దుప్పటో దూరి భార్యతో వరుణ్ గొడవ.. బాత్రూంలో వితిక, పునర్నవి భోరుమని ఏడుపు..

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 47 Highlights ||

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 46వ రోజుకు చేరుకొన్నది. ఇంటిలో ఎప్పటి మాదిరిగానే ఏదో కారణంతో ఇంటి సభ్యుల్లో వితిక, పునర్నవి తదితరులు కన్నీళ్లు కార్చారు. ఇంటిలో ఈ వారానికి ఎన్నుకోవాల్సిన కెప్టెన్ పదవికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో బాబా భాస్కర్, శ్రీముఖి, హిమజ పోటీ పడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు కెప్టెన్ ఎన్నికయ్యారంటే..

వితిక, వరుణ్ గొడవ

వితిక, వరుణ్ గొడవ

భార్యభర్తల జోడిగా ఇంటిలోకి ఎంటరైన వితిక, వరుణ్ సందేశ్ మధ్య 45వ ఎపిసోడ్ గొడవ గురువారం కూడా కొనసాగింది. వారిద్దరి మధ్య భారీగా గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు అరుచుకొన్నారు. వితికను రెచ్చగొట్టే విధంగా వరుణ్ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దాంతో వితిక బాత్రూంలోకి వెళ్లి భోరున ఏడ్చింది. ఆ తర్వాత బాత్రూం వద్దకు వచ్చి కూడా వరుణ్ గొడవ పడ్డారు.

వితికను కించపరిచే విధంగా

వితికను కించపరిచే విధంగా

ఓ దశలో వరుణ్, వితిక మధ్య మాటల యుద్ధం జోరుగా సాగింది. వితిక ప్రవర్తనను కించపరిచే విధంగా వరుణ్ మాటాడటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో దయచేసి నన్ను కాసేపు వదిలిపొమ్మని వేడుకొన్నది. దాంతో వరుణ్ ఇంట్లోకి వెళ్లిపోయాడు. రాత్రి బెడ్‌పై పడుకొని దుప్పట్లో దూరిన తర్వాత కూడా ఆ గొడవ తాలుకు ముచ్చటగా గట్టిగానే కొనసాగింది.

బెడ్‌పైన కూడా లొల్లి

బెడ్‌పైన కూడా లొల్లి

రాత్రి బెడ్‌పై పడుకొని దుప్పట్లో దూరిన తర్వాత కూడా ఆ గొడవ తాలుకు ముచ్చటగా గట్టిగానే కొనసాగింది. అలాగే వితికను తక్కువ చేసి మాట్లాడటం కనిపించింది. ఒకరి గురించి నన్ను తక్కువ చేయవద్దని చెప్పింది. ఇంట్లో ఇలా జరుగుతుందనుకుంటే రాకపోయేదానిని. 100 రోజుల్లో 50 రోజులు కాలేదు. కావాలంటే నన్ను వచ్చేవారం నామినేట్ చేయి. నేను బయటకు వెళ్తాను అని వితిక గట్టిగా చెప్పింది.

వరుణ్, పునర్నవితో రాహుల్

వరుణ్, పునర్నవితో రాహుల్

ఇక రాహుల్, రవికృష్ణ జైలుశిక్ష గురువారం మధ్యాహ్నం కూడా కొనసాగింది. పునర్నవి ఏదో సలహా ఇవ్వబోతే పిచ్చిదానివి నీకేం తెలుసు అనగానే ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లి బ్రాత్రూంలో కూర్చొని ఏడ్చింది. ఆ తర్వాత వరుణ్ వచ్చి రవికృష్ణతో మాట్లాడేందుకు ప్రయత్నించగా రాహుల్ వారించాడు. దాంతో వరుణ్ హర్ట్ అయ్యాడు. రవికృష్ణ అనవసరంగా వరుణ్‌తో మాట్లాడకు. అది టాపిక్ మరోలా వెళ్తుందని రాహుల్ అనడంతో వరుణ్ కోపంగా వెళ్లిపోయాడు. రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇంట్లో కెప్టెన్సీ టాస్క్

ఇంట్లో కెప్టెన్సీ టాస్క్

ఇక ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. జైలులో ఉన్నందున్న రవికృష్ణ, రాహుల్ కెప్టెన్సీకి అనర్హులుగా మారారు. అలాగే ఇప్పటికే కెప్టెన్సీ చేసినందున వరుణ్, జ్యోతిక, అలీ ఈ పోటి నుంచి తప్పుకొన్నారు. ఇక బాబా భాస్కర్, హిమజ, శ్రీముఖి కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. అంతలోనే రాహుల్, రవికృష్ణకు జైలుశిక్ష నుంచి విముక్తి పొందారు. దాంతో వాళ్లు కెప్టెన్సీ టాస్క్‌లో జాయిన్ అయ్యారు.

కెప్టెన్‌గా బాబా భాస్కర్

కెప్టెన్‌గా బాబా భాస్కర్

కెప్టెన్స్ టాస్క్ ప్రారంభం కాగా, శ్రీముఖికి అలీ, బాబా భాస్కర్‌కు శిల్ప చక్రవర్తి, హిమజకు రాహుల్ సపోర్ట్ చేశారు. చివరకు ఈ పోటీలో కెప్టెన్‌గా బాబా భాస్కర్ గెలిచాడు. అందుకు బిగ్‌బాస్ ఆయనను అభినందించారు. అయితే టాస్క్ మధ్యలో అలీకి వరుణ్ సందేశ్‌కు గొడవ జరిగింది. ఆ గొడవ టాస్క్ తర్వాత కూడా కొనసాగింది. ఈ గొడవ నేపథ్యంలో బాబా భాస్కర్ నాకు కెప్టెన్సీ లేదని ఓ దశలో కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X