అరియానా నువ్వో రాక్షసివి.. బిగ్‌బాస్‌లో సరికొత్త లవ్ ట్రాక్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో అరియానా గ్లోరి, జబర్దస్త్ అవినాష్ మధ్య సున్నితమైన, హెల్తీ రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వినోదాన్ని పుట్టిస్తున్నది. వారిద్దరి మధ్య చిలిపి మాటలు, చేష్టలు ఫన్ను జనరేట్ చేస్తున్నాయి. ఇక బీబీ హోటల్ టాస్క్‌లో అరియానా యువరాణిగా నటిస్తూ అవినాష్‌ను ఆటాడుకొంటున్నది. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోలో అరియానా, అవినాష్‌కు సంబంధించి చూపించని ముఖ్యమైన సీన్ మీ కోసం..
అవినాష్ నన్ను ఇంప్రెస్ చేస్తే టిప్పు ఇస్తా
ఇంటిలో కొనసాగుతున్న బీబీ హోటల్ టాస్క్‌లో యువరాణిగా అరియానా, హోటల్లో అసిస్టెంట్ మేనేజర్‌గా అవినాష్ నటిస్తున్నారు. టాస్క్‌లో భాగంగా అరియానా తనను ఇంప్రెస్ చేస్తే టిప్ ఇస్తానని చెప్పింది. అయితే మిమల్ని మాటలతో మెప్పించలేను అని అవినాష్ సమాధానం ఇస్తే.. అయితే నాట్యం చేసి మెప్పించు అని అరియానా కోరింది. దానికి నా కాలు నొప్పి ఉందంటూ అవినాష్ జవాబిచ్చాడు.
స్లో మోషన్లో అవినాష్
అయితే నాట్యం నాకు చేయనవసరం లేదు. కానీ స్లో మోషన్లో పరిగెత్తుతూ అరియానా. ది ప్రిన్సెస్ అంటూ బిగ్‌బాస్‌కు గట్టిగా వినిపించేలా అరుస్తూ పరిగెత్తి రావాలి అంటూ అవినాష్‌కు అరియానా సూచించింది. దాంతో గాల్లో తేలిపోతూ అరియానా.. ది ప్రిన్సెస్ అంటూ పరుగెత్తుకొంటూ అవినాష్ వచ్చాడు.
అరియానా చేతిని పట్టుకొని
అవినాష్ స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత అరియానా ఫుల్లుగా ఫిదా అయిపోయి టిప్ ఇచ్చింది. వినయంగా టిప్ అందుకొంటూ ముద్దు పెట్టుకొన్నాడు. మోకాళ్లపై కూర్చొని అరియానా చేతిని తలకు అద్దుకొని హ్యాపీగా ఫీలయ్యాడు. ఆ తర్వాత అవినాష్‌ను అరియానా కౌగిలిలో బంధించింది. ఇదంతా దూరంగా చూస్తూ మోనాల్, అఖిల్ నవ్వుకొన్నారు.
అరియానా నువ్వు రాక్షసిలా
బీబీ టాస్క్‌లో భాగంగా అవినాష్‌ను రకరకాల టాస్క్‌లతో వేధించడంపై అవినాష్ స్పందిస్తూ నువ్వో రాక్షసివి అని వెంటనే నాలిక కరుచుకొని సారీ చెప్పారు. ఆ తర్వాత టిప్పుల రూపంలో ఎంత సంపాదించావంటే, మోహబూబ్ ఇప్పుడే 1000 ఇచ్చాడు అని చెబితే అంతేనా అని అరియానా అంటూ.. 500 ఇచ్చి నిన్ను బాగా వాడుకొన్నాను. ఎవరినీ కూడా అలా వాడుకోలేదు అంటూ చెప్పింది.
చాపకింది నీరులా లవ్ ట్రాక్
ఇలాంటి సన్నివేశాలే కాకుండా ఇంటిలో అరియానా, అవినాష్ మధ్య లవ్ ట్రాక్ చాప కింది నీరులా ప్రవహిస్తున్నది. ఈ లవ్ ట్రాక్ అఖిల్, మోనాల్, అభిజిత్ లా వివాదంతో కాకుండా ఫన్నీగా సాగడంతో ఇంటి సభ్యులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అవినాష్‌ను సాఫ్ట్‌గా బ్లాక్మెయిల్ చేస్తూ తన చేత తినిపించుకోవడం, పనులు చేయించుకోవడం వినోదంగా మారుతున్నది.