twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌లో మిడ్‌నైట్ మసాలా.. పార్టీలో మునిగి తేలిన సెలబ్రిటీలు.. స్వింగ్ జరా అంటూ రచ్చ రచ్చ

    |

    బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో 40వ రోజు రచ్చ రచ్చ జరిగింది. మహిళలకు బిగ్‌బాస్ మిడ్‌నైట్ పార్టీ చేసుకోమని అవకాశం ఇవ్వడంతో కంటెస్టెంట్లు రచ్చ రచ్చ చేశారు. మగ కంటెస్టెంట్లను టీజింగ్ చేస్తూ హంగామా చేశారు. రాత్రంతా మిడ్‌నైట్ మసాలా పార్టీతో హల్‌చల్ చేశారు. ఇంకా 40వ రోజు ఏం జరిగిందంటే..

    టీవీఎస్ రేసర్ ఆఫ్ ది హౌస్

    టీవీఎస్ రేసర్ ఆఫ్ ది హౌస్

    బిగ్‌బాస్ ఇంటిలో టీవీఎస్ రేసర్ ఆఫ్ ది హౌస్ కాంటెస్ట్ జరిగింది. ఆ పోటీల పాల్గొనడానికి ముందు ఇంటి సభ్యులతో పుష్ అప్స్ కొట్టాలని బిగ్‌బాస్ చెప్పారు. అందులో గెలిచిన ఐదుగురు కాంటెస్ట్‌లో పాల్గొనడానికి అర్హులని రూల్స్ చెప్పారు. ఇంటి సభ్యులందరూ పుష్ అప్స్ కొట్టగా.. సోహైల్, మెహబూబ్, అఖిల్, కుమార్ సాయి, అవినాష్ పాల్గొన్నారు.

    చాంఫియన్‌షిప్ కోసం ఈవెంట్స్

    చాంఫియన్‌షిప్ కోసం ఈవెంట్స్

    ఆ తర్వాత ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి పలు ఈవెంట్లను పెట్టారు. టైర్స్‌ను దాటుకొంటూ వెళ్లి.. మోకాళ్ల మీద పాకుకుంటూ వెళ్లడం, స్విమ్మింగ్ పూల్‌లో దూకి ఓ మూటను మోసుకొంటూ రావడం లాంటి ఈవెంట్స్‌ను ఈ కాంటెస్ట్‌లో ఉంచారు. ఆర్మీలో ఉండే విధంగా ఈవెంట్స్‌ను డిజైన్ చేశారు. ఈ పోటీలో మెహబూబ్ విజేతగా నిలిచారు. ఇంటి సభ్యులందరూ ప్రశంసించి మెహబూబ్‌కు షీల్డ్‌ను అందజేశారు.

    మెహబూబ్, సోహైల్‌పై అఖిల్ ఫైర్

    మెహబూబ్, సోహైల్‌పై అఖిల్ ఫైర్

    ఆ తర్వాత టాస్క్‌లో పాల్గొనడానికి అఖిల్ పుష అప్స్ కొట్టిన అంశంపై అఖిల్, మెహబూబ్, సోహైల్ మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. నీవు 100కుపైగా పుష్ అప్స్ కొట్టావా అని అడిగిన మెహబూబ్‌పై అఖిల్ సీరియస్ అయ్యాడు. నీ ఉద్దేశంలో ఏమనుకొంటున్నావు అంటూ గట్టిగా సోహైల్‌, మెహబూబ్‌ను దులిపేశాడు.

    ఇంటిలో మిడ్‌నైట్ పార్టీ

    ఇంటిలో మిడ్‌నైట్ పార్టీ

    ఆ తర్వాత ఇంటిలో లేడీ కంటెస్టెంట్లకు మిడ్‌నైట్ పార్టీని చేసుకోమని ఛాన్స్‌‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. దాంతో అదరగొట్టేంత అందంతో అరియానా, దివి, హారిక, లాస్య, మెనాల్ ముస్తాబయ్యారు. ఇక మగ కంటెస్టెంట్లను ఇంట్లోకి పిలిచి టీజింగ్, ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అభిజిత్, సోహైల్, అమ్మా రాజశేఖర్‌ను ఓ ఆట ఆడేసుకొన్నారు.

    Recommended Video

    Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
    స్వింగ్ జరా అంటూ జోష్‌తో స్టెప్పులు వేసి

    స్వింగ్ జరా అంటూ జోష్‌తో స్టెప్పులు వేసి

    ఇక మిడ్‌నైట్ పార్టీలో ఇంటర్వ్యూలు, టీజింగ్ పూర్తయిన తర్వాత ఇంటి సభ్యులందరూ స్వింగ్ జరా పాటకు ఊగిపోయారు. హారిక, అరియానా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. సోహైల్, అమ్మా రాజశేఖర్, అఖిల్ అందరూ కలిసి మిడ్‌నైట్ పార్టీలో జల్సా చేశారు. అలా వీకెండ్ పార్టీని ముగించారు. పార్టీ జరిగినంత సేపు ఇంటి సభ్యులు జోష్‌లో మునిగిపోయి కనిపించారు.

    English summary
    Big Boss Telugu 4 season's 40th day update: Sohel syed ryab, Ariana Glory, Harika dettadi rampage in Bigg Boss house. Fun activity goes viral among the celebrities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X