Bigg Boss Telugu 10వ వారం నామినేషన్స్ లిస్టు లీక్.. మోనాల్‌తోపాటు.. నామినేట్ అయిన ఐదుగురు ఎవరంటే..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 10వ వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ప్రస్తుత వారం కోసం నామినేషన్ల ప్రక్రియ ఇంటిలో ముగిసింది. ఇంటి సభ్యుల్లో ఎవరు నామినేట్ అయ్యారనే విషయం బయటకు లీక్ అయింది. ఇక బిగ్‌బాస్ నుంచి 9వ ఎవరు అవుట్ అవుతారనే విషయంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారంటే..

అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్ తర్వాత
బిగ్‌బాస్ తెలుగు 4 నుంచి 9వ వారంలో కంటెస్టెంట్ అమ్మా రాజశేఖర్ బయటకు వెళ్లిపోయారు. కెప్టెన్‌గా ఉంటూ ఎలిమినేట్ అయిన వ్యక్తిగా తెలుగు బిగ్‌బాస్‌లో ఓ చరిత్ర సృష్టించారు. ఎలిమినేట్ కావడం నాకు బాధగా లేదు.. నన్ను చాలా ఆనందంగా బయటకు పంపిస్తున్నారు అంటూ నాగార్జునతో అమ్మా రాజశేఖర్ ఓ మాట చెప్పడం జరిగింది. ఇక నామినేషన్ల ప్రక్రియను కూడా బిగ్‌బాస్ ఆరంభించడం గమనార్హం.

మీ కంటే మేమే బెటర్ అంటూ
బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో 10వ వారం కోసం నామినేషన్ల ప్రక్రియను బిగ్‌బాస్ చేపట్టారు. ఇంటి సభ్యులు ఇంట్లో తమ అనుభవాలను ఆధారంగా చేసుకొని కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. ఇంటిలో వారికి ఉండే అర్హతలేదనే అభిప్రాయానికి వచ్చారు. వారికంటే తామే బెటర్ అనే విషయాన్ని బయటకు చెప్పారు. అభిజిత్‌ను అఖిల్ నామినేట్ చేయడం షాక్‌కు గురిచేసే అంశంగా మారింది.

గందరగోళం మధ్య నామినేషన్ల ప్రక్రియ
ఇక 10వ వారం నామినేషన్ల సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య పెద్ద యుద్ధమే జరిగిందనే విషయం స్పష్టంగా తెలిసింది. ఎందుకు నామినేట్ చేస్తున్నామనే విషయాన్ని తెలిపినప్పుడు ఇంటి సభ్యుల మధ్య భారీగా వాగ్వాదం జరిగిందనే లీక్ అయింది. ఓ దశలో ఇంటిలో మాటల యుద్ధంతో గందరగోళం జరిగింది.

10 వారానికి నామినేట్ అయింది వీరే
ఇదిలా ఉంటే.. 10వ వారం నామినేట్ అయిన వారిలో అభిజిత్, అరియానా, మెహబూబ్, మోనాల్, హారిక, సోహైల్ ఉన్నారు. ఇక పదోవారంలో ఈ ఆరుగురు కఠిన పరీక్షను ఎదుర్కోబోతున్నారు. బిగ్‌బాస్ ముగియడానికి సన్నద్ధమవుతున్న సమయంలో ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.

ఎలిమినేషన్ తప్పించుకొన్న అఖిల్
ఇక 10వ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకొన్న వారిలో అఖిల్,యాంకర్ లాస్య, అవినాష్ ఉన్నారు. అవినాష్‌కు ఇమ్యునిటీ లభించడంతో ఈ వారం వేటు నుంచి తప్పించుకోవడం గమనార్హం. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











