Bigg Boss unseen: మోనాల్‌తో అఖిల్ డిస్ట్రబ్..ఏదో అనుమానం.. సీక్రెట్‌గా సోహైల్, మెహబూబ్
బిగ్‌బాస్ ఇంటిలో అఖిల్ సార్థక్, సోహైల్ సయ్యద్, మెహబూబ్ మంచి స్నేహితులనే విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది. ఏదైనా టాస్క్ విషయానికి వస్తే వారందరూ కలిసి టీమ్‌గా ఆడుతారు. ఎవరైన ఒంటరిగా టాస్క్‌లో మరొకరు సపోర్ట్ చేస్తారు. ఇలా కలిసి కట్టుగా ఆడే ఈ ముగ్గురి రిలేషన్స్‌లో ఏదో తేడా కొట్టినట్టు కనిపిస్తున్నది.
తాజాగా మోనాల్‌తో అఖిల్ మాట్లాడుతూ.. ఇంట్లో నాకు ఎవరూ లేరు. సోహైల్, మెహబూబ్, గంగవ్వ తప్ప పెద్దగా నాతో మాట్లాడేవారు లేని అన్నారు. అదే సమయంలో అఖిల్ గురించి మెహబూబ్, సోహైల్ మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.
అఖిల్‌ను మనం నమ్మలేం. టాస్కులు సరిగా ఆడటం లేదు. అఖిల్‌పై మనం నమ్మకం పెట్టుకోలేం అని మెహబూబ్ అన్నాడు.

మెహబూబ్ మాటలపై స్పందిస్తూ.. అఖిల్‌కు కాళ్ల నొప్పులు ఉన్నాయి. అందుకే సరిగా ఆడటం లేదు. కొన్ని టాస్కుల్లో అదరొట్టాడు. అది కాకుండా మోనాల్ విషయంలో చాలా డిస్ట్రబ్‌గా ఉన్నాడు. అందుకే సరిగా ఎవరితో మాట్లాడటం లేదు. టాస్కుల్లో సరిగా కూడా ఆడటం లేదు అంటూ సోహైల్ అన్నాడు. ఇలా అఖిల్ గురించి సోహైల్, మెహబూబ్ ఇద్దరూ ఆసక్తిగా మాట్లాడుకోవడం అందరికి ఆశ్చర్యం కలిగిచింది.


Click it and Unblock the Notifications











