అందర్నీ నామినేట్ చేస్తా.. బిగ్‌బాస్ వార్నింగ్.. నోయల్‌కు చెమటలు.. జబర్దస్తీగా ఇంటి కెప్టెన్
బిగ్‌బాస్ తెలుగు 4 హౌస్‌లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న లగ్జరీ బడ్జెట్ టాస్క్ ముగియడంతో ఎనిమిదో వారంలో ఇంటిలో కెప్టెన్సీ కోసం టాస్క్‌కు బిగ్‌బాస్ తెరలేపారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపిక జరిగింది. అయితే కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఝలక్ ఇవ్వడం గమనార్హం. ఈ వారం కెప్టెన్సీ కోసం ఎవరెవరూ పోటీ పడుతున్నారు. ఎవరు కెప్టెన్సీగా ఎన్నికయ్యారనే విషయంలోకి వెళ్తే..

లగ్గరీ బడ్జెట్ టాస్క్‌లో
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో మంచి పెర్ఫార్మెన్స్ చూపారంటూ మానవులు, రాక్షసులు టీమ్‌ను బిగ్‌బాస్ అభినందించారు. ఆ తర్వాత ఈ టాస్క్‌లో మంచి ప్రతిభ చూపిన ఇద్దరిని, చెత్తగా ఆడిన మరో ఇద్దరి పేర్లు చెప్పమని బిగ్‌బాస్ ఆదేశించాడు. అయితే ఇంటి సభ్యులు మేము నిర్ణయించుకోలేకపోతున్నాం. మీరే డిసైడ్ చేయండి అంటూ బిగ్‌బాస్‌కు ఇంటి సభ్యులు సూచించారు. అయితే ఇంటి సభ్యుల ప్రవర్తనపై బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు.

ఇంటి సభ్యులందరికీ బిగ్‌బాస్ వార్నింగ్
లగ్జరీ బడ్డెట్ టాస్క్‌లోని ఇద్దరేసి పేర్లను చెప్పకపోతే ఇంటి సభ్యులందరిని నామినేట్ చేస్తాను అంటూ బిగ్‌బాస్ హెచ్చరించారు. ఆ తర్వా త కెప్టెన్ నోయల్ సీన్‌ను పేర్లు చెప్పమని ఆదేశించారు. దాంతో నోయల్ సీన్ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో అవినాష్, అరియానా బాగా ఆడారు. నేను వారిద్దరి పేర్లు చెబుతున్నాను అంటూ నోయల్ ఇద్దరి పేర్లను ప్రకటించారు. ఆ తర్వాత చెత్తగా ఆడిన వారి పేర్లు చెప్పకపోవడంతో అరియానా, అవినాష్‌ను కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేశారు.

కెప్టెన్సీ కోసం అవినాష్, అరియానా
ఇక అరియానా, అవినాష్ కెప్టెన్సీ కోసం తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. అవినాష్ పెద్దగా ప్రయత్నించినట్టు కనిపించలేదు. అయితే అరియానా మాత్రం కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సపోర్ట్ చేయాలని అడగడం కనిపించింది. సోహైల్, అఖిల్‌ను తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇలా ఇంటి సభ్యుల మద్దతును అరియానా కూడగట్టే ప్రయత్నం చేశారు.

నీకు ఎవరు సపోర్ట్ చేసినా హ్యాపీనే
అరియానా మద్దతు కూడగట్టడంపై అవినాష్ స్పందించారు. నా ఫ్రెండ్‌వి నీవు కనుక నాకు హ్యాపీగానే ఉంది. నీకు ఇంటి సభ్యులు ఎవరైనా సపోర్ట్ చేసినా నేను సంతోషిస్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్‌కు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే నాకు హ్యాపీ అంటూ అవినాష్ చెప్పడం కనిపించింది. ఇలా కెప్టెన్సీ కోసం ఇంటిలో ప్రచారం జోరందుకొన్నది.
Recommended Video

కొత్త కెప్టెన్‌గా అవినాష్
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇంటిలో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో అరియానాకు ఎక్కువ సపోర్ట్ లభించినట్టు తెలిసింది. అయితే ఈ టాస్క్‌లో అరియానాపై అవినాష్ పై చేయి సాధించి కెప్టెన్సీగా ఎన్నికయ్యారనే విషయం బయటకు వచ్చింది. ఎనిమిదో వారానికి కెప్టెన్‌గా అవినాష్ కొనసాగనున్నారు. తొలిసారి కెప్టెన్సీ పదవి చేపట్టబోతున్న అవినాష్ తొమ్మిదివారం ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి బయటపడుతారు.


Click it and Unblock the Notifications











