దివితో అభిజీత్‌కు అలాంటి రిలేషన్: డేట్ గురించి మాట్లాడడంతో.. లైవ్ షోలో బయటపడ్డ బంధం

అభిజీత్.. అభిజీత్.. అభిజీత్.. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవడంతో పాటు దేశ వ్యప్తంగా ట్రెండ్ అవుతోన్న పేరిది. సినిమా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయిన అతడు.. అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయాడు. కానీ, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల మద్దతుతో నాలుగో సీజన్‌కు విన్నర్ కూడా అయ్యాడు. ఈ నేపథ్యంలో అభిజీత్ ఓ ఇంటర్వ్యూలో తోటి కంటెస్టెంట్ దివి వద్యాతో ఉన్న రిలేషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఇద్దరమ్మాయిలతో లవ్ ట్రాకుతో హైలైట్

ఇద్దరమ్మాయిలతో లవ్ ట్రాకుతో హైలైట్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో అభిజీత్. మొదటి రోజు నుంచే హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత ఆమె అఖిల్ సార్థక్ వైపు వెళ్లిపోయింది. దీంతో అభిజీత్.. దేత్తడి హారికతో చనువుగా ఉండడం ప్రారంభించాడు. ఇలా ఇద్దరమ్మయిల కారణంగా అతడు బాగా హైలైట్ అయ్యాడు.

మొదటి నుంచీ హవా.. అందుకే గెలుపు

మొదటి నుంచీ హవా.. అందుకే గెలుపు


సీజన్ మొదట్లో అభిజీత్ వ్యవహరించిన తీరుకు హౌస్‌లోని అమ్మాయిలను పడేసేందుకు కష్టాలు పడుతూ ఉంటాడేమో అని అంతా అనుకున్నారు. కానీ, ఆ తర్వాత అందుకు భిన్నంగా ప్రవర్తించాడాతను. ప్రతి విషయంలోనూ హుందాగా వ్యవహరిస్తూ వచ్చాడు. అందుకే ప్రేక్షకులు అతడికి జై కొట్టారు. ఈ కారణంగానే సీజన్ మధ్య నుంచే అభిజీత్ విన్నర్ అనే టాక్ వచ్చేసింది.

అవన్నీ అభిజీత్‌కు బాగా కలిసొచ్చాయి

అవన్నీ అభిజీత్‌కు బాగా కలిసొచ్చాయి

నాలుగో సీజన్‌ను అభిజీత్ గెలుచుకోడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొదటి నుంచే బిగ్ బాస్ హౌస్‌లో అందరూ అతడిని టార్గెట్ చేయడం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అది మాత్రమే కాదు.. ఏకంగా 11 సార్లు నామినేట్ అవడంతో అతడికి ఓట్లు వేయడానికి ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. అలాగే, సినీ ప్రముఖుల మద్దతు కూడా అభిజీత్‌ విజయానికి దోహద పడింది.

వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా అభి

వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా అభి

106 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగాడు అభిజీత్. గ్రాండ్ ఫినాలేలో విన్నర్‌గా నిలవడంతో అతడు విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే తన విజయానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. అదే సమయంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడీ బిగ్ బాస్ విజేత.

అభిజీత్‌ను సర్‌ప్రైజ్ చేసిన నటి దివి వద్యా

అభిజీత్‌ను సర్‌ప్రైజ్ చేసిన నటి దివి వద్యా


బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత తీరిక లేని ఇంటర్వ్యూలతో ట్రెండింగ్ అవుతున్నాడు అభిజీత్. ఈ క్రమంలోనే బుధవారం అతడు ఓ న్యూస్ ఛానెల్‌లో చిట్ చాట్ షో నిర్వహించాడు. ఇందులో అభిజీత్‌కు ఫోన్ చేసి సర్‌ప్రైజ్ చేసింది తోటి కంటెస్టెంట్ దివి వద్యా. ఈ సందర్భంగా మాట్లాడుతున్న సమయంలోనే ఒకరిపై ఒకరు ఇష్టాన్ని బయట పెట్టుకోవడం విశేషం.

డేట్ గురించి మాట్లాడడంతో రిలేషన్‌పై

డేట్ గురించి మాట్లాడడంతో రిలేషన్‌పై


ఈ ఫోన్ కాల్ సమయంలో అభిజీత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది దివి. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్‌లో తామెంతో క్లోజ్‌గా ఉండేవాళ్లమని, టీ తాగుతూ పర్సనల్ విషయాలు మాట్లాడుకునే వాళ్లమని గుర్తు చేసింది. అప్పుడు కలుగజేసుకున్న అభిజీత్ ‘దివి నీతో చాలా మాట్లాడాలి. మనం డిన్నర్ డేట్‌కు వెళ్దాం. అక్కడ అన్నీ చర్చించుకుందాం' అని అనగానే ఆమె కూడా ఓకే చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X