For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్‌ తెలుగు 4కి మరో షాక్.. షో ప్రారంభానికి బ్రేక్.. ఇంట్లోకి హాట్ భామ!

  |

  అనేక విఘ్నాలను దాటుకొంటూ ముందుకెళ్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4కు మరో షాక్ తగలింది. ఇప్పటికే ప్రారంభానికి సిద్దమైన ఈ షోను వారంపాటు వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. అయితే నిర్వాహకులు మాత్రం ఈ వార్తపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ సీజన్‌లో తాజా జాబితాలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అసలు బిగ్‌బాస్ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నది? ఈ సీజన్‌లోకి కొత్తగా అడుగుపెడుతున్న భామ ఎవరంటే..

  ఆగస్టు 30వ తేదీన కాకుండా

  ఆగస్టు 30వ తేదీన కాకుండా

  వాస్తవానికి బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను ఆగస్టు 30వ తేదీన ప్రారంభించాలని ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు ప్లాన్ చేశారు. అయితే వారి ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగానే సాగింది. సెలబ్రిటీల ఎంపిక, వారిని క్వారంటైన్‌కు తరలింపు అంశాలు చక్కగానే ముందుకెళ్లాయి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సెట్‌కు సంబంధించిన పనుల్లో కొంత జాప్యం జరిగిందని, అందుకే షోను వాయిదా వేసినట్టు సమాచారం.

  20 మందిని క్వారంటైన్‌కు

  20 మందిని క్వారంటైన్‌కు


  ఇక ఇప్పటికే 16 మంది సెలబ్రిటీలను సెలెక్ట్ చేసి వారిని హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌కు తరలించారు. వారితో పాటు నలుగురు స్టాండ్‌బై సెలబ్రిటీలను పది రోజుల ముందుగానే క్వారంటైన్‌ విధించారు. అయితే తాజాగా క్వారంటైన్‌లో ఉంటున్న ఓ గాయకుడికి కరోనా పాజిటివ్ అనే విషయం నిర్ధారించినట్టు సమాచారం. అయితే షో ప్రారంభానికి ముందు వరకు నెగిటివ్ అని తేలితే కొనసాగించడం లేదా తన స్థానంలో మరొకరిని వెనుకకు పంపించడం జరుగుతుందనే మాట వినిపిస్తున్నది.

  సిబ్బంది సంఖ్యలో భారీ కోత

  సిబ్బంది సంఖ్యలో భారీ కోత

  ఇక బిగ్‌బాస్ షో కోసం భారీ సంఖ్యలో సిబ్బందిని ఉపయోగిస్తారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి కారణంగా చాలా తక్కువ మంది సిబ్బందితో ఈ షోను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే సిబ్బంది జీతాల్లో కోత కూడా విధించినట్టు తెలుస్తున్నది. అయితే షో నిర్వాహణ కోసం అన్ని జాగ్రత్తలతో ముందుకెళ్తున్నట్టు సమాచారం.

  బిగ్‌బాస్‌లోకి అలేఖ్య హారిక

  బిగ్‌బాస్‌లోకి అలేఖ్య హారిక

  అయితే తాజా జాబితాలోకి ఓ యూట్యూబ్ సంచలనం దూసుకొచ్చినట్టు సమాచారం. యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్న అలేఖ్య హారిక బిగ్‌బాస్ సీజన్ 4కు ఎంపికైనట్టు సమాచారం. ఆమెను ఆగస్టు మొదటి వారంలో సంప్రదించడం, అందుకు ఒకే చెప్పడంతో ఆమెను నిబంధనల ప్రకారం క్వారంటైన్‌కు తరలించారు.

  తాజా జాబితా ఇదే అంటూ..

  తాజా జాబితా ఇదే అంటూ..


  లేటెస్ట్ జాబితా ప్రకారం.. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4కు ఎంపికైన వారిలో.. టీవీ9కి చెందిన న్యూస్ ప్రజెంటర్ దేవీ, జబర్దస్త్ అవినాష్, యూట్యూబర్ గంగవ్వ, డైరెక్టర్ సూర్య కిరణ్, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్, హీరోయిన్ మోనాల్ గుజ్జర్, యాంకర్లు లాస్య మంజునాథ్, అరియానా గ్లోరి, టీవీ యాకర్లు తనుజా పుట్టుస్వామి, సయ్యద్ సోహైల్ర్యాన్, యాక్టర్ నందు, సోషల్ మీడియాలో ప్రముఖులు మోహబూబ్ షేక్, దేత్తడి హారిక కరాటే కల్యాణి, నోయల్ సీన్ తదితరులు ఉన్నారు.

  Actress Shiva Parvathi About Her Condition And Rumors Over Social Media
  సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభం

  సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభం

  ఆగస్టు 30న ప్రారంభం కావాల్సిన బిగ్‌బాస్ సీజన్ 4 షో అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని, అయితే ఈ షోను సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. సెట్ పనులు, ఇతరత్రా పనులు పూర్తి కాని కారణంగా ఈ షో ఆలస్యానికి ప్రధాన కారణమని నిర్వాహణ సిబ్బంది వెల్లడించారు.

  English summary
  Bigg Boss Telugu Season 4: Biggest Realty show of Bigg Boss Telugu season 4 all set to go on air. Host Nagarjuna's Show will start from August 30th. Before the show, All the 16 members of celebrities kept in quarantine. But One of 16 Celebrities tested corona positive in quarantine centre.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X