ఎలిమినేషన్‌లో బిగ్‌బాస్ బిగ్ ట్విస్టు.. అఖిల్‌కు బంపర్ ఆఫర్.. అభిజిత్, లాస్య, హారికకు షాక్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో దీపావళీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హెస్ట్ నాగార్జున తన ఇంటి నుంచి ఇంటి సభ్యులకు గిఫ్టులు తెచ్చారు. అమల వాటిని కొనుగోలు చేసి మీకు పంపించిందని చెప్పడంతో ఇంటి సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు. ఆ తర్వాత దీపావళీ సందర్భంగా ఫన్ గేమ్స్ ఆడించారు. ఇంటిలో 69వ రోజు ఏం జరిగిందంటే..

నాగార్జున పాటలకు డ్యాన్స్
వేదికపైకి హోస్ట్‌గా నాగార్జున రాగానే ఇంటి సభ్యులందరూ సర్‌ప్రైజ్ ఇచ్చారు. నాగార్జున పాటలకు డ్యాన్సులు చేసి అదరగొట్టారు. అభిజిత్, లాస్య ఓ జంటగా, అరియానా, అవినాష్ మరో జంటగా, సోహైల్, మోనాల్ మరో జంటగా, అలాగే హరిక, మెహబూబ్ పాటలకు డ్యాన్సుల చేశారు.

ఇంటి సభ్యులకు నాగార్జున షాక్
బిగ్‌బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులు తమకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ట్యాగ్‌తో అఖిల్‌ను ఇంటి నుంచి బయటకు పంపించడం తప్పు అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశాలను, రూల్స్‌ను సరిగా పాటించలేదు. అర్ధం చేసుకోలేదు. ఇక మీరు పంపించిన అఖిల్‌కు ప్రాపర్‌గా వీడ్కోలు చెబుదాం అని నాగార్జున అనడంతో మోనాల్ ఏడుపు ముఖం పెట్టింది.

ఇంటిలో దీపావళి వేడుకలు
ఆ తర్వాత ఇంటి సభ్యులతో దీపావళీ సెలబ్రేషన్స్ ప్రారంభించారు. చిచ్చు బుడ్డీ, ఆటం బాబు బొమ్మలు ఇచ్చి ఎవరికి సరిపోతాయో చెప్పమన్నారు. ఎక్కువ మంది చిచ్చు బుడ్డిని సోహైల్‌కు, ఆటం బాంబును మెహబూబ్‌కు ఇచ్చారు. ఇక గేమ్ సందర్భంగా ఇంటి సభ్యులు ఫన్‌లో మునిగి తేలారు.

అఖిల్‌ను ఏడిపించిన నాగార్జున
ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్‌తో నాగార్జున మాట్లాడారు. ఇంటి సభ్యులు బయటకు పంపించేటప్పుడు డిఫెండ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. మీరు సూట్‌కేసు సర్దుకొని ఇంటిలోకి వెళ్లి సభ్యులతో సెల్పీ తీసుకొని వేదికపైకి రమ్మని అడిగాడు. దాంతో బలవంతంగా ఇంటిలోకి పంపించారు. ఇంటి సభ్యులను కలిసి సెల్ఫీ తీసుకొన్న తర్వాత అఖిల్‌తో ఓ గేమ్ ఆడించారు.

మిత్రులు, శత్రువులు వీరే..
అఖిల్‌తో గేమ్ ఆడిస్తూ.. రెండు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ ఉన్నాయి. నీకు ఇష్టమైన వ్యక్తికి తొడిగి రీజన్స్ చెప్పాలి. అలాగే నలుగురు శత్రువుల పేర్లు చెప్పాలి. మిగితా వారు న్యూట్రల్‌గా ఉంటారు అని బిగ్ బాస్ ఆదేశలిచ్చారు. మోనాల్, సోహైల్‌ను ఫ్రెండ్స్‌గా ట్రీట్ చేశారు. అభిజిత్, హారిక, లాస్య, మెహబూబ్‌ను శత్రువులుగా ఎంపిక చేసుకొన్నారు.
Recommended Video

అఖిల్ సేఫ్.. ఇంటి కెప్టెన్‌గా నియామకం
ఆ తర్వాత బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చారు. అఖిల్ ఇంటి నుంచి వెళ్లిపోవడం లేదు. మీతోనే ఉంటాడు అని షాక్ ఇచ్చారు. దాంతో ఇంటి సభ్యులందరూ హ్యాపీగా ఫీలయ్యారు. అంతేకాకుండా చిన్న గేమ్ ఆడించి అఖిల్‌ను ఇంటి కెప్టెన్ చేయడంతో బంపర్ ఆఫర్ లభించింది .


Click it and Unblock the Notifications











