దోషిగా మారిన రాహుల్.. అయినా అందరికీ షాక్.. శ్రీముఖి, రవి, మహేష్, అలీపై ఎలిమినేషన్ కత్తి

బిగ్‌బాస్ వీకెండ్ స్పెషల్ ఫన్నీగా, ఎమోషనల్‌గా సాగింది. 48 రోజున కొన్ని గేమ్స్‌తోపాటు నాగార్జున ఇంటి సభ్యులతో గేమ్ ఆడించారు. అంతేకాకుండా వారు వ్యవహరిస్తున్న తీరుపై క్లాస్ పీకారు. కొన్ని మంచి సలహాలు ఇచ్చారు. కొన్ని సూచలను పాటించమని చెప్పారు. ఇక చివరిలో ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న ఐదుగురిలో నుంచి ఒకరిని సేఫ్ చేశారు. ఇంతకు ఎవరు సేఫ్ అయ్యారంటే...

ప్రొడక్ట్స్‌తో గేమ్

ప్రొడక్ట్స్‌తో గేమ్

ఇంటిలో వాతావరణం ఖుషీ ఖుషీగా కనిపించింది. గందరగోళం తక్కువగానే కనిపించింది. ఇంటి సభ్యులతో బిగ్‌బాస్ టీఎంసీ ప్రొడక్ట్స్‌తో రింగు ఆట ఆడించారు. కొన్ని ప్రొడక్ట్ పేర్లతో కూడిన కొన్ని ఫ్రేములు పెట్టి రింగు వేయమని కోరాడు. ఈ గేమ్‌లో లక్కీ డ్రాలో రవికృష్ణకు టీఎంసీ బహుమతి లభించింది.

దోషి ఎవరు.. నిర్దోషి ఎవరు

దోషి ఎవరు.. నిర్దోషి ఎవరు

ఇక ఇంటి సభ్యులతో నాగార్జున సమావేశమైనాడు. ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించాడు. దోషి.. నిర్ధోషి అని రాసి ఉన్న ప్లేకార్డులను ఇచ్చి ఇంటి సభ్యుల్లో ఎవరు దోషి.. ఎవరు నిర్దోషి అని తేల్చాలని చెప్పారు. అలాగే బాబా భాస్కర్‌ను ఇన్స్‌పెక్టర్‌గా, జ్యోతిని కానిస్టేబుల్‌గా నియమించాడు.

అలీ, రాహుల్‌పై ఫిర్యాదులు

అలీ, రాహుల్‌పై ఫిర్యాదులు

ఇంటి సభ్యుల్లో ఒక్కక్కరిని.. తమకు నచ్చని వ్యక్తి ఎందుకు నచ్చలేదో చెప్పమని అడిగాడు. ఎక్కువ మంది అలీ, రాహుల్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే శ్రీముఖికి నాగ్ ఝలక్ ఇచ్చాడు. అలీని కాకుండా, రవికృష్ణను ఎందుకు జైలుకు పంపావని అడిగాడు. ఓవరాల్‌గా ఈ చర్చలో రాహుల్, అలీ రెజా దోషులుగా మారారు.

రంగంలోకి నాగార్జున

రంగంలోకి నాగార్జున

ఆ తర్వాత నాగార్జున స్వయంగా రంగంలోకి దిగాడు. ఒక్కొక్కరి బలం, బలహీనతలను గురించి చెప్పాడు. ముఖ్యంగా వితికకు కొన్ని సూచనలు ఇచ్చాడు. వరుణ్ తన గేమ్‌ను ఆడుకోనివ్వమని.. ప్రతీసారి ఏడ్చి ఆయన గేమ్‌ను పాడు చేయవద్దని చెప్పాడడు. దాంతో వితిక సరే అని అన్నారు. అలాగే ఆమెను ఎందుకు టార్చర్ చేశావని వరుణ్‌కు చురకలంటించాడు.

రాహుల్ సేఫ్

రాహుల్ సేఫ్

ఇక చివర్లో రాహుల్, శ్రీముఖి, మహేష్, రవికృష్ణ, అలీ రెజాను యాక్టివిటీ రూమ్‌కు పిలిపించాడు. వారిని ఓ చోట నిలచోపెట్టి లైట్లు ఆన్ ఆఫ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు. ఈ ఎలిమినేషన్ పక్రియ నుంచి రాహుల్‌ను సేఫ్ చేశాడు. ఎక్కువ మంది ఫిర్యాదు చేసినా ముందుగా రాహుల్ సేఫ్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X