అలాంటి భార్య దొరికితే నరకమే..ఏం పీకావని ప్రశ్నిస్తే లైఫ్ దారుణం..సోహెల్ హాట్ కామెంట్స్

బిగ్‌బాస్ ఇంటిలో పెళ్లి గురించి మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్, సోహెల్ సయ్యద్ ర్యాన్ మధ్య భారీగా చర్చ జరిగింది. లవ్ మ్యారేజ్, అరెంజ్డ్ మ్యారేజ్ గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం వేస్ట్.. పెళ్లి పేరుతో కెరీర్ నాశనం చేసుకోను అని అఖిల్ అంటే.. అలా అనకూడదు అంటూ సోహెల్ స్పందించాడు. ఇంకా వారి మధ్య భార్యల గురించి చర్చ ఎలా జరిగిందంటే..

పెళ్లి చేసుకొంటే లైఫ్ వేస్ట్.. అఖిల్

పెళ్లి చేసుకొంటే లైఫ్ వేస్ట్.. అఖిల్

పెళ్లి చేసుకొంటే కెరీర్ వేస్ట్ అవుతుందని అఖిల్ అనడంపై సోహెల్ తప్పుపట్టారు. పెళ్లి చేసుకొంటే జీవితం నాశనం అవుతుందనడం తప్పు. పెళ్లి చేసుకొన్న తర్వాత వచ్చే భార్య సహకారం అందిస్తే లైఫ్ బాగుంటుంది. ఏదైనా సమస్యలో ఉండి.. మానసికంగా ఏదైనా ఫీలవుతే.. అప్పుడు వారి సపోర్ట్ వల్ల మనసు బాగుంటుంది. నీవు ఆ పని చేయగలవు.. చేస్తావు అంటూ ప్రోత్సహిస్తే భర్తకు ఉపశమనం ఉంటుంది అని సోహెల్ చెప్పారు.

 జీవితంలో మంచి భార్య లభిస్తే.. సోహెల్

జీవితంలో మంచి భార్య లభిస్తే.. సోహెల్

జీవితంలో మంచి భార్య లభిస్తే అనే విషయం గురించి సోహెల్ మాట్లాడుతూ.., అన్ని సమయాల్లో అండగా నిలబడితే భర్తకు మంచి సక్సెస్ లభిస్తుంది. ఒకవేళ మంచి భార్యలు రాకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి సమయంలో పెళ్లి చేసుకొని జీవితం నాశనం చేసుకొన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది అని సోహెల్ చెప్పాడు. అలాంటి భార్యలు వస్తే అఖిల్ లాంటి మాటలే అనాల్సి వస్తుంది. మంచి భార్య దొరికితే జీవితం మరోలా ఉంటుందనే విధంగా సోహెల్ మాట్లాడాడు.

భర్తలను భార్యలు హింసిస్తే..

భర్తలను భార్యలు హింసిస్తే..

పెళ్లి తర్వాత భార్యల నుంచి ఎదురయ్యే అనుభవాల గురించి సోహెల్ మాట్లాడుతూ.. కొందరు ఆడవాళ్లు తమ జీవితంతో సంతృప్తి చెందరు. పక్కింటి వాళ్లను చూసి భర్తలను హింసిస్తుంటారు. వాళ్లు ఇది కొన్నారు. వాళ్లు అలా సంపాదిస్తుంటారని పక్క ఇంటి వాళ్లను, ఇరుగు పొరుగు వాళ్లను ఉదహారణగా చూపించి వేధిస్తుంటారు. నీవే పీకావు.. నీవేం చేశావు అనే భార్యలు వస్తే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది అని సోహెల్ చెప్పాడు.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
జీవితంలో మంచి భార్య దొరకడం అరుదుగా

జీవితంలో మంచి భార్య దొరకడం అరుదుగా

జీవితంలో మంచి భార్య దొరకడం చాలా అదృష్టం. మంచి భార్య దొరకడం అనేది అరుదుగా లభిస్తుంది. భార్య సరిగా లేకపోతే జీవితం నరకంగానే ఉంటుంది అని అఖిల్ అన్నాడు. భార్య గురించి సోహెల్ చెప్పిన మాటలకు మోనాల్, అఖిల్ మద్దతు తెలిపారు. అలా 86వ రోజు ఉదయాన్నే అఖిల్, సోహెల్ మధ్య రకరకాల చర్చ జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X