ఆడదాని వల్ల గెలిచాడు.. కెప్టెన్‌గా ఒప్పుకొను.. బాబా భాస్కర్‌‌పై శ్రీముఖి

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 48 Highlights ||

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో కెప్టెన్‌గా బాబా భాస్కర్ ఎన్నికైన తర్వాత హౌస్ ఫన్‌గా మారింది. బాబా మార్కు పాలన ఇంటిలో మొదలైంది. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా చోటుచేసుకొన్నఅంశాలపై ఇంటి సభ్యులు తమకు తోచిన విధంగా మాట్లాడుకొన్నారు. బాబా, శ్రీముఖి మధ్య ఫన్, సెటైరికల్ అంశాలు చోటుచేసుకొన్నాయి. బిగ్‌బాస్‌లో 46వ రోజు ఏం జరిగిందంటే..

బాబా భాస్కర్‌కు సారీ చెప్పిన శ్రీముఖి

బాబా భాస్కర్‌కు సారీ చెప్పిన శ్రీముఖి

కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా జరిగిన కొన్ని విషయాల కారణంగా శ్రీముఖిపై బాబా భాస్కర్ కోపంతో ఉన్నారు. శ్రీముఖితో మాట్లాడటం మానేశాడు. దాంతో బాబా భాస్కర్ వద్దకు వచ్చి.. ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగింది. నా తరఫు నుంచి ఏమైనా తప్పు ఉంటే క్షమించాలని అడిగింది. అలా చాలా సేపు సారీ చెప్పించుకొని, బతిమిలాడించుకొని బాబా భాస్కర్ ఒకే అన్నాడు.

పునర్నవి అసహనం

పునర్నవి అసహనం

ఇక ఇంటి సభ్యులపై పునర్నవి ఫైర్ అయింది. వరుణ్, వితికతో కలిసి తన అసహానాన్ని వెళ్లగక్కింది. గ్రూపిజం, ఫేవరేటిజం చూపిస్తున్నారని పునర్నవి మండిపడింది. దానికి వరుణ్, వితిక కూడా మద్దతు తెలిపింది. ఇలా ఉంటే ఇంటి సభ్యులు మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

బాబా భాస్కర్ తనదైన శైలిలో

బాబా భాస్కర్ తనదైన శైలిలో

ఇక బాబా భాస్కర్ కెప్టెన్సీ అయ్యాక తనదైన శైలిలో ఆదేశాలు జారీ చేశాడు. ఇంటిలో పొట్టిదుస్తులు వేసుకోవద్దు. ఇంగ్లీష్‌లో మాట్లాడుకోవచ్చు. ఫిజ్ తాగొచ్చు. మధ్యాహ్నం పడుకొండి.. కుక్కలు లేస్తే వెళ్లి కాఫీ తాగండి అంటూ బాబా భాస్కర్ ఫన్నీగా రూల్స్ విధించాడు. బాబా భాస్కర్‌ను రవికృష్ణ, రాహులు, మహేష్ భుజాలపై ఎత్తుకొని సమావేశానికి తీసుకొచ్చారు.

ఇంటి సభ్యులకు పనులు

ఇంటి సభ్యులకు పనులు

కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బాబా భాస్కర్ తనదైన పాలనను ప్రవేశపెట్టాడు. ఇంటిలో పనులను ఆయా వ్యక్తులకు కేటాయించారు. ఇక శ్రీముఖికి కఠినమైన పనులు అప్పగించాడు. స్విమ్మింగ్ పూల్, లాన్‌లో క్లీనింగ్ చేయమని చెప్పారు. శ్రీముఖిని వెంటపడి పనులు చేయించాడు. దాంతో బాబా భాస్కర్‌ను పలుమార్లు విసుక్కొన్నది.

ఆడదాని వల్ల గెలిచాడు

ఆడదాని వల్ల గెలిచాడు

బాబా భాస్కర్‌పై శ్రీముఖి ఫన్నీగా అసహనం వ్యక్తం చేసింది. కెప్టెన్‌గా బాబా భాస్కర్ నచ్చలేదు. ఆడదాని వాళ్ల గెలిచాడు.. ఆయన వల్ల నా జీవితం బార్బాద్ అయిపోయింది. ఆయనను కెప్టెన్సీ అంగీకరించాను. ప్రతీ మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుంది. ఇది నిజమని బాబా భాస్కర్ విజయంలో రుజువైంది అంటూ శ్రీముఖి డైలాగ్స్ కొట్టింది. ఈ మాటలు విన్న నోరు లేస్తుంది.. ఏమిటీ అంటూ శ్రీముఖిపై బాబా అరవడంతో ఆమె మాటలు ఆపేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X