పచ్చ కామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే.. నువ్వే ఫేక్.. అభిజిత్, హారికపై అఖిల్ ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో అఖిల్ కొద్ది రోజులుగా సీక్రెట్ రూమ్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. శనివారం ఎపిసోడ్‌లో అఖిల్‌ను సీక్రెట్ రూమ్ నుంచి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత హౌస్‌లో ఇంటి సభ్యుల మధ్య హైడ్రామా చోటుచేసుకొన్నది. ఇంటిలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు అనే విషయాన్ని తెలుపాలని బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో అఖిల్ సహనం కోల్పోయినట్టు కనిపించారు. తనను సీక్రెట్ రూమ్‌కు పంపిన తర్వాత అభిజిత్, హారిక, లాస్య చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..

సానుభూతి అనేదే లేదు..
ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాల తర్వాత అభిజిత్‌పై అఖిల్ మండిపడ్డారు. సింపతీ అంటూ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అఖిల్ తప్పుపట్టారు. నీ పక్కన ఏదో పడిపోయింది చూసుకో.. అంటూ అవహేళన చేశాడు. నీ ఆలోచన కింద పడింది చూసుకో అంటూ కామెంట్ చేశాడు. సింపతీ అనే పదం ఉపయోగించినందుకు అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమోషనల్‌గా అఖిల్ మాట్లాడుతుండగా అభిజిత్ కామ్‌గా ఉండిపోయాడు.

సింపతి, బ్లఫ్ పదాలు ఎలా ఉపయోగిస్తావు
సింపతి అనే పదం ఉందని నేను అనుకోను. అలా ఉంటే బస్టాండ్లు, ఆలయాలు, రైల్వే స్టేషన్ల వద్ద ఎవరూ అడుక్కోరు. నా దృష్టిలో సింపతి అనే పదం లేదు అంటూ కామెంట్ చేశారు. సింపతి ఎలా వస్తుందని అనుకొన్నావు. సింపతి, బ్లఫ్ అనే పదాలు ఎలా ఉపయోగిస్తావు అంటూ అఖిల్ నిలదీశాడు.

నీకు లోకమంత పచ్చగానే ఉంటుంది
నీవు ఇంట్లో ఫేక్ వ్యక్తి ఉన్నాడంటూ లెటర్‌లో రాసినప్పుడు కూడా నేను పట్టించుకోలేదు అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. ఇంటిలో ఒక వ్యక్తి నటిస్తున్నాడు అంటూ లెటర్‌లో రాశావు. పచ్చ కామెర్లు వచ్చినోడికే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. నీకు అలానే కనిపిస్తున్నది. నీవు ఫేక్ అయితేనే ఎదుటి వాడు ఫేక్‌గా కనిపిస్తాడు అని అఖిల్ మండిపడ్డారు.
Recommended Video

నువ్వు నన్ను ఎప్పుడన్నా లవ్ చేశావా?
ఇక హారికతో మాట్లాడుతూ... సింపతి కార్డులు పనిచేయవు అని అన్నావు కదా.. ఎన్నిసార్లు నువ్వు సానుభూతి కార్డులు ఉపయోగించావు. నీ వద్ద కార్డులు ఉన్నాయనుకొంటా కదా.. నీవు మంచి అనుభవంతో నాపై కామెంట్ చేశావనుకొంటాను. ఐ హేట్ యూ అన్నావు.. నీవు నన్ను ఓ ఫ్రెండ్‌గా ఎప్పుడు నీవు లవ్ చేశావు అంటూ అఖిల్ నిలదీశాడు.


Click it and Unblock the Notifications











