twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంటి సభ్యులకు జబర్దస్త్ శిక్ష.. 20 గుంజీలు తీయించిన బిగ్‌బాస్.. ఇంట్లో కొత్త కెప్టెన్ ఎవరంటే?

    |

    బిగ్‌బాస్ హౌస్‌లో 12వ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగింది. స్కిట్స్, పాటలు, డ్యాన్సులతో సరదాగా సాగినప్పటికీ, మధ్యలో గొడవలు, అలకలు ఎప్పటిలానే కనిపించాయి. అలాగే ఇంటి నిబంధనలు ఉల్లంఘించిన ఇంటి సభ్యులకు శిక్ష విధిస్తూ బిగ్‌బాస్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మూడో వారానికి ఇంటి కెప్టెన్‌ ఎంపిక సానుకూలంగా, ప్రశాంతంగా జరిగింది. 12వ రోజు ఇంటిలో ఏమేమి జరిగాయంటే..

    రెండు గ్రూపులు స్కిట్స్

    రెండు గ్రూపులు స్కిట్స్

    ఇంటిలో టాస్క్‌లో భాగంగా ఇంటిలో రెండు స్కిట్లు జరిగాయి. అమ్మా రాజశేఖర్ టీమ్ ఒక జట్టు కాగా, కరాటే కల్యాణి ట్రూప్ మరో జట్టుగా చిన్న నాటకాలను ప్రదర్శించారు. పస్తులతో బాధపడే నాటక సమాజం నేపథ్యంగా అమ్మా రాజశేఖర్ స్కిట్‌ను ప్రదర్శించగా, సినిమా షూటింగ్ బ్రాక్‌డాప్‌లో కామెడీ స్కిట్‌ను కరాటే కల్యాణి ట్రూప్ చేసింది.

    విజేత ఎంపిక అమ్మా రాజశేఖర్ అసంతృప్తి

    విజేత ఎంపిక అమ్మా రాజశేఖర్ అసంతృప్తి

    అయితే ఈ స్కిట్స్‌లో కారటే కల్యాణి టీమ్‌కు బహుమతి ప్రకటించడం వివాదంగా మారింది. గంగవ్వ నిర్ణయం ప్రకారం విజేత నిర్ణయించడంపై అమ్మా రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. టాలెంట్ ఆధారంగా విజేతను ప్రకటించాలని సూచించాడు. కనీసం ఇద్దరిని విజేతలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే విజేతకు మాజా జ్యూస్ బాటిల్ బహుమతిగా ఇస్తానని ప్రకటించిన బిగ్‌బాస్. రెండు జట్లకు రెండు మాజా బాటిల్స్ పంపడంతో వివాదం అక్కడితో ముగిసింది.

    ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ శిక్ష

    ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ శిక్ష


    ఇంటి సభ్యులు నియమాలు పాటించకపోవడంపై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాకపోవడం, తెలుగులో మాట్లాడకుండా ఇతర భాషల్లో మాట్లాడటంపై కోపగించుకొన్నారు బెల్ మోగిన సమయంలో గార్డెన్ ఏరియాలోకి వచ్చి 20 గుంజీలు తీయాలి. బోర్డుపై బిగ్‌బాస్ మమల్ని క్షమించాలి అని బోర్డుపై రాయాలి అని ఆదేశాలు ఇచ్చారు.

    తెలుగు టీచర్‌గా మారిన సుజాత

    తెలుగు టీచర్‌గా మారిన సుజాత


    అంతేకాకుండా సుజాత నుంచి మోనాల్ గజ్జర్, అభిజిత్, అఖిల్ సార్థక్, నోయల్‌ తెలుగు నేర్చుకోవాలి. ఇక నుంచి తెలుగులోనే మాట్లాడాలి. దాంతో అందరి చేత బోర్డుపై రాయించింది. ముఖ్యంగా మోనాల్‌కు తెలుగును నేర్పిస్తూ కనిపించింది. ఇంటి సభ్యులు నియమాలను పాటించకపోవడంతో దానికి బాధ్యతగా కెప్టెన్ లాస్యకు పనిష్‌మెంట్ ఇచ్చారు. బెల్ మోగిన ప్రతీసారి తనకు ఇష్టమైన వస్తువును త్యాగం చేస్తూ స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని ఆదేశించాడు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు మొదటగా నెయిల్ పాలిష్ త్యాగం చేసింది.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Episode 13 Highlights | బిగ్ బాస్ పనిష్మెంట్ | Filmibeat Telugu
    ఇంటి కెప్టెన్‌గా నోయల్ సీన్

    ఇంటి కెప్టెన్‌గా నోయల్ సీన్

    ఇంటి సభ్యులు శిక్షను పాటించిన తర్వాత వారిని శిక్ష నుంచి మినహాయిస్తూ పనిష్‌మెంట్ రద్దు చేశాడు. ఆ తర్వాత ఇంటిలో కెప్టెన్ ఎంపిక మొదలైంది. నోయల్, అభిజిత్, మెహబూబ్, కల్యాణి కెప్టెన్ రేసులోకి వచ్చారు. ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో నోయల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎన్నుకొన్నారు. కెప్టెన్‌గా ఎన్నికైన నోయల్‌ను బిగ్‌బాస్ అభినందించారు.

    English summary
    Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. Day 11 goes with happy note. Noel Sean elected as captain for next week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X