అలీ చేసిన మోసానికి బలి.. చేయని తప్పుకు రవికృష్ణ జైలుశిక్ష
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో గందరగోళానికి కారణమైన టాస్క్ రద్దు తర్వాత ఇంట్లో ఎమోషనల్ సన్నివేశాలు నెలకొన్నాయి. ఇంట్లోకి కొత్తగా వచ్చిన శిల్ప చక్రవర్తి, యాంగ్రీ యంగ్ మ్యాన్ అలి రెజా లాంటి వాళ్లు భోరున విలపించారు. ఇక ఇంట్లో అలీ చేసిన మోసానికి రవికృష్ణ జైలు పాలయ్యాడు. ఇలాంటి భావోద్వేగాలతో బిగ్‌బాస్ హౌస్ రచ్చ రచ్చగా మారింది. ఈ భావోద్వేగాలకు కారణమేమిటంటే..

టాస్క్ రద్దు తర్వాత వరుణ్ సందేశ్
బిగ్‌బాస్ టాస్క్ రద్దు చేసిన తర్వాత దానికి కారణమైన వారిని శిక్ష విధిస్తానంటూ బిగ్‌బాస్ వెల్లడించారు. టాస్క్ రద్దు కావడానికి కారణమైన ఇద్దరి పేర్లను చెప్పాలని కెప్టెన్ వరుణ్ సందేశ్‌కు సూచించాడు. దాంతో వరుణ్ ఇబ్బందుల్లో పడినట్టు కనిపించాడు. టాస్క్ కోసం అందరం చాలా కష్టపడ్డాం. 100 శాతానికి 110 శాతం ఎఫర్ట్ పెట్టాం. నా దృష్టిలో ఎవరూ కూడా కారణంగా కనపడటం లేదని చెప్పాడు.

భోరున ఏడ్చిన అలీ
ఆ తర్వాత ఇంటి సభ్యులందరి అభిప్రాయాలు తీసుకొని రెండు పేర్లను వరుణ్ చెప్పమన్నాడు. అందరి అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత ఎక్కువగా రాహుల్‌కు ఎనిమిది ఓట్లు, రవికృష్ణకు ఐదు అలీకి నాలుగు ఓట్లు వచ్చాయి. దాంతో రాహుల్‌ను, రవికృష్ణను జైలుకు పంపించారు. ఆ తర్వాత ఆలీ భోరున విలపిస్తూ కనిపించడంతో ఇంటి సభ్యులు ఓదార్చారు. ఏడుపు కారణమేమిటని అడుగగా అలీ చెప్పిన విషయానికి షాక్ అయ్యారు.

చేయని తప్పుకు రవికృష్ణ జైలుకు
ఇంటి సభ్యుల అభిప్రాయాలను తీసుకొనే సమయంలో నా పేరు చెబుతాడని రవికృష్ణ పేరును నేను చెప్పాను. కానీ రవికృష్ణ నా పేరు చెప్పకుండా నా అభిప్రాయాన్ని తప్పుని రుజువు చేశాడు. కేవలం నా పేరు చెబుతాడనే ఉద్దేశంతో టాస్క్ రద్దు కావడానికి కారణం రవికృష్ణ అని చెప్పాను. అనవసరంగా రవికృష్ణను జైలుకు పంపడం నాకు బాధ కలిగింది అని అలీ చెప్పాడు. అలీ చేసిన తప్పుకు అనవసరంగా రవికృష్ణ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టాస్క్‌లో దురుసుగా అలీ
వాస్తవానికి టాస్క్‌లో దురుసుగా ప్రవర్తించింది అలీ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వరుణ్ సందేశ్‌తోను, రాహుల్, రవికృష్ణతో మితీమిరిన బలాన్ని ప్రయోగించినట్టు కనిపించింది. అయితే ఇంటి సభ్యులు సరిగా గుర్తించకపోవడం, అలాగే టాస్క్‌లో వందశాతం ఎఫర్ట్ పెడుతారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడంతో అలీ బయటపడ్డాడు.

శిల్ప చక్రవర్తి కంటతడి
ఇక ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా ప్రవేశించిన శిల్ప చక్రవర్తి కూడా భోరున ఏడ్చింది. కారణం టాస్క్‌లో అలీ, రాహుల్ తనతో ప్రవర్తించిన తీరు బాగాలేదని చెప్పింది. వారు అలా చేస్తారని అనుకోలేదు అని వాపోయింది. శిల్ప బాధపడటాన్ని చూసి ఇంటి సభ్యులు ఆమెను ఓదార్చారు. ఆ సంఘటన అలా ఆమెను బాధలోకి నెట్టింది. దొంగల రాణిగా గెటప్‌లో శిల్ప ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











