నోయల్ ఆరోగ్యంపై అనుమానాలు: అతడికి వచ్చిన వ్యాధిని ఎందుకు సీక్రెట్‌గా ఉంచారు?

By Manoj

నోయల్ సీన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరిది. అద్భుతమైన టాలెంట్‌తో అంతలా అతడు ప్రభావం చూపిస్తున్నాడు. సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించినప్పటికీ... తనలోని ఎన్నో విద్యలను బయట పెడుతూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ కారణంగానే ఇండస్ట్రీలో బిజీ సెలెబ్రిటీగా మారిపోయాడు. ఇక, ఇటీవలే బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టిన అతడు.. తాజాగా దాని నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో నోయల్ ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతడి గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...

బుల్లితెర నుంచి మొదలెట్టిన నోయల్

బుల్లితెర నుంచి మొదలెట్టిన నోయల్

కెరీర్ ఆరంభంలోనే అదరగొట్టేసి మంచి గుర్తింపును అందుకున్నాడు నోయల్. బుల్లితెరపై వచ్చిన కొన్ని షోలకు మ్యూజిక్ కంపోజ్ చేసి సత్తా చాటిన అతడు.. ఆ తర్వాత కంపోజర్‌గా, సింగర్‌గా, ర్యాపర్‌గా, లిరిసిస్టుగా కనిపించి మెప్పించాడు. యాక్టింగ్‌పై ఉన్న ఆసక్తితో చాలా సినిమాల్లో కీలక పాత్రలు కూడా పోషించాడు. కొన్ని చిత్రాల్లో లీడ్ రోల్ కూడా చేసి ఆకట్టుకున్నాడు.

పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎత్తు పల్లాలు

పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎత్తు పల్లాలు

కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన నోయల్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొన్నాడు. మరీ ముఖ్యంగా వైవాహిక జీవితాన్ని అర్థాంతరంగా ముగించి వార్తల్లో నిలిచాడు. గత ఏడాది హీరోయిన్ ఎస్తర్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న అతడు.. ఈ సంవత్సరం విడాకులు తీసుకున్నాడు. ఆ మధ్య ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

కొత్త జీవితానికి అలా నాంది పలికాడు

కొత్త జీవితానికి అలా నాంది పలికాడు

భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత నోయల్ కొత్త జీవితాన్ని గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందుకు అనుగుణంగానే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ -4లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి పెద్దగా పేరున్న వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో నోయల్ ఒకడు. అందుకే పలుమార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు.

సూపర్ గేమ్.. మంచోడిగా పేరొచ్చింది

సూపర్ గేమ్.. మంచోడిగా పేరొచ్చింది


బిగ్ బాస్ సీజన్ 4లోని టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్నాడు నోయల్. అందుకు అనుగుణంగా అతడు హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి సూపర్ మైండ్‌ గేమ్ ఆడుతున్నాడు. మిగిలిన కంటెస్టెంట్ల‌ను చదవడంతో పాటు బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల సీక్రెట్‌ను కూడా గ్రహిస్తున్నాడు. అదే సమయంలో అందరితో స్నేహంగా ఉంటూ మంచోడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆరోగ్య సమస్యలు.. షో నుంచి అవుట్

ఆరోగ్య సమస్యలు.. షో నుంచి అవుట్

ర్యాప్ సాంగ్‌తో రచ్చ రచ్చ చేస్తూ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు నోయల్. ఆ తర్వాత టాస్కుల్లోనూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. అదే సమయంలో కాలి నొప్పితో చాలా రోజుల పాటు బాధ పడ్డాడు. ఇక, ఈ మధ్య అతడి ఆరోగ్యం బాగా క్షిణించింది. దీంతో వైద్యుల సూచన మేరకు నోయల్‌ను షో నుంచి బయటకు పంపేశారు నిర్వహకులు. ఇది చాలా మందిని షాక్‌కు గురి చేసింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
ఆరోగ్యంపై అనుమానాలు.. సీక్రెట్‌గా

ఆరోగ్యంపై అనుమానాలు.. సీక్రెట్‌గా

నోయల్ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత అతడి ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడికి పలానా వ్యాధి వచ్చిందని ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. నోయల్‌‌కు ప్రాణహాని లేదట. అతడు త్వరగానే కోలుకుంటాడని అంటున్నారు. మరోవైపు తన వ్యాధి గురించి రివీల్ చేయొద్దని నిర్వహకులకు నోయల్ రిక్వెస్ట్ చేసినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X