Bigg Boss 4 Elimination వేటు తప్పించుకొన్న మోనాల్ గజ్జర్.. షాకింగ్‌గా ఇంటి నుంచి ఆమె అవుట్
బిగ్ బాస్ షోలో పదకొండో వారం ఎలిమినేషన్‌లో అందరూ అనుకున్నది తారుమారైంది. పదకొండో వారంలో అభిజిత్ హారిక లాస్య సోహెల్ అరియానా మోనాల్ నామినేట్ అయ్యారు. అయితే ఈ పదకొండో వారంలో లేడీ కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్తుందని అందరూ ఊహించారు. ఆ ఊహే నిజమైంది. లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిందని లీకులు హోరెత్తిస్తున్నాయి. అయితే ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

నలుగురు అమ్మాయిలు..
పదకొండో వారంలో అమ్మాయిలందరూ నామినేట్ అయ్యారు. అభిజిత్ సోహెల్ ఎలాగూ ఎలిమినేట్ కారన్న సంగతి తెలిసిందే. అయితే అందరూ కూడా మోనాల్ ఇంటి నుంచి బయటకు వెళ్తుందని భావించారు. అందులో భాగంగానే కొన్ని పోల్స్‌లోనూ మోనాల్‌కు తక్కువ ఓటింగ్ రావడంతో అందరూ అదే ఫిక్స్ అయ్యారు.

ముగ్గురు డేంజర్ జోన్‌లో..
అయితే అరియానా తప్పా మిగిలిన ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారని టాక్ వచ్చింది. అందులో మరీ ముఖ్యంగా మోనాల్ లాస్యలు దిగువ స్థానంలో ఉన్నారని సోషల్ మీడియాలో ట్రెండ్ నడిచింది. అభిజిత్ అందరి కంటే టాప్ పొజిషన్‌లో ఉన్నాడని, ఆ తరువాత సోహెల్ అరియానా హారిక మోనాల్ లాస్యలు వరుస స్థానాల్లో ఉన్నారని బిగ్ బాస్ ఫాలోవర్స్ కామెంట్లు చేశారు.

లాస్యకు మూడింది..
అయితే అందరూ ఊహించన దానికి భిన్నంగా లాస్య ఎలిమినేట్ అయిందని టాక్ బయటకు వచ్చింది. ఈ మేరకు లీకులు రావడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. మోనాల్ మళ్లీ సేవ్ అయిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లోనూ మోనాల్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడంతో గ్రాఫ్ పెరిగిందని టాక్.

అఖిల్ ఫ్యాన్స్ వల్లేనా?
అయితే మోనాల్ ప్రతీసారి సేవ్ అవుతూనే వస్తుంది. దానికి కారణం అఖిల్‌కు ఉన్న ఫ్యాన్స్ మోనాల్‌కి కూడా ఓట్లు వేస్తుండటమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా ఈ సారి కూడా ఎలిమినేషన్ వేటు నుంచి మోనాల్ తప్పించుకుంది. లాస్య చిక్కుకుందని తెలుస్తోంది.

అదే కారణమా?
లాస్య ఇంట్లో ఉండి వంటలు వండటం తప్పా ఆడింది ఏమీ లేదని నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ అసహనమే లాస్య ఎలిమినేషన్‌కు కారణమై ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా లాస్య ఎలిమినేషన్ అయిందా లేదా అన్నది ఆదివారం నాటి ఎపిసోడ్‌తో క్లారిటీ వస్తుంది.


Click it and Unblock the Notifications











