చికెన్ షాపు ముందు కోడి డాన్సా? ఇదేనా నీ మెచ్యురిటీ.. లాస్యను కడిగిపారేసిన అఖిల్

బిగ్‌బాస్ ఇంటిలోని సీక్రెట్ రూమ్‌లో మూడు రోజులుగా గడిపిన అఖిల్ సార్థక్‌ను హైడ్రామా వద్ద ఇంటిలోకి తీసుకొచ్చారు. అనంతరం ఎలిమినేషన్‌కు ముందు నీకు చిన్న టాస్క్ ఇస్తున్నాం. దానిని పూర్తి చేసి బయటకు వెళ్లాలి అంటూ హోస్ట్ నాగార్జున చెప్పారు. దాంతో మిత్రులు, శత్రువులు ఎవరనే విషయంపై గేమ్ ఆడించారు. ఆ గేమ్ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ..

ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్తే ఇలానా?

ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్తే ఇలానా?

యాంకర్ లాస్యను ఉద్దేశించి.. మీరు ఏం మాట్లాడుతారో అర్ధం కాలేదు. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతే మీరు అలా ఎలా మాట్లాడుతారు. ఒక వ్యక్తి గురించి మీరు చూపించే తీరు అదేనా అంటూ అఖిల్ నిలదీశాడు. మీరు మాట్లాడిన మాటలు అలాంటి సందర్భంలో మాట్లాడవచ్చా అంటూ అఖిల్ ప్రశ్నించాడు. దాంతో అఖిల్ మాటలను మౌనంగా వింటూ లాస్య కనిపించింది.

మీరు మాట్లాడేది స్టయిల్ అంటూ..

మీరు మాట్లాడేది స్టయిల్ అంటూ..

తనను బయటకు పంపించిన తర్వాత మీరు అలా దారుణంగా కామెంట్ చేస్తారా?.. చికెన్ షాప్ ముందు చికెన్ డ్యాన్స్ చేసుకొంటూ వెళ్లిపోయింది. మటన్ కొట్టే షాపు వాడు గడ్డి చూపిస్తే మేక లోపలికి వెళ్లింది. ఆ తర్వాత ఏమైంది? అంటూ కామెంట్ చేశారు. ఇది ఇంట్లో మీరు మాట్లాడే స్టయిల్ అంటూ యాంకర్ లాస్యను అఖిల్ ప్రశ్నించారు.

నాపై అలాంటి జోకులా?

నాపై అలాంటి జోకులా?

ఇంటిలో పెద్ద వ్యక్తిగా మీరు చూపించే మెచ్యురిటీ ఇదేనా? నీ విలువలు ఇవేనా? ఒక వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత ఇలాంటి జోకులు వేస్తారా? గట్టిగా నవ్వుకొంటూ బ్లఫ్ అంటారా? అలా మాట్లాడటం కరెక్ట్ సమయమేనా? అని అఖిల్ ప్రశ్నించాడు. దాంతో ఏదో నవ్వుకుంటూ మాట్లాడాను అని లాస్య సమాధానం ఇచ్చింది. అయితే నువ్వు ఎప్పుడూ నవ్వుకుంటే ఇలాంటి కామెంట్లు చేస్తారు అక్కా అంటూ అఖిల్ కామెంట్ చేశాడు.

నేను ఎంత బాధపడ్డానో తెలుసా?

నేను ఎంత బాధపడ్డానో తెలుసా?

అభిజిత్ మటన్ కొట్టు అని అన్నప్పుడు నీవు చికెన్ షాపు వాడి కామెంట్ ఎలా చేస్తావు. నేను ఎంద బాధపడ్డానో తెలుసా? ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన సమయంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ముందు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఎలిమినేట్ అవుతున్నాననే భయం కూడా లేదు అని అఖిల్ సమాధానం చెప్పాడు.

Recommended Video

KothiKommachi Team Interview Part 05 | Satish Vegesna About Movie And Cast
మెహబూబ్‌కు క్లాస్ పీకిన అఖిల్

మెహబూబ్‌కు క్లాస్ పీకిన అఖిల్

ఇక మెహబూబ్‌ను నిలదీస్తూ.. నీవు గేమ్ ఆడేటప్పుడు అంతా నీకే కావాలని కోరుకొంటావు. ఎప్పుడు నీకే నీకే కావాలని కోరుకోకు. ఎదుటి వాడి గేమ్‌ను కూడా చూడు. అలా ఉంటే వేరే వ్యక్తి నీకు హెల్ప్ కూడా చేయడు. కొన్ని విషయాలను కొంచెం గుర్తు పెట్టుకొంటే చాలూ అంటూ క్లాస్ పీకాడు. అయితే అఖిల్ చేసిన కామెంట్లకు స్పందిస్తూ.. రియలైజ్ అయ్యాను అంటూ మెహబూబ్ సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X