twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ ఇంటిలో అడుగుపెట్టిన గంగవ్వ.. బాండ్ పేపర్ మీద రాసిస్తా అంటూ కంటెస్టెంట్ల రచ్చ

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది.అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ షో మరో రెండు రోజుల్లో ముగియనున్నది. దాంతో ఇప్పటి వరకు ఈ సీజన్‌లో పాల్గొన్న సభ్యులందరూ ఇంటిలోకి ప్రవేశించారు. దాంతో ఇంటి వాతావరణం మరోసారి రచ్చగా మారింది. ఆ రచ్చ ఎలా ఉందంటే..

    టాప్ 5 కంటెస్టెంట్లతో ఇంటి సభ్యులు

    టాప్ 5 కంటెస్టెంట్లతో ఇంటి సభ్యులు

    కరోనావైరస్ భయాందోళనల కారణంగా ఇంటి సభ్యులందర్నీ గ్లాస్ హౌస్‌కే పరిమితం చేశారు. గ్లాస్‌కు ఒక పక్క టాప్ 5 కంటెస్టెంట్లు.. మరో పక్క ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా మ్యూజిక్ వినిపించగానే అఖిల్, సోహెల్ పరుగులు పెట్టి వచ్చారు. వారికి మోనాల్ కనిపించడంతో సంతోషంలో మునిగిపోయారు.

    అఖిల్‌ను మోనాల్ గాఢంగా కౌగిలించుకొని

    అఖిల్‌ను మోనాల్ గాఢంగా కౌగిలించుకొని

    అఖిల్‌ను గాఢంగా మోనాల్ కౌగిలించుకొనేందుకు ప్రయత్నించగా అద్దం అడ్డుపడింది. దాంతో అద్దం ఓన్లీ ప్రాబ్లెంగా ఉంది అంటూ తహతహలాడింది. అంతలోనే బిగ్‌బాస్ ఇంటిలో 9వ వండర్ ఏమిటో తెలుసా? నీవు ఏడవకపోవడమే అంటూ మోనాల్‌తో సోహెల్ అనడం కనిపించింది.

    కరాటే కల్యాణి, యాంకర్ లాస్య ఇంటిలోకి

    కరాటే కల్యాణి, యాంకర్ లాస్య ఇంటిలోకి

    కరాటే కల్యాణి ఇంటిలోకి హుషారుగా ప్రవేశించింది. ఆ తర్వాత లాస్య ఇంట్లోకి మళ్లీ అడుగుపెట్టింది. దాంతో వంటలక్కలిద్దరూ వచ్చారు అంటూ సోహెల్ టీజ్ చేస్తూ కనిపించారు. జనాలు నీ కోసం బయటకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంటూ సోహెల్‌కు మోనాల్ చెప్పడంతో ఆనందంతో గంతులు వేశాడు.

    యాంకర్ లాస్య ఫన్నీ గేమ్స్‌తో

    యాంకర్ లాస్య ఫన్నీ గేమ్స్‌తో

    ఇక లాస్య ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించింది. అఖిల్‌కు ఎక్కువ హగ్స్ లభించాయి. అవునా కాదా అంటూ ప్లకార్డులు ప్రదర్శించాలి. అయితే ఎక్కువ మంది అవును అంటూ చెప్పడంతో అఖిల్ ఎగిరి గంతులు వేశాడు. అభిజిత్‌ ఇంటిలోనే డ్యాన్స్ నేర్చుకొన్నాడు అంటే.. అవును అందరూ అన్నారు. దాంతో అభిజిత్‌కు డ్యాన్స్ రాదు అంటే.. అందులో డౌటా? బాండ్ పేపర్ మీద రాసిస్తా అంటూ అఖిల్ అనడం కనిపించింది

    జంటలుగా డ్యాన్సులు చేస్తూ..

    జంటలుగా డ్యాన్సులు చేస్తూ..

    ఇక బిగ్‌బాస్ ఇంటిలోకి గంగవ్వ అడుగుపెట్టడంతో అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. ఆ తర్వాత కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ జంటగా, దివి, మోహబూబ్ జంటగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత అవినాష్ నీటుగా టక్ చేసుకొని.. ప్రొఫెషనల్‌గా ఇంటిలోకి అడుగుపెట్టారు. ఇలా ఇంటిలో వాతావరణం హాట్ హాట్‌గా మారింది.

    English summary
    Bigg Boss Telugu 4s 104th day update: Abijeet is going on top slot of voted in App related. But Reports suggest that Ariana Glory tops over Abijeet in missed call data. Bigg Biss Telugu 4 grand finale is going to organise on December 20th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X