నాతో గడపవా?.. ఇదేమన్నా హానీమూనా? వితికపై వరుణ్ మండిపాటు
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో దొంగలు దోచిన వస్తువులు టాస్క్ అల్లకల్లోలం సృష్టించింది. టాస్క్‌లో మితి మీరిన హింసకు దారి తీయడంతో బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా టాస్క్‌ను రద్దు చేసి అందుకు కారణమైన ఇద్దరు సభ్యులకు జైలుశిక్ష విధించాడు. కెప్టెన్ వరుణ్‌కు ఇది ఒక తలనొప్పి అయితే.. భార్య పోరు ఎక్కువైనట్టు కనిపిస్తున్నది. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో వరుణ్, వితిక మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇంతకు గొడవకు కారణమేమిటంటే..

కపుల్ కంటెస్టెంట్‌గా
వరుణ్ సందేశ్, వితిక కపుల్ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ ఇంటిలోకి వచ్చారు. ఇలా భార్యభర్తలు జంటగా ఇంట్లోకి రావడం ఇదే తొలిసారి. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు ఆశించినంతగా కాంట్రవర్సీ వారిద్దరి మధ్య కనిపించలేదు. కానీ తాజాగా గొడవ కాస్త ఇంట్రెస్టుగా మారే అవకాశం ఉంది. అయితే వ్యూహంలో భాగంగానే ఇలాంటి గొడవ ప్లాన్ చేశారా? అనే అనుమానం కలుగుతున్నది.

వరుణ్, వితిక వాగ్వాదం
దొంగలు దోచిన వస్తువులు టాస్క్ రద్దు అనంతరం వితిక, వరుణ్ మధ్య భారీగానే వాగ్వాదం జరిగినట్టు అనిపించింది. ప్రసారమైన కంటెంట్ ప్రకారం.. నాతో కాసేపు గడపవచ్చు (స్పెండ్)గా అని అడిగితే.. వరుణ్ చికాకు పడ్డాడు. 24 గంటలు నీతోనే ఉంటున్నాను కదా.. ఇంకా స్పెండ్ అంటే ఏమిటీ అని వరుణ్ గట్టిగా దబాయించాడు దాంతో వితిక ఏడుపు అందుకొని కోపంతో ఊగిపోయింది.

కంటతడితో వితిక
వితిక ఏడుపును కూడా పట్టించుకోకుండా వరుణ్ సీరియస్ అవుతూనే ఉన్నాడు. మనం గేమ్ ఆడటానికి వచ్చాం. హానీమూన్‌కు వచ్చామా? అంటూ వరుణ్ కసురుకొన్నాడు. దాంతో వితిక ఇంకా హర్ట్ అయినట్టు కనిపించింది. ఇక వరుణ్‌కు గట్టిగానే వితిక జవాబు ఇచ్చింది. దాంతో వారిద్దరి మధ్య గొడవ ఎపిసోడ్‌పై మరింత క్యూరియాసిటీని పెంచే దిశగా ప్రోమోలు ప్రచారం చేస్తున్నారు.

వరుణ్‌పై వితిక ఫైర్
వరుణ్ తీరుపై బహిరంగంగానే వితిక అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఏ తప్పు అయితే చేయకూడదో అదే తప్పు చేస్తున్నావు. ఏ విషయం అయితే మాట్లాడకూడదో అదే విషయాన్ని మాట్లాడుతున్నావు అనే రీతిలో వితిక రెచ్చిపోయింది. ఇక గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఈ గొడవ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇది కాంట్రవర్సీగా మారితే నిస్సారంగా సాగుతున్న బిగ్‌బాస్‌కు కొంత జోష్ పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











