బిగ్‌బాస్‌లో దొంగలు.. దారుణంగా హింస.. కొట్లాడుకొన్న వితిక, వరుణ్

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 45 Highlights ||

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో 44వ రోజు గందరగోళంగా సాగింది. ఇంటిలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రవేశించిన శిల్ప చక్రవర్తి తన మార్కు చూపించేందుకు ప్రయత్నం చేశారు. ఇంటి సభ్యులతో కలిసి పోయేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఇంటిలోకి దొంగలు ప్రవేశించడం.. ఆ వెంటనే టాస్క్ నిర్వహించడం జరిగింది. టాస్క్ సందర్బంగా ఇంటి సభ్యుల హింస చోటు చేసుకొన్నది. వివరాల్లోకి వెళితే..

బాబా భాస్కర్‌తో శిల్ప చక్రవర్తి

బాబా భాస్కర్‌తో శిల్ప చక్రవర్తి

సోమవారం ఉదయమే ఇంటిలోని పరిస్థితులపై బాబా భాస్కర్‌తో శిల్ప చక్రవర్తి చర్చించడం కనిపించింది. ఓ దశలో బాబా భాస్కర్‌ను శిల్ప పొగడ్తలతో ముంచెత్తింది. మీరు మీ జీవితంలో ఎంత మందిని చూసి ఉంటారు. ఇదంతా మీకు ఓ లెక్కానా? ప్రతీ రోజు కొత్త వ్యక్తులు మీ జీవితంలో చాలా సాధారణం. వారిని మీరు ఎలా మేనేజ్ చేశారో నాకు తెలుసు అంటూ శిల్ప చక్రవర్తి అన్నారు.

రాహుల్, పునర్నవి సన్నిహితంగా

రాహుల్, పునర్నవి సన్నిహితంగా

ఇక ఇంటిలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాల మధ్య సాన్నిహిత్యం పెరిగినట్టు స్పష్టమైంది. వారిద్దరూ కలిసి ఆరు బయట సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ క్లోజ్‌గా కనిపించారు. ఇంటి సభ్యుల ప్రవర్తనపై వారి మధ్య చర్చ జరిగింది. అయితే వారిద్దరి మధ్య అఫైర్ ముదురుతుందనే ఆరోపణలకు ఈ రోజు వారిద్దరి ప్రవర్తన మరింత బలాన్ని చేకూర్చింది.

ఇంట్లోకి దొంగలు ప్రవేశించి

ఇంట్లోకి దొంగలు ప్రవేశించి

ఇంటి సభ్యుల్లో ముచ్చట్లో ఉండగా, ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. ఇంట్లోని వస్తువులను దోచుకెళ్లడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకొనేందుకు ఇంటి సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. శ్రీముఖి, శిల్ప, అలీ, రాహుల్, పునర్నవి, వితిక దొంగలతో అమీతుమీకి దిగారు. ఇంటిలోనే వస్తువులే కాకుండా బాత్రూంలోని అన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లారు.

దొంగల దోచిన వస్తువులు

దొంగల దోచిన వస్తువులు

ఆ తర్వార దొంగలు ఎత్తుకెళ్లిన వస్తువులను ఓ చోట ఉంచి.. దొంగలు దోచిన వస్తువులను మళ్లీ తెచ్చుకొనేందుకు టాస్క్ నిర్వహించారు. ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడకొట్టి.. వస్తువులను కాపాడే గ్రూప్ ఒకరిని, వస్తువులను తీసుకెళ్లేందుకు మరో గ్రూపుకు టాస్క్ కల్పించారు. ఈ టాస్క్‌ను రెండు గ్రూపులు చాలా ఛాలెంజిగ్‌గా తీసుకొన్నారు.

దొంగల రాణిగా

దొంగల రాణిగా

దొంగల దోపిడి టాస్క్‌లో దొంగల రాణిగా శిల్ప చక్రవర్తి కనిపించింది. వరుణ్, శివజ్యోతి, రాహుల్, పునర్నవి దొంగల బ్యాచ్‌లో ఉన్నారు. వస్తువును చేజిక్కించుకొనే బ్యాచ్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్, వితిక, హిమజ తదితరులు ఉన్నారు. దొంగల బ్యాచ్‌కు నల్లటి డ్రస్ కోడ్ ఇచ్చారు.

హింసకు తావులేదని

హింసకు తావులేదని

ఇక దొంగలు దోచిన వస్తువులను తీసుకెళ్లకుండా ఓ గ్రూపు, తీసుకెళ్లడానికి మరో గ్రూపు మధ్య పోటీ భారీగానే జరిగింది. ఓ దశలో భారీగా హింసకు దిగినట్టు కనిపించింది. అయితే ఇంటి సభ్యులను హాలులోకి పిలిచి బిగ్‌బాస్ క్లాస్ పీకారు. హింసతో కాకుండా యుక్తితో, తెలివి తేటలతో గేమ్ ఆడాలని సూచించారు. బిగ్‌బాస్‌లో హింసకు తావులేదని స్పష్టం చేశారు.

కొట్లాడుకొన్న వితిక, వరుణ్

కొట్లాడుకొన్న వితిక, వరుణ్

బిగ్‌బాస్ హెచ్చరించినప్పటికీ టాస్క్‌లో ఇంటి సభ్యుల మధ్య ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ టాస్క్ సందర్భంగా కొందరు జారిపడి దెబ్బలు తగిలించుకొన్నారు. మరికొందరు మరొకరిపై బలం చూపారు. ఈ క్రమంలో వరుణ్, వితిక మధ్య భారీగా గొడవ జరిగింది. వితికను దురుసుగా తోసేసి వరుణ్ గన్ తీసుకెళ్లడంతో వారి మధ్య గొడవ భారీగానే జరిగింది. శ్రీముఖి వారిని సముదాయించే ప్రయత్నం చేసింది. రేపటికి కూడా ఈ గేమ్ కొనసాగేలా సంకేతాలు కనిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X