Bigg Boss Unseen మొహమాటం ఎందుకు? అసలు విషయం చెప్పు.. అరియానాను కెలికిన అభిజిత్
బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో కిచెన్ శుభ్రం చేయకపోవడంపై అభిజిత్, అరియానా మధ్య చిన్న ఘర్షణ చోటు చేసుకొన్నది. స్టవ్‌పై టీ పొంగితే శుభ్రం చేసుకోవాలి కదా అంటూ అభిజిత్‌ను కెప్టెన్‌గా అడిగింది. అయితే తనను అలా ప్రశ్నించకూడదనే విషయంపై వా మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మాటా మాట పెరిగి అరియానా. అభిజిత్ ఒకరికొకరు ఎలా గొడవ పెట్టుకొన్నారంటే..

కిచెన్ శుభ్రత గురించి
ఇంటి కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. టీ చేసేటప్పుడు పొంగిపోవడం జరుగుతుంటుంది. పొంగకుండా చూసుకోవడం ఒకటి. పొంగితే దానిని శుభ్రం చేసుకోవాల్సింది. కానీ అలా జరగడం లేదు అని అభిజిత్‌ను అరియానా అడగడంతో అతడికి కోపం వచ్చింది.

తప్పు చేశావని అనడం లేదు..
టాస్క్ ఆడుతున్న సమయంలో టీ పొంగిపోయింది. ఆ సమయంలో స్టవ్ క్లీన్ చేసుకోవడం కుదర్లేదు అంటూ అరియానాకు అభిజిత్ సమాధానం చెప్పాడు. అయితే నేను టీ ఎందుకు పొంగిందని అడగడం లేదు. పొంగిన తర్వాత ఎందుకు క్లీన్ చేయలేదు అని అడిగాను. మిగితావి కూడా క్లీన్ చేసినప్పుడు స్టవ్‌ను ఎందుకు వదిలేశావు అంటున్నాను. నీవు తప్పు చేశావని పాయింట్ అవుట్ చేయడం లేదు అని అభరియానా సమాధానం ఇచ్చింది.

అరటి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ
ఇక ఇంటిని, కిచెన్‌ను శుభ్రం చేయడంలో ఇంటి సభ్యులు అశ్రద్ద వహిస్తున్నారు. అరటి తొక్కలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దాంతో ఇంట్లోకి పరుగులు వస్తున్నాయి. అది కూడా చెప్పాలా అంటూ అరియానా సీరియస్ అయింది. దాంతో ఎవరిని ఉద్దేశించి చెబుతున్నారో క్లారిటీతో చెప్పండి అంటూ అభిజిత్ అన్నాడు.

మొహమాటం ఎందుకు. అంటూ అభిజిత్
ఇంటిలో పనిచేయకపోవడంపై ఇంటి సభ్యులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మీరు చేయకపోతే...నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని అరియానా అంటే.. ఎవరిని అంటున్నావో క్లారిటీతో చెప్పు. మొహమాటం ఎందుకు అంటూ అభిజిత్ కౌంటర్ ఇచ్చాడు. అయితే నా మొహమాటం గురించి నువ్వు చెప్పాలా? అంటూ అరియానా రిటర్న్ ఇచ్చింది.

మాస్టర్ ముందు భోరున విలపించిన అరియానా
అభిజిత్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత అరియానా మనస్తాపానికి గురయ్యారు. స్టోర్ రూమ్‌లోకి వెళ్లి భోరున విలపించింది. నేను టీ ఎందుకు పొంగిందని ప్రశ్నించలేదు. పొంగిన తర్వాత క్లీన్ చేసుకోవాలి కదా అని అడిగాను. దానికి అభిజిత్ నన్ను టార్గెట్ చేస్తాడా అంటూ అమ్మా రాజశేఖర్‌తో తన బాధను చెప్పుకొన్నది.


Click it and Unblock the Notifications











