twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛీ.. దిక్కుమాలిన టాస్క్.. రెచ్చిపోయిన ఆలీ, రాహుల్, రవికృష్ణ.. ఇద్దరికి జైలు శిక్ష

    |

    Recommended Video

    Bigg Boss Telugu Season 3: Episode 46 Highlights || Filmibeat Telugu

    బిగ్‌బాస్ రియాలిటీ షో కార్యక్రమం రసాభాసగా మారింది. దొంగలు దోచిన వస్తువుల టాస్క్‌ సెలబ్రిటీల మధ్య హింసను ప్రేరేపించింది. హింసకు తావులేదని పలుమార్లు బిగ్‌బాస్ హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. టాస్క్‌లో ఇంటి సభ్యులు రెచ్చిపోయి బుద్దిబలం కంటే భుజబలం ఉపయోగించడం ఇబ్బందిగా మారింది. దాంతో బిగ్‌బాస్ టాస్క్‌ను రద్దు చేయడమే కాదు ఇంటి సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఇంటి సభ్యులకు శిక్ష విదించారు. టాస్క్ రద్దు చేయడానికి కారణమేమిటంటే..

    ఇంటిలో ఘర్షణ వాతావరణం

    ఇంటిలో ఘర్షణ వాతావరణం

    మంగళవారం నాటి నుంచి దొంగలు దోచిన వస్తువులు టాస్క్ అగ్రెసివ్‌గానే సాగింది. పలుమార్లు బిగ్‌బాస్ హెచ్చరించినా లాభం లేకపోయింది. ముఖ్యంగా ఆలీ రెజా, రాహుల్, రవికృష్ణ, శ్రీముఖి, శిల్పా చక్రవర్తి మధ్య తోపులాట చోటుచేసుకొన్నది. ఇంటి సభ్యులు పూర్తిగా తమ బలాన్ని ఉపయోగించడంతో తోటి సెలబ్రిటీలు ఇబ్బందికి లోనయ్యారు. ఓ దశలో అలీ-వరుణ్, రవికృష్ణ-ఆలీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.

    హింసకు దారి తీయడంతో

    హింసకు దారి తీయడంతో

    ఆలీ-వరుణ్ మధ్య టాస్క్ హింసకు దారి తీయడంతో రాహుల్ జోక్యం చేసుకొన్నారు. శారీరకంగా బలం ఉపయోగించవద్దని రాహుల్ గట్టిగా మాట్లాడారు. రాహుల్ మాటలకు అంతే గట్టిగా సమాధానం ఇస్తూ అలీ గొడవకు దిగాడు. ఈ టాస్క్ ఇలానే ఉంటుంది. లాగేసుకోకుండా అడిగితే ఇవ్వరు కదా.. ఇస్తే ఈ టాస్క్ ఇలా ఎందుకు ఉంటుంది అని లాజిక్‌లు లేవనెత్తాడు. దాంతో ఇంటి సభ్యులకు అలీకి గొడవ జరిగింది.

    మితిమీరిన హింస

    మితిమీరిన హింస

    ఇక ఇంటి సభ్యులు మితీ మీరిన ప్రవర్తన చోటుచేసుకోవడంతో టాస్క్‌ను ఆపి.. మరోమారు బిగ్‌బాస్ హెచ్చరించారు. అయినా ఇంటి సభ్యుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. చివరకు టాస్క్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ఇంటి సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం దూరమైంది. అనంతరం సభ్యులను సమావేశపరిచి గట్టిగా క్లాస్ పీకారు. ఆట ఎంత హింసగా మారిందనే విషయం శిల్ప, వరుణ్‌కు తెలుసు అని బిగ్‌బాస్ అన్నారు.

    టాస్క్ రద్దు చేసి..

    టాస్క్ రద్దు చేసి..

    టాస్క్‌ నిబంధనలు, నియమాలు పక్కన పెట్టి ఆటను తప్పుదోవ పట్టించడంపై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి సభ్యులకు ఏదైనా హానీ జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే టాస్క్ రద్దు కావడానికి కారణమేవరనే విషయాన్ని ఇంటి సభ్యులను తేల్చమన్నారు. దాంతో ఎనిమిది మంది రాహుల్ పేరు చెప్పగా, ఐదుగురు రవికృష్ణ, నలుగురు అలీ పేరు చెప్పారు. దాంతో రాహుల్, రవికృష్ణకు జైలుశిక్ష విధించారు.

    రాహుల్, రవికృష్ణకు శిక్ష

    రాహుల్, రవికృష్ణకు శిక్ష

    టాస్క్ విఫలం కావడానికి కారణం కావడంతో రాహుల్, రవికృష్ణ జైలుగదిలోకి వెళ్లారు. ఇంటి సభ్యులుకు బిగ్‌బాస్ పంపే భోజనం మాత్రమే తినాలి. ఇంటి సభ్యులు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వకూడదు అని హెచ్చరించారు. దాంతో రాహుల్, రవికృష్ణ జైలులో ఉంటే.. ఇంటి సభ్యులు వారితో ముచ్చటిస్తూ కనిపించారు.

    శిల్ప ఏడుస్తూ

    శిల్ప ఏడుస్తూ

    టాస్క్ సందర్భంగా తనపై ఇంటి సభ్యులు చేసిన దాడి తీరుతో శిల్ప చక్రవర్తి మనస్తాపానికి గురయ్యారు. ఓ దశలో కంటతడి పెట్టుకొన్నారు. శిల్ప ఏడుపు చూసి వరుణ్, రాహుల్, శ్రీముఖి ఓదార్చారు. ఇంటి సభ్యులందరూ టాస్క్ సందర్భంగా అలిసిపోయినట్టు కనిపించారు. శ్రీముఖి తనతో రాహుల్ బిహేవ్ చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

    English summary
    Bigg Boss 3 Telugu reality show 37 day with high emotional content. on 4th weekend funny, furious moments registred in the house. Last week celebrity Ashu Reddy out from the Bigg Boss house. Bigg Boss Telugu 45 day highlights
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X