Bigg Boss Unseen నాతో జోకులు, మజాక్‌లు వద్దు.. అవినాష్, సయ్యద్‌కు మోనాల్ వార్నింగ్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఎమోషన్స్, గొడవలు, అల్లరి సంఘటనలతో ముందుకు సాగుతున్నది. వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన జబర్దస్త్ అవినాష్ అల్లరి మరీ ఎక్కువైంది. ఇంటి సభ్యులను ఆటపట్టిస్తూ నవ్వుల్లో ముంచెందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మోనాల్ గజ్జర్‌ను ఆటపట్టించడానికి చేసిన సరదా సంఘటనలు అవినాష్, సయ్యద్ సోహైల్‌కు షాకిచ్చాయి. మోనాల్, సయ్యద్, అవినాష్ మధ్య జరిగిన సంఘటనలు ఏమిటంటే..
Recommended Video

నాతో మజాక్ చేయకు
మోనాల్ గజ్జర్‌ను అక్క అనిపిలిస్తే.. అలా పిలువకు.. మోనాల్‌ను అలా పిలిస్తే 30 ఏళ్లకు పైబడి ఉందని అనుకొంటారు అని సయ్యద్ అనడం వివాదంగా మారింది. నీకు నాకు మధ్య అలాంటి క్లోజ్ లేదు. కాబట్టి నాతో అలా మజాక్ చేయకు. ఎలాంటి మజాక్ కైనా ఓ హద్దు ఉంటుంది. నా గురించి మాట్లాడేటప్పుడు కంట్రోల్‌గా మాట్లాడు అంటూ మోనాల్ చెప్పింది.

నిన్ను అలా అనడం వెనుక అంటూ సయ్యద్
మోనాల్ మాటలపై స్పందిస్తూ.. నేను అలా అనడం వెనుక మరో ఉద్దేశం లేదు. నీ మనసులో ఉన్న విషయాన్ని నాకు చెప్పావు కనుక.. నాకు క్లారిటీ వచ్చింది. దీంతో మన మధ్య రిలేషన్ క్లియర్ అయింది. ఇలా నువ్వు చెప్పడం వల్ల నీతో నేను ఎలా ఉండాలో నాకు క్లారిటీ వస్తుంది అంటూ మోనాల్‌తో సయ్యద్ చెప్పడం జరిగింది.

అఖిల్, మోనాల్‌ను అనుకరిస్తూ
ఆ తర్వాత అర్ధరాత్రి ఇంటి సభ్యులందరూ ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ సందర్భంగా మోనాల్, అఖిల్‌ను ఇమిటేట్ చేస్తూ అవినాష్ కామెడీ చేశారు. దాంతో అందరూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత అవినాష్, మోనాల్ మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరిగింది. ఈ సందర్భంగా అవినాష్‌కు గట్టిగా క్లాస్ పీకింది.

జోకులు, మజాక్‌లు చేయొద్దు
బిగ్‌బాస్ అంటే చాలా పెద్ద ఫ్లాట్‌ఫామ్. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. జోక్ అంటే జోకే. ఒక్కసారి జోక్ చేస్తే ఒకే.. కానీ పదే పదే నన్ను టార్గెట్ చేస్తూ జోకులు చేయవద్దు. నా గురించి మజాక్ చేయవద్దు అని మోనాల్ క్లాస్ పీకింది. దాంతో సారీ అంటూ అవినాష్ నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అఖిల్‌ను ఇమిటేట్ చేస్తే పర్వాలేదు. కానీ నాపై పదే పదే జోక్ చేస్తే కోపంగా ఉంది అని మోనాల్ గట్టిగా మందలించింది.


Click it and Unblock the Notifications











