Bigg Boss Telugu 4 విజేత అభిజిత్ దుడ్డాల.. చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫి.. ఎమోషనల్‌గా మెగాస్టార్‌కు పాధాభివందనం

బిగ్ బాస్ షో ఫినాలే సందడి రచ్చ రచ్చగా ఉంది. టాప్ కంటెస్టెంట్లు కాకుండా, నాల్గో సీజన్ సభ్యులందరూ స్టేజ్ మీదకు వచ్చారు. డ్యాన్సులతో అదరగొట్టేశారు. టాప్ 5 కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. కంటెస్టెంట్ల తమ ఇంటి సభ్యులతో మాట్లాడారు. అంతా సందడిగా సరదాగా జరుగుతున్న క్రమంలో టాప్ 5 నుంచి మొదటి ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటికే హారిక,అరియానాలు ఎలిమినేట్ అయ్యారు. సోహెల్ తనంతట తానే 25 లక్షల డీల్‌కు టెంప్ట్ బయటకు వచ్చేశాడు.

 తమన్ మ్యూజిక్ కాన్సర్ట్..

తమన్ మ్యూజిక్ కాన్సర్ట్..

సోహెల్ ఎలిమినేట్ తరువాత తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ అదరగొట్టేశాడు. రమ్య బెహర, గీతా మాధురి, హరితేజ్, సాకేత, శ్రీకృష్ణ, సింహతో పాటల కచేరని పెట్టాడు. అల వైకుంఠపురములో పాటలు, తమన్ పాటలతో దుమ్ములేపేశారు. చివరకు రాములో రాముల పాటతో, అల వైకుంఠపురములో టైటిల్ సాంగ్‌తో ఎండింగ్ దుమ్ములేపారు.

ఇంట్లోకి వెళ్లిన నాగ్..

ఇంట్లోకి వెళ్లిన నాగ్..

టాప్ 2లో ఉన్న అఖిల్, అభిజిత్‌లను తీసుకొచ్చేందుకు నాగార్జున బిగ్ బాస్ ఇంటి లోపలకి వెళ్లాడు. ఎంతో గ్రాండ్‌గా కాంతులు వెదజల్లుతూ ఆ ఇద్దరి చేతులను పట్టుకుని నాగార్జున బయటకు పట్టుకొచ్చాడు. వారు అలా వస్తుంటే.. చిచ్చుబుడ్డి కాంతులు వెదజల్లుతూ ఉండగా.. బిగ్ బాస్ ఇంటికి వీడ్కోలు పలికారు.

చిరు గ్రాండ్ ఎంట్రీ..

చిరు గ్రాండ్ ఎంట్రీ..

ఇక బిగ్ బాస్ విన్నర్‌ను ప్రకటించేందుకు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అభిజిత్, అఖిల్ గురించి చిరు మాట్లాడాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఎంతో మెచ్చుర్డ్‌గా కనిపించావ్.. అది పాత్ర అనుకున్నా కానీ ఒరిజినల్‌గానూ అలానే ఎంతో మెచ్యుర్డ్‌గా ఉన్నావ్ అని చిరు పొగిడేశాడు. స్నేహం, ప్రేమ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పంచాడంటూ అఖిల్ గురించి చిరు చెప్పుకొచ్చాడు.

 వరాలజల్లు..

వరాలజల్లు..

ఇక ఇంటి సభ్యులందరితో మాట్లాడిన చిరు కొందరిపై వరాల జల్లు కురిపించాడు. సోహెల్ తీయబోయే సినిమాకు ప్రమోషన్ చేస్తానని చెప్పాడు. ఇంటి నుంచి వండిన మటన్‌ను సోహెల్‌కు ఇచ్చాడు. దివి వేదాళం రీమేక్‌లో ఆఫర్ ఇచ్చాడు. మెహబూబ్‌కు స్టేజ్ మీదే పది లక్షల చెక్కు ఇచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
చిరు చేతుల మీదుగా..

చిరు చేతుల మీదుగా..

అఖిల్ అభిజిత్ ఇద్దరిలో నాగార్జున విన్నర్‌ను ప్రకటించాడు. చిరు చేతుల మీదుగా అభిజిత్ ట్రోఫీని అందుకున్నాడు. ట్రోఫీ అందుకున్న అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు. ఓట్లు వేసిన ప్రేక్షకులను పాదాభివందనం అని అభిజిత్ ఎమోషనల్‌గా మోకాళ్ల మీద నిల్చున్నాడు. ఇంతకంటే ప్రేక్షకులకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదంటూ ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X