సోహెల్‌కు సవాల్ విసిరిన అభిజీత్: ఆ ఇద్దరు కంటెస్టెంట్లనూ బుక్ చేసిన బిగ్ బాస్ విన్నర్

సినిమాల్లో హీరోగా చేసినా సరైన గుర్తింపు దక్కక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు లవర్ బాయ్ అభిజీత్. అయితే, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం అతడికి ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చేసింది. ప్రతి సందర్భంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టిన ఈ కుర్రాడు.. ప్రేక్షకుల మద్దతుతో విజేతగా నిలిచాడు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారిన అభిజీత్.. తాజాగా ఓ విషయంలో మరో కంటెస్టెంట్‌ సోహెల్‌కు సవాల్ విసిరాడు. మరో ఇద్దరిని కూడా బుక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

మొదటి నుంచీ హవా.. అందుకే గెలుపు

మొదటి నుంచీ హవా.. అందుకే గెలుపు

అభిజీత్ బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆరంభంలో సాదాసీదా కుర్రాడిలా కనిపించాడు. హౌస్‌లోని అమ్మాయిలను పడేసేందుకు కష్టాలు పడుతూ ఉంటాడేమో అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా ప్రవర్తించాడాతను. ప్రతి విషయంలోనూ హుందాగా వ్యవహరిస్తూ వచ్చాడు. అందుకే ప్రేక్షకులు అతడికి జై కొట్టారు. ఈ కారణంగానే సీజన్ మధ్య నుంచే అభిజీత్ విన్నర్ అనే టాక్ వచ్చేసింది.

అవన్నీ అభిజీత్‌కు బాగా కలిసొచ్చాయి

అవన్నీ అభిజీత్‌కు బాగా కలిసొచ్చాయి

నాలుగో సీజన్‌ను అభిజీత్ గెలుచుకోడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొదటి నుంచే బిగ్ బాస్ హౌస్‌లో అందరూ అతడిని టార్గెట్ చేయడం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అది మాత్రమే కాదు.. ఏకంగా 11 సార్లు నామినేట్ అవడంతో అతడికి ఓట్లు వేయడానికి ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. అలాగే, సినీ ప్రముఖుల మద్దతు కూడా అభిజీత్‌ విజయానికి దోహద పడింది.

 వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా అభి

వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా అభి

106 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగాడు అభిజీత్. గ్రాండ్ ఫినాలేలో విన్నర్‌గా నిలవడంతో అతడు విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే తన విజయానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. అదే సమయంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడీ బిగ్ బాస్ విజేత.

 ఓ మంచి పని చేసిన బిగ్ బాస్ 4 విన్నర్

ఓ మంచి పని చేసిన బిగ్ బాస్ 4 విన్నర్

ఒక ఛానెల్ తర్వాత మరో ఛానెల్ అన్నట్లుగా చిట్ చాట్ షోలు నిర్వహిస్తున్నాడు అభిజీత్. ఈ సందర్భంగా తన బిగ్ బాస్ జర్నీపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటాడు.

ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన అభిజీత్

ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన అభిజీత్

మొక్కను నాటిన తర్వాత అభిజీత్ మీడియాతో మాట్లాడాడు. ‘బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఏదైనా మంచి పని చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటాను. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు. రోజు రోజుకూ పెరుగుతోన్న కాలుష్యాన్ని మనందరం నియంత్రించాలి.. అందుకోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలి' అని పేర్కొన్నాడు.

సోహెల్‌తో పాటు ఆ ఇద్దరికి సవాల్ విసిరి

సోహెల్‌తో పాటు ఆ ఇద్దరికి సవాల్ విసిరి

దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటిన తర్వాత మరో ముగ్గురిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అందుకే అభిజీత్.. బిగ్ బాస్ కంటెస్టెంట్లు సయ్యద్ సోహెల్ రియాన్, దేత్తడి హారిక, కరాటే కల్యాణీలకు సవాల్ విసిరాడు. ఈ ముగ్గురినీ మొక్కలు నాటాలని నామినేట్ చేయడంతో వాళ్లు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X