మెహబూబ్ ఎలిమినేషన్‌లో హైడ్రామా.. నాగార్జునతో సహా అందరూ ఎమోషనల్. భోరుమంటూ సోహైల్
బిగ్‌బాస్ ఇంటి నుంచి మరో ఇంటి సభ్యుడు నిష్క్రమించాడు. దాదాపు 70 రోజులపాటు ఇంటిని తన డ్యాన్స్, ఆటపాటలతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన మోహబూబ్ దిల్‌సే ఇంటి నుంచి నిష్క్రమించాడు. హోస్ట్ నాగార్జునతోపాటు ఇంటి సభ్యులందరూ ఎమోషనల్‌గా మారారు. మెహబూబ్‌ను ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా సాగింది. 70వ రోజు ఇంటిలో ఏం జరిగిందంటే.

సండే ఫన్‌డే కావడంతో
బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఆదివారం ఇంటి సభ్యులకు ఫన్‌డే కావడంతో హోస్ట్ నాగార్జున అందర్ని ఆటపాటలతో ముంచెత్తారు. అలా ఆడుతూనే మధ్యలో నామినేట్ అయిన సభ్యులతో ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. అభిజిత్‌కు ఓ కవర్ ఇచ్చి అందులో ఎవరి పేరు ఉందో తెలియజేమని అడిగితే.. అరియానా పేరు ఉండటంతో ఆమె సేఫ్ అని ప్రకటించారు. అలా అభిజిత్ చేతుల మీదుగా అరియానా సేఫ్.. ప్రేక్షకులకు, బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పారు.

మోనాల్‌ను సేఫ్ అలా..
సినిమా పేర్లను డ్రాయింగ్ చేసే గేమ్‌ను ఇంటి సభ్యులతో ఆడించారు. అనంతరం గంట చేతిలోకి ఇచ్చి ఎవరి చేతిలో మోగుతుందో వారు సేఫ్ అని రూల్ చెప్పారు. ఈ గేమ్‌లో మోనాల్ చేతిలో గంట మోగడంతో ఆమె సేఫ్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

లాస్య చేతుల మీదుగా హారిక దేత్తడి
ఆ తర్వాత కొబ్బరికాయ తెరపైకి తెచ్చి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. లాస్య కొబ్బరికాయ కొట్టడంతో అందులో ఓ చిట్టి బయటపడింది. ఆ చిట్టీలో హారిక పేరు ఉండటంతో ఆమెను సేఫ్ చేశారు. ఇక మిగిలింది సోహైల్, మెహబూబ్ ఉండటంతో ఇంటిలో హైడ్రామా నడిచింది.

మోహబూబ్ ఎలిమినేషన్‌లో హైడ్రామా
రెండు లైట్స్‌ను సోహైల్, మెహబూబ్ ముందు పెట్టి.. వాటిపై చేతులు పెట్టారు. ఎవరి చేతి కింద రెడ్ లైట్ వెలుగుతుందో వారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పారు. ఈ ప్రక్రియలో మెహబూబ్ చేతి కింద రెడ్ లైట్ వెలుగడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంతలో మెహబూబ్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున చెప్పారు.

కన్నీటిపర్యంతమైన సోహైల్, ఇంటి సభ్యులు
దాంతో ఇంటి సభ్యుల్లో భావోద్వేగం పెల్లుబికింది. సోహైల్ అల్లా అంటూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీటి పర్యంతమై మెహబూబ్‌ను కౌగిలించుకొన్నాడు. అలా ఏడస్తూనే ఇంటి సభ్యులతో ఫోటో దిగి బయటకు వచ్చాడు. మెహబూబ్‌కు ఇంటి సభ్యులదరూ కన్నీటి వీడ్కోలు పలికారు.

నాగార్జునను బాధతో కౌగిలించుకొని..
ఆ తర్వాత వేదికపైకి వచ్చి నాగార్జున బాధతో కౌగిలించుకొన్నాడు. అనంతరం ఇంటిలో జర్నీ చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత అవినాష్‌ను ఒకవారం మటన్ తినకుండా బిగ్‌బాంబ్ వేశాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు కల్ హో నా హో చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేసి ఇంటి నుంచి నిష్క్రమించాడు.


Click it and Unblock the Notifications











